ప్రపంచ యాత్రికుడిగా గుర్తింపు తెచ్చుకున్న తెలుగు ట్రావెల్ వ్లాగర్ అన్వేష్‌పై కేసు నమోదు అయింది (Naa Anveshana Anvesh). సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. తెలంగాణ డైరక్టర్ జనర్ ఆఫ్ పోలీస్‌తో (DGP) పాటు మరి కొంత మంది ప్రముఖులపై తప్పుడు, అవాస్తవమైన తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారంటూ పోలీసులు సుమోటోగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ముఖ్యాంశాలు
నా అన్వేషణ | Naa Anveshana Anvesh
తెలుగులో ట్రావెల్ వ్లాగ్స్ (telugu travel vlogs) చేస్తూ ప్రపంచంలోని అనేక ప్రదేశాలను తెలుగు వారికి పరిచయం చేసేందుకు “నా అన్వేషణ” (Naa Anveshana) అనే చానెల్ నడిపిస్తున్నాడు అన్వేష్. ఇందులో రోజుకూ మిలియన్ల వ్యూస్ వస్తాయి. ఈ ఛానెల్‌లో కేవలం ట్రావెల్ వీడియోలు మాత్రమే పోస్ట్ చేస్తుంటాడు అన్వేష్.
ప్రపంచ యాత్రికుడు
తన రెండో ఛానెల్ ప్రపంచ యాత్రికుడు (Prapancha Yatrikudu) లో తనకు నచ్చిన టాపిక్‌పై వీడియోలు చేస్తుంటాడు. ట్రెండింగ్ టాపిక్, వార్తలు, ఎన్నికలు ఇలా ఏది నచ్చితే అది తన స్టైల్‌లో వివరిస్తాడు. ఇక అన్వేష్ మాటతీరు, చెప్పే విధానం ఒక వర్గానికి బాగా నచ్చడంతో ప్రపంచ యాత్రికుడులో వీడియోలకు కూడా మంచి వ్యూస్ వస్తాయి.

దీంతో రెగ్యులర్‌గా వివిధ టాపిక్స్‌పై వీడియోలు చేయడం కొనసాగిస్తున్నాడు. అందులో భాగంగానే ఈ మధ్యకాలంలో బెట్టింగ్ యాప్స్‌పై (Betting Apps) ఒక క్యాంపెయిన్‌లా వరుసగా వీడియోలు చేయడం మొదలు పెట్టాడు. ఇందులో చాలా మంది ట్రావెల్ వ్లాగర్లు, వ్లాగర్లు, యూట్యూబర్లు, నటీనటులు, ప్రముఖుల పేర్లను తీసుకుని వీడియోలు చేస్తున్నాడు.
అసలు ఏం జరిగింది ? | Case Background
ఇక ఈ కేసు విషయానికి వస్తే ప్రపంచ యాత్రికుడు ఛానెల్‌లో తెలంగాణ డీజీపి జితేంద్ర, మెట్రో ఎండి ఎస్‌వీ రెడ్డి, శాంత కుమారి, దాన కిషోర్ వికాస్ రాజ్‌పై అరోపణలు చేస్తూ అన్వేష్ వీడియో చేశాడట. బెట్టింగ్ యాప్‌లను హైదరాబాద్ మెట్రోలో (Hyderabad Metro) ప్రచారం చేసి వందల రూ.300 కోట్లు కొట్టేశారని వీడియోలో అన్వేష్ తెలిపాడట.
ఈ వీడియోలు ప్రముఖులపై చేసే కామెంట్స్, నిందలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని, తన వీడియోలతో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారంటూ అధికారులు అతనిపై ఐటీ యాక్ట్‌తో పాటు, ఇతర చట్టాల్లో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలిస్ స్టేషన్లో ఈ కేసును రిజిస్టర్ చేశారు.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.