తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ పర్యాటక స్థలాల్లో బొర్రాకేవ్స్ ( Borra Caves) కూడా ఒకటి. ఇది కేవలం పర్యటక స్థలమే కాదు ప్రకృతి- నీరుగాలితో అందంగా మలచిన శిల్పకళ
ఇంత అదిరిపోయే ఇంట్రో తరువాత ఇక మనం మెయిన్ కంటెంట్‌లోకి వెళ్లకపోతే బాగుండదు కాబట్టి… లెట్స్ స్టార్ట్
ముఖ్యాంశాలు
1. 150 మిలియన్ల సంవత్సరాల క్రితం…
బొర్రా గుహల కథ అనేది ( borra caves history ) మీరు ఇక్కడ చదవడానికి ముందే 150 మిలియన్ల ఏళ్ల క్రితం మొదలైంది. అయితే బొర్రా గుహల గురించి ప్రపంచానికి తెలిసింది మాత్రం 1807 లో మాత్రమే.
విలియం కింగ్ జార్జ్ ( william george king) అనే బ్రిటిష్ అధికారి ఈ గుహలను కనుక్కున్నాడు. ఈ ప్రాంతంలో ఖనిజాల జాడ గురించి వెతకడం మొదలుపెట్టిన కింగ్ జార్జ్ బంగారం లాంటి బొర్రా గుహలను ప్రపంచానికి పరిచయం చేశాడు అంటారు.
Read Also : వంజంగి ఎలా వెళ్లాలి ? ఎలా సిద్ధం అవ్వాలి ? 10 టిప్స్ !
2.గుహలను ప్లాన్ వేసి కనుక్కోలేం
ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న గుహలలో ఎక్కువ గుహలను కనుక్కున్నది ఎవరు అంటే స్థానికులే అని చెప్పాలి.
దట్టమైన అడవుల్లో పశువులను మేతకు తీసుకెళ్లేవాళ్లు, వనమూలికలు, పండ్ల కోసం వెళ్లే వాళ్లు పొరపాటున గుహల్లో పడిపోవడమో లేదా గుహలను చూడటమో చేస్తుంటారు. పడిన వారిని వెతుక్కుంటూ వెళ్లేవారు కూడా ఈ గుహలను చూస్తుంటారు.
లేదంటే ఏదో పనిమీద ఇక్కడికి వచ్చిన వారు గుహలను చూసి మిగితా వాళ్లకు చెబుతుంటారు. బొర్రా గుహల విషయంలో కూడా ఇలాంటి ఒక కథ ప్రచారంలో ఉంది.
3.పశువుల కాపరి కథ…| Story Of Borra Caves
ఒకసారి ఒక పశువుల కాపరి ఈ ప్రాంతానికి తన మందతో పాటు వచ్చాడట. ఆ మందలోని ఆవు ఒకటి పై నుంచి జారిపడి కింద పడింది.
దానిని వెతికే క్రమంలో ఈ పశువుల కాపరి బొర్రా గుహలను చూశాడట. ఈ గుహలో అతనికి ఒక శివలింగం (shivling in borra caves) కనిపించగా స్వామివారికి దండం పెట్టుకున్నాడట.
కిందపడిన ఆవు బతికే ఉండటంతో స్వామివారి మహిమ గురించి తనతోటి వారికి చెప్పాడట. అప్పటి నుంచి స్థానికులు ఈ గుహలో ఉన్న శివలింగానికి పూజలు చేస్తున్నారు. అది నేటికీ కొనసాగిస్తూనే ఉన్నారు.
ఇలా బొర్రా గుహల గురించి రెండు కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ రెండింటిలో ఏది నిజమో మీరు చెప్పండి.
4. బొర్రా గుహలు ఎక్కడున్నాయి ? | Borra Caves Location
బొర్రా గుహలు ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామ రాజు జిల్లాలో ఉన్నాయి. జిల్లాలోని అత్యంత అందమైన అరకు లోయలో, అనంతగిరి హిల్స్‌లో ఈ కేవ్స్ కొన్ని మిలియన్ల సంవత్సరాల నుంచి ఉన్నాయి.
5. బొర్ర గుహల ప్రత్యేకత ఏంటి ?
ఈ గుహలను భారత దేశంలోనే అతి లోతైన గుహలుగా చెబుతారు. సముద్ర మట్టానికి ఈ గుహలు సుమారు 2000 అడుగుల ఎత్తులో ఉంటాయి.
బొర్రా కేవ్స్‌లో జరిపిన తవ్వకాల్లో 30 వేల నుంచి 50 వేల సంవత్సరాల క్రితం నాటి రాతి, ఇతర రకాల పని ముట్లు దొరికాయి. వీటిని బట్టి ఒకప్పుడు ఇందులో మనుషులు నివసించేవారు అని చెబుతారు.
Read Also: Telugu Women Travel Vloggers : ట్రావెల్ వ్లాగింగ్‌లో వీర వనితలు
6.మెగాస్టార్ సినిమాతో…
బొర్ర కేవ్స్ ఎంత అందమైనవి అంటే గుహ లోపలికి వెళ్లగానే మనకు మరో ప్రపంచంలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. ఇదే అనుభూతి 1990 లో జగదేక వీరుడు అతిలోక సుందరి ( Jagadeka Veerudu Atiloka Sundari ) సినిమా చూసి ప్రేక్షకులకు, మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి అభిమానులకు కలిగింది.
ఈ మూవీలో పలు సన్నివేశాలు, పాటల్లో బొర్రా కేవ్స్‌ను చూపించారు. ఆ లైటింగ్, లోయల లోపలి భాగం చూసి చాలా మంది థ్రిల్ ఫీలయ్యారు. బొర్రా కేవ్స్ గురించి కనుక్కోవడం మొదలు పెట్టారు. ఇక్కడికి రావడం మొదలుపెట్టారు.
పర్యటకుల తాకిడిని బట్టి ఇక్కడ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 1990 లో ఈ గుహలను ఏపీ పర్యాటక శాఖ స్వాధినం చేసుకుంది.
Read Also: Manali : మనాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి ? ఎక్కడ ఉండాలి ? ఏం చూడాలి?
పర్యటకులను ఆకర్షించడానికి ఇందులో రంగురంగుల లైట్స్ ఏర్పాటు చేశారు. బొర్రా గుహల మొత్తం విస్తీర్ణం 200 మీటర్లు. దేశంలో అత్యంత పొడవైన, ఎత్తైన గుహలు ఇవే. ఈ గుహ 365 రోజులూ చల్లగా ఉంటుంది.
7.ఆ బొరియలే నేటి బొర్రాగుహలు
వైజాగ్ నుంచి సుమారు (vizag to borra caves) 90 కీమీ దూరంలో ఉంటాయి బొర్రా గుహలు. అరకులోకి ఎంటర్ అవ్వడానికి ముందే ఈ గుహను చూడవచ్చు. బొర్రా గుహల దగ్గరికి వెళ్లడానికి ముందే మనకు దాని నుంచి వచ్చే నదీ ప్రవాహం వినిపిస్తుంది.
టికెట్ తీసుకుని గేటులోకి వెళ్లగానే మనకు వ్యూపాయింట్ నుంచి గోస్తనీ నది ( gostani river) పలకరిస్తుంది. బొర్రాగుహలోనే ఈ నది జనించిందట. లక్షల ఏళ్ల క్రితం గుహపై ఉన్న కొండపై నుంచి నది ప్రవాహించేదని చెబుతున్నారు.
ఈ ప్రవాహం వల్లే కొండల్లో ఉన్న సున్నపురాయి నిక్షేపాలు కరిగిపోయి, నీటితోపాటు కొట్టుకొని పోగా బొరియలు మిగిలాయి. ఆ బొరియలే నేటి బొర్రాగుహలు.
8. బొర్ర, గోస్తనీ అంటే
బొర్ర అంటే బొరియ అనే అర్థం. గోస్తనీ అంటే ఆవు పొదుగు అని అర్థం. సున్నపురాతి నిక్షేపాలతో ప్రవహిస్తున్న నీరు తెల్లగా ఉండి, గోవు పొదుగునుంచి వచ్చే పాలలా ఉంటుంది కనుక ఈ నదిని గోస్తనీ నది అనిపిలవడం మొదలుపెట్టారట.
9.గుహలోకి ఎంటర్ అయ్యేటైమ్‌లో…
గుహలోకి ఎంటర్ అయ్యే టైమ్‌లో జనాలు రియాక్షన్ చూడాలి. గుహ ఎంత పెద్దగా ఉందో అంత పెద్దగా నోరు తెరిచి మరి వామ్మో అని చూస్తుంటారు.
పైన చూస్తూనే చిన్నగా మెట్లు తిగుతూ తిన్నగా గుహలోపలికి వెళ్లిపోతారు.దాని ఆకారం గురించి ఆలోచిస్తూ తలతిప్పి చూస్తుంటారు.
10.స్టాలక్ టైట్-స్టాలగ్ మైట్
గుహపైనుంచి చుక్కా, చుక్కా కారే సున్నపురాయి క్రమంగా పేరుకొని, గట్టిపడి బొర్రాగుహల్లో రకరకాల ఆకారాలని పొందాయి .
గట్టిపడి వివిధ ఆకారాలను పొందిన వీటిని స్టాలక్‌టైట్, స్టాలగ్‌మైట్ అని పిలుస్తారు.
గుహపైనుంచి తోరణాల్లా వ్రేలాడ బడినట్టు ఏర్పడినవి స్టాలక్‌టైట్స్, క్రిందనుంచి పైకి ఏర్పడినవి స్టాలగ్‌మైట్స్.
Read Also:Also Read : Indian License : భారతీయ లైసెన్స్ ఈ 15 దేశాల్లో కూడా చెల్లుతుంది
ఈ రెండు పేర్లూ చాలా సారూప్యత కలిగి ఉండి గుర్తుపెట్టుకోవడానికి కష్టంగా ఉంటాయి. జియాలజిస్టులే ఒక్కో సారి ఏది, ఏదో తెలియక తికమక పడతారట.
11.అందమైన లైటింగ్
గుహకి లైటింగ్ ఏర్పాటు చెయ్యడంతో చూడడానికి బాగుంది లోపల మెట్లు, ఎత్తుపల్లాలు, ఒకటిరెండు చోట్ల చిన్న సొరంగ మార్గాలు ద్వారా నడక 300 నుంచి 400 మీటర్ల వరకూ ఉంటుంది.
ఈ గుహలు మొత్తం ఒక చదరపు కిలోమీటరు విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నాయట. విశాఖపట్నం నుంచి అరకు వెళ్ళే రైలు మార్గం ఈ గుహల మీదనుంచే వెళుతుంది!
12. ఎలా వెళ్లాలి ఎప్పుడు వెళ్లాలి? | How To Plan To Borra Caves
బొర్రగుహలు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు తెరిచే ఉంటాయి. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రెండు వరకూ లంచ్‌బ్రేక్.
విశాఖా జిల్లా నుంచి సుమారు 90 కిమీ ఉండే బొర్రా కేవ్స్‌కు టాక్సీలో లేదా ట్రైన్‌లో కూడా వెళ్లవచ్చు.
బొర్రా కేవ్స్‌కు స్టేషన్ ఉండటం వల్ల ట్రైన్ ఇక్కడ ఆగుతుంది. అక్కడి నుంచి టాక్సీ మాట్లాడుకుని వెళ్లవచ్చు.
మీరు ట్రైన్లో ఉండగానే కొంత మంది వచ్చి బొంగులో బిర్యానీ అని చెప్పి మీ దగ్గర ఆర్డర్ బుక్ చేస్తారు.
గుహల్లోకి వెళ్ళే ముందే బయట ఉన్న చిన్న రెస్టారెంట్లలో ఏదో ఒకదాని దగ్గర లంచ్ ఆర్డర్ చేసి వెళితే, మీరు తిరిగి వచ్చేసరికి రెడీ చేస్తారు.
ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.