Arunachalam : అరుణాచల పర్వతంపైకి వెళ్లొచ్చా ? గిరి ప్రదక్షిణ ఏ సమయంలో చేయాలి ?
Arunachalam : శివుడి ఆఙ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. అందుకే అరుణాచలం వెళ్లాను అని అనడం కన్నా అరుణాచలేశ్వరుడు తన వద్దకు నన్ను రప్పించుకున్నాడు అని అంటాను నేను.
“మధురై మీనాక్షి, బృహదీశ్వర, పళని ఆలయాల యాత్ర తరువాత
నేను నా స్నేహితుడు సంతోష్‌తో,
నాకు దేవుడితో సమానమైన టీచర్ వరదరాజు సర్‌తో
పరమపవిత్రమైన ఈ నేలని చేరుకున్నా.
ఇది మనసు మీద ముద్ర వేసిన ఒక ప్రత్యేక యాత్ర ఇది.”

మధురై టు అరుణాచలం
మా ఈ తీర్థయాత్రలో తమిళనాడులోని ఎన్నో ప్రాచీన ఆలయాలను సందర్శిస్తూ… అరుణాచలం మీదుగా తిరుమల వెళ్లాలని ప్లాన్ చేశాము. ప్లాన్‌లో భాగంగా మదురై మీనాక్షి అమ్మవారి దర్శనం (Madurai Meenakashi Amman Temple) అనంతరం తరువణ్ణమలై బయల్దేరాం. తిరువణ్ణమలై అంటే అరుణాచలమే.
మదురై నుంచి అరుణాచలం యాత్రలో ఆకాశం ఒక చిత్రకారుడి కాన్వాస్ కనిపించింది. చుట్టుపక్కల ఎటువైపు చూసినా ప్రకృతి రమణీయత…చిన్నప్పుడు మనం పేపర్‌పై వేసే ఫేవరిట్ పెయింటింగ్స్‌ను లైవ్‌లో చూస్తున్నట్టుగా ఉంటుంది ప్రయాణంలో కనిపించే సీన్స్.
అరుణాచలం స్థల పురాణం | Arunachalam Story
“ఒకసారి… బ్రహ్మ, విష్ణువులు తమలో ఎవరు గొప్పవారు అనేది తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు.
అప్పుడు శివుడు ఒక అగ్నిజ్యోతి స్థంభంగా ప్రత్యక్షమయ్యాడు.
ఆ జ్యోతి అరంభం, అంతం కనుక్కోవడం బ్రహ్మ, విష్ణువులకు కూడా సాధ్యం కాలేదు.
అనంతరం ఆ అనంత అగ్ని చల్లబడి దాల్చిన రూపమే అరుణాచల పర్వతం అంటారు..”
అందుకే పంచభూత ఆలయాల్లో అరుణాచలాన్ని ‘అగ్ని స్థలం’గా పిలుస్తారు..
అరుణాచలం చేరుకునే వరకు చేరుకునే వరకు రాత్రి 11.30 అయింది. కన్ను మూసి తెరిచేలోపు సూర్యోదయం అయింది.
బ్రేక్‌ఫాస్ట్ చేసి గిరి ప్రదక్షిణ చేయాలనే సింపుల్ ప్లాన్ ఫిక్స్ చేసుకునే సుమారు 9 గంటలకు ప్రదక్షిణ మొదలు పెట్టాం.
అరుణాచలం గిరి ప్రదక్షిణ అనేది నా వ్యక్తిగత యాత్ర కాబట్టి వీలైనంత తక్కువగా వీడియోలు తీశాను.
Watch : అరుణాచలం చరిత్ర, ఎలా వెళ్లాలి ? గిరి ప్రదక్షిణ టిప్స్ కోసం కింది వీడియో చూడండి
అరుణాచల గిరిని అధిరోహించవచ్చా ? | Can You Climb Arunachala Giri ?
పంచ భూత స్థలాల్లో మహా శివుడు ఆత్మలింగంగా, ఆగ్నిలింగంగా కొలువైన పవిత్ర క్షేత్రం అరుణాచలం. అందుకే ఆలయం పరిసరాలకు భిన్నంగా ఆలయం లోపలి భాగంలో వేడిగా ఉంటుందంటారు.
అరుణాచల పర్వతంపైకి వెళ్లొచ్చా?
ఒక్క ముక్కలో చెప్పాలంటే…నో..ఆధ్మాత్మికంగానూ, చట్టరీత్యా కూడా అరుణాచల పర్వతంపై కాలుమోపడం నిషేదం.

అరుణాచల గిరిపై ఒక గుహ వద్ద ఉన్న మర్రి చెట్టువద్ద దక్షిణ మూర్తి స్వరూపుడైన సిద్ధయోగిగా మహా శివుడు ఇప్పటికీ కూర్చుని ధ్యానం చేస్తుంటారని కొంత మంది భక్తుల నమ్మకం. అందుకే నేటికీ ఈ గిరిని పర్వతం అని కాకుండా మహాశివుడు ధ్యానంలో కూర్చున్న ప్రదేశంగా కూడా పిలుస్తుంటారు.
రమణ మహర్షితో సహా చాలా మంది భక్తులు కొండపై శివుడి దర్శనం కోసం ప్రయత్నించారట. అయితే చాలా మంది భక్తులు ఇబ్బందులుకు గురయ్యారని….ప్రస్తుతం గిరి వద్దకు వెళ్లడం చట్టరిత్యా నేరం అని తెలుసుకుని ఎవరూ ఆ ప్రయత్నం చేయడం లేదు. ఎవరైనా ప్రయత్నించినా అది సాధ్యం కాదంటారు. ఎందుకంటే ఇది గిరి మాత్రమే కాదు. అగ్ని అంటే ఫైరు..ఫైరుపై ఎవరైనా కాళ్లు మోపగలరా…మోపినా శివుడి ఆగ్రహానికి తట్టుకోలగరా ?
మీరు అరుణాచలం వెళ్తే రమణాశ్రమం (Sri Ramanasramam Arunachalam) వెళ్లడం మాత్రం మిస్ అవ్వకండి. ధ్యాన మందిరంలో కూర్చుని ప్రపంచాన్ని మరిచి ధ్యానం చేసే భక్తుల మధ్య మీరు కూడా కూర్చుని ప్రశాంతతను ఆస్వాదించవచ్చు.
Watch : పళని ఆలయం చరిత్ర, ఎలా వెళ్లాలి ? ఆలయం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి
గిరి ప్రదక్షిణ | Arunachala Giri Pradakshina Tips
చాలా మంది భక్తులు అరుణాచల గిరి ప్రదక్షిణను రాత్రి సమయంలో చంద్రకాంతి వెలుగులో చేస్తుంటారు.
కానీ మేము మాత్రం అరుణాల గిరిని చూస్తూ, గిరి చుట్టూ ఉన్న ఆలయాలను దర్శించుంటూ ఈ యాత్రను చేయాలని భావించాం.
ఈ వీడియోలో చూస్తున్నట్టు రాత్రి సమయంలో అరుణాచల గిరి ప్రదక్షిణ చేయడానికి దూర దూరం నుంచి భక్తులు వచ్చి కాళ్లకు చెప్పులు కూడా లేకుండా 14 కిమీ ఇలా ముందుకు సాగుతారు.
ప్రతీ భక్తుడి మనసులలో ఆ ఆరుణాచలేశ్వరుడి నామం తప్పా ఇంకో ధ్యాస ఉండదు.
అర్థరాత్రి కనిపించే అందమైన ఆధ్యాత్మిక దృశ్యం ఇది. నాకు తెలిసి రాత్రి ప్రదక్షిణ చేసే వారికన్నా మధ్యాహ్నం చేసే వారు ఎక్కువ బ్రేకులు తీసుకుంటారు అనుకుంటా. దానికి నేనే ఉదాహరణ.
పైన ఎండ రోడ్డుకు రెండు వైపులా ఫుట్‌పాత్‌లు వాటిపై విశ్రాంతి తీసుకోవడానికి ఏర్పాటు చేసిన టేబుల్స్…పక్కనే కాఫీ టీలు అందించే చిన్న చిన్న హోటల్స్ ఉంటాయి.కొన్ని సార్లు కొంత మంది భక్తులు కలిసి గిరి ప్రదక్షిణ చేసే వారికి ప్రసాదాలు కూడా అందిస్తారట.
గిరి ప్రదక్షిణలో ఆధ్యాత్మిక అనుభవం
గిరిప్రదక్షిణ చేస్తున్న సమయంలో దేవుడిపైనే భారం అంటూ గిరి చుట్టూ వీధుల్లో, రోడ్డుకు ఇరువైపులా ఎంతో మంది సాధు సన్యాసులు కనిపిస్తారు. కష్టాలైనా, ఆకలైనా ఆ అరుణాచలేశ్వరుడే తీర్చుతాడు అని నమ్ముతారు.
ఎప్పుడు ఏం చేయాలో ఆయనకు తెలియదా అని శివన్నామ స్మరణలో మునిగిపోతారు. అంతలోనే ఎవరో ఒక భక్తుడు వచ్చి అన్నం పొట్లం చేతిలో పెట్టి పొట్ట నింపుతాడు. స్వామి వారి ప్రసాదం భక్తులకు చేరకుండా ఎవరైనా ఆపగలరా ?
Watch : జగన్మాత్ మదురై మీనాక్షి అమ్మవారు వెలిసిన మదురై నగరంపై పూర్తి ట్రావెల్ గైడ్
8 లింగాల దర్శనం
అరుణాచల గిరి ప్రదక్షిణ సమయంలో దారిలో మనకు 8 లింగాల ఆలయాలు కనిపిస్తాయి.
అన్ని దిశలను కాపాడతూ ఉండే శివరూపాలు ఈ లింగాలు.
దారి మధ్యలో ఎన్నో పురాతనమైన ఆలయాలు, అందమైన ఆధునిక, పురాతన శిల్పాలు, కట్టడాలు ఇవన్నీ చూసినాకే అనిపించింది వెలుగులోనే వెలుగు కనిపిస్తుంది. పగటి పూట గిరి ప్రదక్షిణ చేయడం మంచి నిర్ణయమే అనిపించింది. అయితే ఎండాకాలంలో మాత్రం పగటిపూట కన్నా రాత్రి సమయంలో గిరి ప్రదక్షిణ చేయడం అత్యుత్తమం.
గిరి ప్రదక్షిణ సమయంలో ఒక పాస్టర్ కనిపించాడు.
సిగరెట్, మందు వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కల్పిస్తూ దేశమంతా బైక్‌పై తిరుగుతున్నాడట. మీరు చేస్తుంది చాలా మంచి పని…కానీ ఇలా చేస్తే ఎవరైనా మారతారా అని అడిగాను.
మన ప్రయత్నం మనం చేయాలిగా అన్నాడు
నిజమే ఒక్క వ్యక్తి మారినా అది చాలు కదా…
అలయ దర్శనం
14 కిమీ గిరి ప్రదక్షిణ అనంతరం సాయంత్రం దర్శనం కోసం ఆలయం వద్దకు చేరుకున్నాం.
ఆలయానికి నలుమూలలా ఉన్న గాలిగోపురాలు, దూరం నుంచి కనిపించే 200 అడుగులు, 11 అంతస్థుల దేవాలయ గోపురాలను చూస్తుంటే మన పూర్వికుల ప్రతిభ ఏంటో అర్థం అయింది. ఆధ్యాత్మిక భావాన్ని కల్పిస్తూనే శిల్పకళా వైభాన్ని కూడా చాటిన వారికి నైపుణ్యానికి మనసులోనే సెల్యూట్ చేశాను.
ఆలయం చుట్టూ ఉన్న నాలుగు గోపురాలలో ఒక గోపురాన్ని 1560 ఆంధ్రభోజుడు శ్రీ కృష్ణదేవరాయులు నిర్మించారని చెబుతారు.
అయితే లోపలికి మనం మోడ్రన్ డ్రెస్‌లో కాకుండా సంప్రదాయ దుస్తువుల్లోనే వెళ్లాలనే నియమం ఉంది. దర్శనానికి వెళ్లే ముందు ఆలయ సంప్రదాయాలకు తగిన విధంగా మీ వస్త్రధారణ ఉండేలా చూసుకోండి.
Watch : భారతీయు ఆధ్యాత్మికతకు, శిల్పకళా వైభవానికి, హిందూ మత ప్రతిష్టతకు చిహ్నం Brihadeeswarar Temple
అరుణాచలం ఎందుకు వెళ్లాలి ?
“జీవితంలో ఎప్పుడైనా దారితప్పినట్టు అనిపిస్తే,
ఒక్కసారి అరుణాచలానికి రండి.
ఈ పర్వతం చుట్టూ నడవండి — నిశ్శబ్దంగా. ఎవరితో మాట్లాడే అవసరంర లేదు. మీలో మీరు కూడా మాట్లాడుకునే అవసరం లేదు. ఎందుకంటే ఆ పరమేశ్వరుడికి మన మౌంకం కూడా అర్థం అవుతుంది.
ధ్యాస అంత శ్వాసపైనే ఉంచండి.
ఆ శ్వాసకు కారణం అయిన పరమేశ్వరుడిపైనే ఉంచండి.
శారీరకంగానే కాదు…మానసకీకంగా కూడా అరుణాచలేశ్వరుడి సన్నిధిలో ఉండండి.
ఆ తరువాత ఏం జరుగాలో అదే జరుగుతుంది. మ్యాజిక్ అంతే1
అరుణాచలం ఎలా చేరుకోవాలి ! | How To Reach Hyderabad to Arunachalam
తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది భక్తులు అరుణాచలం వెళ్తుంటారు. మీరు కూడా వెళ్లాలి అనుకుంటే ఈ విషయాలు తెలుసుకుంటే మీ ప్రయాణ కాస్త ఈజీ అవుతుంది.
హైదరాబాద్ నుంచి అరుణాచలానికి కాచిగూడ,సికింద్రాబాద్ నుంచి ట్రైన్లు అందుబాటులో ఉంటాయి. ఇక బస్సులో రెండు గంటలు అటూ ఇటూగా మీరు అరుణాచలం చేరుకుంటారు. ఇలాంటి లాంగ్ జర్నీలు మీరు ట్రైన్లలో చేస్తే బెస్ట్ అనేది నా సలహా.
ఇక విజయవాడ, తిరుపతి నుంచి కూడా మీకు డైరక్ట్ ట్రైన్లు, బస్సులు అందుబాటులో ఉంటాయి.
ఖర్చు విషయానికి వస్తే రెండు రోజుల మీ అరుణాచల తీర్థయాత్రకు రూ.3 వేల నుంచి 5 వేల వరకు ఖర్చు అవుతుంది. మీ లైఫ్ స్టైల్‌ను బట్టి బడ్జెట్ మారిపోతుంది.
ఎంత ఖర్చుపెట్టాం..ఎలా వెళ్లాం..ఎన్ని ఇబ్బందులు పడ్డాం అన్నది కాదు..ఆయన దృష్టిలో మనం పడ్డామా అనేది ఇంపార్టెంట్. ఆయన దృష్టి మనపై పడిందా అనేది ఇంపార్టెంట్.
🕉️ “ఓం అరుణాచలేశ్వరాయ నమః.
అరుణాచలేశ్వరుడిని దర్శనం అనంతరం ప్రసాదం కౌంటర్లో పులిహోర తీసుకుని ఆలయ వైభాన్ని చూస్తుంటే టైమ్ ఎలా గడిచిపోయిందే తెలియలేదు. ఆలయం నుంచి బయటికి రాగానే ఒక అరగంట రెస్ట్ తీసుకుని శ్రీవారి దర్శనం కోసం తిరుపతి బస్సు ఎక్కేసి బస్సులో బయల్దేరాం.
Watch : Arulmigu Jambukeswarar Akhilandeswari Temple Story In Trichy
అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. పాదయాత్ర చేయడానికి 4-5 గంటల సమయం సరిపోతుంది. కానీ మధ్యాహ్నం కావడంతో మాకు దాదాపు 8 గంటలు పట్టింది. దారిలో కనిపించిన ప్రతీ ఆలయంలో దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకుని అక్కడి పాజిటీవ్ ఎనర్జీని ఫీలవ్వడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాము. కానీ నా దీక్షలో ఏదైనా లోపం ఉందో ఏమో కానీ…నాకు తిరుపతి వెళ్లే బస్సులోనే జ్వరం పట్టేసుకుంది. కొండ కింది భాగంలోనే ఒక హెటల్లో చెకిన్ చేసి ట్యాబ్లెట్ వేసుకుని రెస్ట్ తీసుకున్నా.
నేను రెస్ట్ తీసుకుంటున్న సమయంలో అన్నయ్య అండ్ సంతోష్ శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వెళ్లారు. జ్వరం కాస్త్ తగ్గడంతో స్నానం చేసి నేను కూడా తిరుమలకు వెళ్లాను. దర్శనం లైన్లో నిలబడే ఓపిక లేకపోవడంతో బయటి నుంచి మొక్కుకుని సంతోష్, అన్నయ్య వచ్చాక వారితో కలిసి ఆలయ ప్రాంగణంలోనే కాసేపు ప్రశాతంగా టైమ్ స్పెండ్ చేశాను.
జీవితానికే కాదు ఏ తీర్థయాత్రకు అయినా ఆరంభం అంతం ఉంటుంది.
కానీ దేవుడి సన్నిధిలో లభించే ప్రశాంతత, ఆధ్యాత్మిక చైతన్యం అనంతమైనది అని అర్థం అయింది.
అందుకే హైదరాబాద్‌కు బయల్దేరినా ఈ తీర్థయాత్రను, ఈ ప్రయాణాన్ని నేను మిస్ అవుతాను అనే ఫీలింగ్ నాకు కలగలేదు.
ఎందుకంటే జీవితమే ఒక ప్రయాణం.
అండ్ నేను ప్రయాణికుడిని .
థ్యాంక్యూ
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
