సంక్రాంతి తర్వాత హైదరాబాద్ రిటర్న్: స్మార్ట్ ప్లాన్ ఇదే | After Sankranti Hyderabad Return Smart Plan
After Sankranti Hyderabad Return Smart Plan : సంక్రాంతి తర్వాత ఆంధ్రా నుంచి హైదరాబాద్‌కు స్మార్ట్‌గా ఎలా రిటర్న్ అవ్వాలి? టికెట్ బుక్ చేయకుంటే ఆప్షన్స్ ఏంటి ? రష్ ఎవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి..ప్రాక్టికల్ గైడ్ ఇది.
సంక్రాంతి హాలిడేస్ అనేవి జనవరి 16 వరకు ఉంటాయి. కుటుంబ సభ్యులతో చిల్ అవుతున్న టైమ్‌లో, “అరే… రిటర్న్ జర్నీ ఎలా?” అనే ఆలోచన వస్తే గుండె జిల్మంటుంది.
చాలా మంది సంక్రాంతి సెలవులు ముగిసిన వెంటనే జనవరి 17వ తేదీ నుంచి రిటర్న్ అవ్వడం మొదలు పెడతారు.ఎంత త్వరగా చేరుకుంటే అంత త్వరగా రిలాక్స్ అయ్యి జాబ్‌లో, కాలేజీల్లో, ఇతర పనుల్లో జాయిన్ అవ్వొచ్చు అనేది బేసిక్ ఐడియా. ఈ ఐడియా బాగానే ఉంటుంది.
రిటర్న్ జర్నీకి టికెట్ బుకింగ్ అయిపోయితే ప్రశాంతంగా వచ్చేయొచ్చు. కానీ సమస్య అంతా ముందస్తు టికెట్లు లేని ప్రయాణం గురించే.
ముఖ్యాంశాలు
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొంత మంది రిటర్న్ జర్నీ ఇప్పటికే ప్లాన్ చేసుకున్నారు. కొంత మంది బయల్దేరారు కూడా. మరోవైపు APSRTC, TGSRTC బస్సు టికెట్లు హాట్‌కేకుల్లా సోల్డ్ అవుతున్నాయి. ప్రైవేట్ బస్సుల్లో ₹1000 టికెట్‌కు ₹2000, ₹3000 లేదా అంతకంటే ఎక్కువ చెల్లించే పరిస్థితి వచ్చింది.
ఇక మీరు కూడా జనవరి 17 నుంచి 19 మధ్యలో రిటర్న్ జర్నీ ప్లాన్ చేస్తే, ఈ కింది ఆప్షన్స్ ట్రై చేయవచ్చు.
మార్నింగ్ ఆర్టీసీ విండో
ఆర్టీసీ పోర్టల్స్‌లో ఉదయం 5 నుంచి 8 మధ్య లాస్ట్ మినిట్ సీట్లు రిలీజ్ అవ్వడం, కేన్సిలేషన్స్ అప్డేట్ అవుతుంటాయి. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలంటే జనరల్‌గా కాకుండా డిపోలు మార్చి మార్చి టికెట్ బుక్ చేయడానికి ట్రై చేయండి.
ఎవరైనా కేన్సిల్ చేసి ఉంటే అక్కడ టికెట్ దొరికే అవకాశం ఉంది. కానీ గ్యారంటీ మాత్రం ఇవ్వడం కష్టం.
- ఇది కూడా చదవండి : సంక్రాంతికి ఏపీఎస్ఆర్టీసి 8432 స్పెషల్ బస్సులు | APSRTC Sankranti 2026 Special Buses – Travel Guide
డైరెక్ట్ టికెట్ దొరక్కపోతే
రెండు పెద్ద నగరాలు లేదా పాపులర్ డెస్టినేషన్స్ మధ్య నడిచే రవాణా వ్యవస్థల్లో, సంక్రాంతి లాంటి సమయంలో టికెట్లు ముందే బుక్ అవుతాయి.
అందుకే డైరెక్ట్ కాకుండా టూ-లెగ్ ప్లాన్ చేయండి.
ఉదాహరణకు మీరు వైజాగ్ నుంచి హైదరాబాద్ ప్లాన్ చేస్తుంటే, టికెట్ దొరకకపోతే:
– వైజాగ్ నుంచి రాజమండ్రి
– లేదా విజయవాడ
అక్కడి నుంచి హైదరాబాద్ ట్రై చేయవచ్చు. ఇవి ఐడియాలు మాత్రమే. మీరు మీ వంతు క్రియేటివిటీతో ట్రై చేయండి.
ఇలా చేయడం వల్ల టికెట్ దొరికే అవకాశం పెరుగుతుంది. మీ ప్రయాణం ముందుకు సాగుతుంది.
ప్రైవేట్ బస్సు ప్యానిక్ |After Sankranti Hyderabad Return Smart Plan
సంక్రాంతి సమయంలో ప్రైవేట్ బస్సుల ధరలు సాధారణ స్థాయికి రెట్టింపు, మూడు నాలుగు రెట్ల వరకు పెరుగుతాయి. Times of India కథనం ప్రకారం, ఒక ప్రయాణికుడు వైజాగ్ నుంచి హైదరాబాద్ వరకు బస్సు ప్రయాణానికి ₹4,500 వరకు చెల్లించాడు.
అదే విషయాన్ని RedBus, AbhiBus యాప్‌లలో చెక్ చేస్తే ₹2000 నుంచి ₹4449 వరకు టికెట్ చార్జీలు యాప్‌లోనే మెన్షన్ అయ్యాయి.
TGSRTC : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వెబ్సైట్లో జనవరి 17 తేదీకి టికెట్లు చెక్ చేస్తే ₹1038, ₹1272 ధరల టికెట్లు పూర్తిగా సోల్డ్ అవుట్ అయ్యాయి.
అయితే ₹1500 నుంచి ₹2598 రేంజ్లో ఉన్న టికెట్లు మాత్రం అందుబాటులో ఉన్నట్టు కనిపించింది.
APSRTC: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వెబ్సైట్లో కూడా అదే తేదీకి ఆల్మోస్ట్ అన్ని టికెట్లు బుక్ అయ్యాయి. కేవలం ₹996 రేంజ్లో కొన్ని టికెట్లు మాత్రమే కనిపించాయి.
అందుకే తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ప్రయత్నిస్తే టికెట్ దొరికే అవకాశం ఉంది. లేదా తేదీలు మార్చి ప్రైవేట్ యాప్స్ లేదా ఏపీ ఆర్టీసీ వెబ్సైట్లో ట్రై చేయవచ్చు.
- ఇది కూడా చదవండి : సంక్రాంతికి TGSRTC స్పెషల్ బస్సులు | కంప్లీట్ గైడ్ | TGSRTC Sankranti Special Buses 2026
ప్రశాంతంగా రావాలంటే
ఈ హడావిడి కాకుండా ప్రశాంతంగా రావాలంటే జనవరి 19 తేదీకి ప్లాన్ చేసుకోవచ్చుఊరిలో ఒకటి రెండు రోజులు ఎక్కువ ఉన్నట్టే ఉంటుంది. వీకెండ్, సంక్రాంతి రష్ను ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు. నాలుగు పైసలు సేవ్ కూడా అవుతాయి.
ట్రైన్ వెయిటింగ్ లిస్ట్ రిస్క్
రిటర్న్ జర్నీకి ట్రైన్ టికెట్ వెయిటింగ్ లిస్టులో ఉంటే మనసులో చిన్న టెన్షన్ ఉండటం కామన్.ఈ సమయంలో కేన్సిల్ చేసేవారు దాదాపు శూన్యం. పెద్దలు, పిల్లలు, కుటుంబంతో కలిసి జనరల్ బోగీలో ప్రయాణం అంటే సంక్రాంతి మజా మొత్తం మాయం అవుతుంది.
ఆరోగ్యం, సేఫ్టీ రెండూ పణంగా పెట్టాల్సి వస్తే ఒకసారి ఆలోచించాల్సిందే.
ముఖ్యమైన విషయం
ఈ సంక్రాంతి రష్ సాధారణంగా రెండు మూడు రోజులు మాత్రమే ఉంటుంది. వీకెండ్ కలిస్తే రష్ ఇంకా ఎక్కువ అవుతుంది.రెండు రోజులు వెయిట్ చేయగలిగితే చక్కగా ప్లాన్ చేసుకుని సుఖంగా ప్రయాణించవచ్చు. లేదంటే వెంటనే వెళ్లాల్సి ఉంటే, ఈ గైడ్ మీ ప్లానింగ్‌కు క్లారిటీ ఇస్తుంది.
“మీరు ఎక్కడికైనా వెళ్లే ముందు గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ‘Prayanikudu’ అని చివర యాడ్ చేయండి. ఉదాహరణకు : Warangal Prayanikudu ఇలా వెతకండి… తప్పుడు సమాచారంతో ఇబ్బంది పడకుండా ప్రయాణించండి (Travel Without Mistake).”
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
