క్లీనర్ నుంచి భారత్‌లోనే అతిపెద్ద టీ కేఫ్ పెట్టేవరకు కేఫ్ నీలోఫర్ ఫౌండర్ కథ | Hitech City Cafe Niloufer
ఇటీవలే హైటెక్ సిటీలో ఇండియాలోనే అతిపెద్ద టీ కేఫ్ (Hitech City Cafe Niloufer) ప్రారంభించారు కేఫ్ నిర్వహాకులు. ప్రస్తుతం ఈ కేఫ్ రెంటు విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఒక టీ కేఫ్‌కు రెంటు ఈ మాత్రం ఉంటుందా అని చాలా మంది ముక్కున వేలేసుకుంటున్నారు. ఎందుకంటే నెలకు రూ.40 లక్షల రెంటు కట్టేలా 10 సంవత్సరాల పాటు లీజ్‌కు తీసుకున్నారు.
హైదరాబాద్ ప్రజలకు ఇరానీ ఛాయ్ అంటే ఒక ఇమోషన్. బాధైనా, సంతోషమైనా ఒక కప్పు ఇరానీ ఛాయ్ ఉండాల్సిందే. దేశ విదేశాల నుంచి వచ్చే అతిథులు కూడా బిర్యానీ (Hyderabad Biryani) తరువాత ఎక్కువగా ఇష్టపడేది హైదరాబాదీ ఇరానీ ఛాయ్ (Irani Chai) మాత్రమే.
ప్రస్తుతం హైదరాబాద్ వ్యాప్తంగా ఎన్నో కేఫ్‌లో ఇరానీ ఛాయ్ దొరుకుతోంది. అందులో తనదైన విభిన్నమైన రుచితో ఛాయ్ లవర్స్ మనసు గెలుచుకుంటోంది కేఫ్ నీలోఫర్ టీ. ఇటీవలే హైటెక్ సిటీలో ఇండియాలోనే అతిపెద్ద టీ కేఫ్ (Hitech City Cafe Niloufer) ప్రారంభించారు కేఫ్ నిర్వహాకులు. ప్రస్తుతం ఈ కేఫ్ రెంటు విషయం హాట్ టాపిక్‌గా మారింది.
ముఖ్యాంశాలు
కేఫ్ నీలోఫర్ @ హైటెక్ సిటీ | Hitech City Cafe Niloufer

హైదరాబాద్ టీ కల్చర్‌లో కేఫ్ నీలోఫర్‌కు ప్రత్యేక స్థానం ఉంది. నగర వాసులకు గరంగరం టీతో పాటు అద్భుతమైన అనుభవాన్ని అందిస్తున్నఈ కేఫ్ ఇటీవలే హైటెక్ సిటీలో కొత్త రెస్టారెంటును ప్రారంభించింది.
40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 700 మంది అతిథులకు కమ్మనీ టీ అందించే విధంగా ఈ కేఫేను ఏర్పాటు చేశారు. క్యాజువల్ మీటప్తో పాటు, కార్పొరేట్ గ్యాథెరింగ్స్ కోసం ఈ కొత్త కేఫ్ మంచి డెస్టినేషన్‌గా మారే అవకాశం ఉంది.
అత్యాధునిక సదుపాయాలు | Features

హైదరాబాద్‌లో లక్డీకాపూల్, హియాయత్‌నగర్, బంజారాహిల్స్, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కేఫ్ నీలోఫర్, ఛాయ్ ప్రియులకు ప్రీమియం టీ అందిస్తోంది. అయితే హైటెక్ సిటీలో ఉన్న కేఫ్ నీలోఫర్ మిగితావాటికన్నా భిన్నం అని అని చెప్పవచ్చు.
ఇక్కడ రెండు టన్నుల నీలోఫర్ కెటిల్ ఆఫ్ లవ్ అనే ఒక కెటిల్‌ను ఏర్పాటు చేశారు. ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే సంప్రదాయంతో పాటు ఆధునికతను కలబోతతో డిజైన్ చేశారు. ఈ కేఫ్ నీలోఫర్ రెండవ అంతస్తుల్లో ఎక్స్‌క్లూసీవ్ గ్యాథెరింగ్ జోన్స్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ సోషల్, కార్పొరేట్ ఈవెంట్స్ చేసే అవకాశం కల్పిస్తారు.
ఔట్‌డోర్ ఏరియాల్లో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కలిసి ఆకాశాన్ని, ఎదురుగా ఉన్న ఐటీ హబ్ చూస్తూ మీల్స్ ఎంజాయ్ చేయవచ్చుు.
మెన్యూలో ఉన్న హైలైట్స్ | Cafe Niloufer Menu

కేఫ్ నీలోఫర్‌లో ఉన్న మెన్యూ టీ అండ్ కుకీస్ లవర్స్‌కు ప్యారడైజ్ లాంటిది..
- ఇరానీ టీ | Irani Tea : ట్రెడిషనల్ కెటిల్ పాట్స్‌లో సర్వ్ చేసే ఇరానీ ఛాయ్‌ని తప్పకుండా ట్రై చేయాల్సిందే.
- బన్ మస్కా | Bus Maska పాత బస్తీలో బాగా పాపులర్ అయిన స్నాక్ ఇది. బటర్‌తో సర్వ్ చేసే ఈ స్నాక్ సూపర్ టేస్టీగా ఉంటుంది.
- మలై బన్ | Malai Bun: ఛాయ్‌తో పాటు చాలా మంది తీసుకునే టేస్టీ స్నాక్ ఇది.
- ఇది కూడా చదవండి : ఇక్కడ మారేడు దళం నీటిలో వేస్తే , కాశి గంగలో తేలుతుందంట | Kadali Kapoteswara Swamy Temple
- కునాఫా ఛీజ్‌కేక్ | Kunafa Cheese Cake : ఇది ఒక ఫ్యూజన్ డిష్. మిడిల్ ఈస్ట్ ఫ్లేవర్‌తో పాటు లోకల్ టేస్ట్ కాంబినేషన్లో ఇది ఉంటుంది.
- మిల్లెట్ డిషెస్, రైస్ కాంబో : స్నాక్స్‌ను మంచిన ఆకలికి ఇది మంచి ఛాయిస్ అవుతుంది.
వీటితో పాటు కేఫ్ నీలోఫర్ మెన్యూలో ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. మీరు వెళ్లినప్పుడు ప్రశాంతంగా ఎక్స్ప్లోర్ చేయండి. మీ టేస్ట్ అండ్ రెస్టారెంటు, బ్రాంచిని బట్టి కేఫ్ నీలోఫర్‌లో టీ, స్నాక్స్ ధరలు అనేవి అనేవి రూ.12 నుంచి రూ.50, రూ.250 వరకు ఉంటుంది. మీరు కొనే పదార్థాన్ని బట్టి రేటు మారుతుంది..
రెంటు, వ్యాపార విశిష్టతలు

హైటెక్ సిటీలో కొత్తగా ప్రారంభమైన కేఫ్ నీలోఫర్ భారత్‌లోనే అతిపెద్ద టీ కేఫ్ ( Indias Biggest Tea Cafe ) అని నిర్వాకులు అంటున్నారు. దేశ విదేశాల కార్పొరేట్ సంస్థల బిల్డింగ్ నడుమ ఉన్న ఈ కేఫ్ రెంటు విషయం ఇప్పుడు జాతీయ వ్యాప్తంగా చర్చల్లో ఉంది.
ఒక టీ కేఫ్‌కు రెంటు ఈ మాత్రం ఉంటుందా అని చాలా మంది ముక్కున వేలేసుకుంటున్నారు. ఎందుకంటే నెలకు రూ.40 లక్షల రెంటు కట్టేలా 10 సంవత్సరాల పాటు లీజ్‌కు తీసుకున్నారు.
ఛాయ్ లవర్స్ ఎక్కడ ఉన్నా వారికి దగ్గరిలో ఒక కేఫ్ ఏర్పాటు చేయడం, తద్వారా వారికి విలాసవంతమైన డైనింగ్ ఎక్స్‌పీరియెన్స్ కలిగించడమే లక్ష్యంగా దూసుకెళ్తోంది కేఫ్ నీలోఫర్.
ఆసక్తికరమైన విషయాలు | Facts About Cafe Niloufer
మనస్పూర్తిగా కష్టపడితే విజయం తప్పకుండా వరిస్తుంది అని చెప్పడానకి కేఫ్ నీలోఫర్ కథనే ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. జేబులో చిల్లి గవ్వలేకుండా 1975లో అదిలాబాద్ నుంచి హైదరాబాద్ వచ్చిన కేఫ్ నీలోఫర్ ఫౌండర్ బాబూరావు ప్రయాణం అంత సాఫీగా సాగలేదు.

చిన్నా చితకా పనులు చేస్తూ రైల్వే ప్లాట్‌ఫామ్‌లపై పడుకునేవాడు బాబూ రావు (Cafe Niloufer Founder Babu Rao). అయితే కేఫ్ నీలోఫర్‌లో క్లీనర్‌గా చేరడం అతని జీవితంలో టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. కష్టపడే తన స్వభావంతో క్లీనర్ నుంచి వెయిటర్, తరువాత కిచెన్ మేనేజర్‌గా ప్రమోషన్ తెచ్చుకున్నాడు.
సూపర్ టీతో మనసు గెలచుకుని…
బాబూ రావు తయారు చేసిన ఉస్మానియా బిస్కెట్స్ అండ్ టీ హాట్ కేకుల్లా అమ్ముడవడం గమనించిన యజమాని అతనికి కేఫ్‌ను మేనేజ్ చేసే అవకాశం ఇచ్చాడు. కేఫ్ నీలోఫర్ నిర్వాహణ బాధ్యతలు తీసుకున్న తరువాత అక్కడ ప్రతీ రోజు 20,000 కప్పుల టీలు అమ్ముడయ్యేవి. ఇరానీ ఛాయ్‌కు మారుపేరుగా మారిపోయింది కేఫ్ నీలోఫర్. 1983లో తను దాచుకున్న డబ్బుతో హోటల్‌ను కొనుగోలు చేశాడు.

1983 నుంచి నేడు హైటెక్ సిటీలో కేఫ్ నీలోఫర్ తెరిచేంత వరకూ కూడా బాబూ రావు ఎప్పుడూ క్వాలిటీ విషయం కాంప్రమైజ్ కాలేదు. అందుకే ఛాయ్ బాబులు నీలోఫర్ హోటల్ ముందు వాలిపోతుంటారు. కేవలం టీ అమ్మడమే కాదు వివిధ రకాల టీ పౌడర్లతో ( Niloufer Tea Powder) రీటైలింగ్‌లోకి కూడా ప్రవేశించింది కేఫ్ నీలోఫర్.
జీవితంలో ఇన్ని విజయాలు, ఇంత అభిమానాన్ని సొంతం చేసుకున్నా కూడా ఒక సాధారణ వ్యక్తిలాగే ఉండటానికి ఇష్టపడతాడు బాబురావు. కష్టాల్లో తనకు తోచిన సాయం చేస్తుంటారు. వివిధ ఆసుపత్రుల్లో ఉన్న పేషెంట్లకు భోజనం అందించడం చేస్తుంటారు. బేకరీలో మిగిలిన, పాడుకాని ఆహార పదార్థాలను కూడా ఆకలితో ఉన్నవారికి పంచుతుంటాడు.
📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.