Bengaluru : రొమాంటిక్ డేట్ నైట్‌కు ప్రపంచంలోనే బెస్ట్ అండ్ చీపెస్ట్ సిటీ ఇదే.. మరి ప్యాకేజీలో ఏముంటాయంటే ?
Bengaluru : దేశంలోని మెట్రో సిటీలలో జీవించడం చాలా ఖర్చుతో కూడుకున్నది. ముఖ్యంగా టెక్నాలజీకి రాజధాని అయిన బెంగళూరులో వాతావరణం ఎంత చల్లగా ఉంటుందో లివింగ్ కాస్ట్ కూడా అంతే ఉంటుంది. అందుకే ఇక్కడ జీతాలు లక్షల్లో ఉంటేనే లివింగ్ కాస్ట్‌ను మేనేజ్ చేయగలుగుతారు. కానీ ఇప్పుడు అందరినీ షాక్ గురి చేస్తున్న అంశం ఏంటంటే.. ప్రపంచంలోని టాప్ సిటీస్‌తో పోలిస్తే బెంగళూరులో డేట్‌కు వెళ్లడం చాలా ఈజీ అని, ఖర్చు కూడా తక్కువ అవుతుందని ఒక తాజా రిపోర్ట్ చెబుతోంది. ఇంత పెద్ద సిటీ చీప్ డేట్ ర్యాంకింగ్స్‌లో చోటు ఎలా సంపాదించిందో, ఒక రొమాంటిక్ డేట్ నైట్‌కు ఎంత ఖర్చవుతుందో చూద్దాం.
ప్రపంచంలోనే అత్యంత ఆఫర్డబుల్ డేట్ సిటీ బెంగళూరు
డ్యూష్ బ్యాంక్ విడుదల చేసిన 2025 మ్యాపింగ్ ది వరల్డ్స్ ప్రైసెస్ రిపోర్ట్ ప్రకారం.. రొమాంటిక్ డేట్ నైట్ కోసం ప్రపంచంలోనే అత్యంత ఆఫర్డబుల్ సిటీగా బెంగళూరు నిలిచింది. మీ దగ్గర డబ్బు తక్కువ ఉన్నా లేదా ఎక్కువ ఖర్చు పెట్టకుండా సాయంత్రం బాగా ఎంజాయ్ చేయాలనుకున్నా బెంగళూరు బెస్ట్ ఆప్షన్. ఇక్కడ మంచి నైట్ లైఫ్, విభిన్నమైన జనాభా, బడ్జెట్‌కు సరిపోయే ఎన్నో ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి.

బెంగళూరులో డేట్ నైట్ ఎందుకు బెస్ట్?
బెంగళూరును కమ్యూనిటీ సెన్స్ కలిగిన విశ్వనగరంగా అభివర్ణించవచ్చు. ఇది అందరికీ ఏదో ఒక మంచి ఆప్షన్‌ను అందిస్తుంది. ఇక్కడ ఉన్న అందమైన పార్కుల నుంచి, సందడిగా ఉండే కేఫ్‌లు, లైవ్లీ పబ్‌లు, ట్రెండీ నైట్క్లబ్ల వరకు… మంచి సమయాన్ని గడపాలనుకునే జంటలకు చాలా ఆప్షన్లు ఉన్నాయి. ఇక్కడి ఆహ్లాదకరమైన వాతావరణం ఈవెనింగ్ వాకింగ్, అవుట్డోర్ డేట్లను మరింత ఆనందదాయకంగా మారుస్తుంది. అలాగే, ఇక్కడి ఉల్లాసభరితమైన సామాజిక వాతావరణం ఎప్పుడూ ఏదో ఒక సెలబ్రేషన్ జరుగుతున్న ఫీలింగ్‌ను ఇస్తుంది.
ఇది కూడా చదవండి : Indias Ancient Temples : మన దేశంలో అతిపురాతనమైన 5 దేవాలయాలు !
చీప్ డేట్ ఇండెక్స్‌లో ఏ అంశాలు ఉంటాయి?
డ్యూష్ బ్యాంక్ విడుదల చేసిన చీప్ డేట్ ఇండెక్స్ అనేది ఒక క్లాసిక్ డేట్ నైట్‌కు అయ్యే ఖర్చును కొలుస్తుంది. ఈ ఖర్చులో ఈ కింది ఆరు అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. ఒక బాటిల్ వైన్, మిడ్-రేంజ్ రెస్టారెంట్లో ఇద్దరికి డిన్నర్, రెండు సినిమా టిక్కెట్లు, రెండు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ టిక్కెట్లు, ఒక షార్ట్ టాక్సీ రైడ్, జీన్స్ ప్యాంట్ సమ్మర్ డ్రెస్
ఖర్చులో తేడా చూస్తే షాక్ అవ్వాల్సిందే!
జ్యూరిచ్, జెనీవా, లండన్ వంటి ఖరీదైన నగరాల్లో ఒక డేట్ నైట్‌కు చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. ఉదాహరణకు, జ్యూరిచ్‌లో ఒక రాత్రి డేట్‌కు సుమారు 450డాలర్ల వరకు ఖర్చు కావచ్చు. కానీ బెంగళూరు మాత్రం డబ్బు పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. కైరో, రియో డి జనీరో వంటి నగరాలతో పాటు బెంగళూరు కూడా గొప్ప విలువను అందిస్తుంది. దీనివల్ల జంటలు తమ బడ్జెట్ గురించి చింతించకుండా పూర్తి సాయంత్రం ఆనందించడానికి వీలు కలుగుతుంది. ఉదాహరణకు, బెంగళూరులో ఇద్దరికి మూడు పూటలా భోజనానికి దాదాపు 18డాలర్లు ఖర్చవుతుంది, అదే జ్యూరిచ్‌లో అయితే 147డాలర్లు ఖర్చు అవుతుంది.
ఇది కూడా చదవండి : Bizarre Christmas : ప్రపంచంలోని 10 వింత క్రిస్మస్ ఆచారాలు, ప్రదేశాలు
ఆఫర్డబుల్గా ఎంజాయ్ చేసే అవకాశం
బెంగళూరులో తక్కువ ఖర్చులు ఉన్నప్పటికీ.. మీరు ఎంటర్టైన్మెంట్ విషయంలో రాజీ పడాల్సిన అవసరం లేదని ఈ నివేదిక చెబుతోంది. మీరు రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించవచ్చు, సినిమా చూడవచ్చు లేదా ట్రెండీ బార్లో డ్రింక్స్ తీసుకోవచ్చు. ఇక్కడి చల్లని సాయంత్రాలు, వైబ్రెంట్ సోషల్ లైఫ్ డేట్లకు అనువుగా ఉంటాయి. మీకు సైలెంట్ డిన్నర్ కావాలన్నా లేదా రాత్రిపూట డ్యాన్స్ చేయాలన్నా.. బడ్జెట్‌కు సరిపోయే ఎన్నో ఆప్షన్లు ఇక్కడ ఉన్నాయి. అంతేకాకుండా, నగరంలోని పార్కులు, సాంస్కృతిక కార్యక్రమాలు వంటివి ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో కూడిన ఆప్షన్లను అందిస్తాయి. అందుకే ట్రాఫిక్ నగరంగా పేరు ఉన్నప్పటికీ, సుందరమైన, అత్యంత క్లాస్ సిటీగా బెంగళూరు ప్రసిద్ధి చెందింది.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.