Universal Studios : భారత్‌లో యూనివర్సల్ స్డూడియోస్ థీమ్ పార్క్…2027 వరకు కంప్లీట్

షేర్ చేయండి

హాలీవుడ్ సినిమాలు చూసేవారికి యూనివర్సల్ స్టూడియోస్ (Universal Studios) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ స్డూడియో ఇప్పడు భారత్‌లో తొలి థీమ్ పార్కును ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. 

ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ? | Location

3 మిలియన్ల చదరపు అడుగుల వీస్తీర్ణంలో ఉండే యూనివర్సల్ స్డూడియోను ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు సమీపంలో ఉన్న ఏరోసిటి (Aero City) లో ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా భారతి రియల్ ఎస్టేట్ సంస్థల ఇప్పటికే 3,00,000 లక్షల స్క్వేర్ ఫీట్ల స్థలాన్ని లీజ్‌కు ఇచ్చేందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు 2027 లో పూర్తి అవనున్నట్టు సమాచారం.

నైట్‌లైఫ్‌కు అనుమతి | Universal Studios 

ఈ థీమ్ పార్క్ రాకతో ఢిల్లీ (Delhi) ఎరోసిటీలో ఉన్న భారతీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు కమర్షియల్‌గా, టూరిస్టు హబ్‌గా (Tourist Hub) పుంజుకునే అవకాశం ఉంది. అలాగే టూరిజం, నైట్‌లైఫ్‌ను (Night Life) ప్రోత్సాహించే దిశలో ఏరోసిటీలోని బార్స్ అండ్ రెస్టారెంట్స్‌ను 24 గంటలూ పని చేసేందుకు అనుమతించింది. 

ఇక యూనివర్సల్ స్డూడియో వస్తే ఇప్పటి వరకు కేవలం చారిత్రాత్మక ప్రదేశాలు లేదా అధికారిక నిర్మాణాలను చూసేందుకు ఢిల్లీకి వెళ్లే ప్రయాణికులు…థీమ్‌పార్కులో కూడా విహరించే అవకాశం లభిస్తుంది.

📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!