Tirupati : తిరుమలలో సరికొత్త టెక్నాలజీ.. భక్తుల భద్రతకు ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్!
Tirupati : తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి రోజూ వేలాది మంది భక్తులు వస్తుంటారు. అయితే, ఈ భక్తుల కష్టాలను గుర్తించి, వాటిని పరిష్కరించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఒక సరికొత్త టెక్నాలజీని తీసుకువచ్చింది.
టీటీడీ ఛైర్మన్ నిర్ణయం మేరకు ఎన్నారైల సహాయంతో దేశంలోనే తొలిసారిగా తిరుమలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) ఏర్పాటు చేశారు. ఈ సెంటర్‌ను వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లోని 25వ కంపార్ట్మెంట్లో ఏర్పాటు చేశారు.
ఈ రోజు ఉదయం సీఎం చంద్రబాబు ఈ సెంటర్‌ను ప్రారంభించబోతున్నారు. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా భక్తుల రద్దీని నియంత్రించడం, వసతి సౌకర్యాలు మెరుగుపరచడం, భద్రత కల్పించడం లాంటివి చాలా సులభం అవుతాయి.
ఏఐ కంట్రోల్ సెంటర్ ఎలా పనిచేస్తుంది?
నిరంతర పర్యవేక్షణ: ఐసీసీసీలోని పెద్ద డిజిటల్ స్క్రీన్‌పై తిరుమల, తిరుపతిలోని అన్ని విభాగాల సీసీటీవీ ఫుటేజీలు కనిపిస్తాయి. దీనిని 25 మందికి పైగా టెక్నికల్ సిబ్బంది నిరంతరంగా పర్యవేక్షిస్తారు.
ఇది కూడా చదవండి : అంటార్కిటికా : 70 శాతం మంచినీరు ఇక్కడే ఉంది…రాత్రి సూరీడు…పగలు చీకటి
రద్దీ నియంత్రణ: అలిపిరి నుంచి భక్తుల రద్దీని ప్రత్యేక కెమెరాలతో ఏఐ అంచనా వేస్తుంది. క్యూలైన్లలో ఎంతమంది భక్తులు ఉన్నారో, వారు ఎంతసేపటి నుంచి వేచి చూస్తున్నారో ఏఐ ట్రాక్ చేస్తుంది. అలాగే, దర్శనానికి పట్టే సమయాన్ని కూడా ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంది.
క్రైమ్ కంట్రోల్: ముఖ గుర్తింపు టెక్నాలజీ ద్వారా ఏఐ భక్తులను గుర్తిస్తుంది. తద్వారా దొంగతనాలు, ఇతర అవాంఛనీయ సంఘటనలను గుర్తించి వాటిని అరికడుతుంది. ఎవరైనా తప్పిపోతే వారిని కూడా గుర్తిస్తుంది.
భక్తుల కష్టాలు తెలుసుకోవడం: భక్తుల ముఖ కదలికలను బట్టి వారు పడుతున్న ఇబ్బందులను ఏఐ గుర్తిస్తుంది. తద్వారా అధికారులు వారికి త్వరగా సహాయం అందించవచ్చు.
రియల్-టైమ్ మ్యాపింగ్: క్యూలైన్స్, వసతి, ఇతర సౌకర్యాలను 3డీ మ్యాప్‌లు, చిత్రాలతో రియల్-టైమ్‌లో చూపిస్తుంది. రద్దీగా ఉండే ప్రాంతాలను ఎరుపు రంగులో చూపిస్తుంది, తద్వారా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవచ్చు.
ఇది కూడా చదవండి : Milaf Cola : ఖర్జూరంతో సాఫ్ట్ డ్రింక్ లాంచ్ చేసిన సౌదీ అరేబియా
సైబర్ భద్రత: ఆన్లైన్లో టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించే సైబర్ దాడులు, సోషల్ మీడియా పోస్టులు, తప్పుడు సమాచారం లాంటివాటిని కూడా ఈ టెక్నాలజీ గుర్తిస్తుంది.
అత్యవసర పరిస్థితులు: ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే, భక్తులను సురక్షితంగా బయటకు పంపించడానికి దగ్గరలో ఉన్న మార్గాలను ఈ టెక్నాలజీ చూపిస్తుంది.
ఈ కొత్త టెక్నాలజీ భక్తుల అనుభవాలను ఎప్పటికప్పుడు తెలుసుకుని, శ్రీవారి దర్శనాన్ని మరింత సౌకర్యవంతంగా చేయడానికి ఉపయోగపడుతుంది.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
