Ooty Itinerary : 3 రోజుల్లో ఊటిలో ఏ ఏ ప్రాంతాలు కవర్ చేయవచ్చంటే…

షేర్ చేయండి

నీలగిరి కొండల్లో కొలువై ఉన్న అందమైన హిల్ స్టేషన్ ఊటి (Ooty Itinerary ). భారత దేశంలోనే ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో ఒకటైన ఈ ప్రాంతానికి వెళ్లేందుకు దేశం నలుమూలల నుంచి టూరిస్టులు ఇష్టపడుతుంటారు. ఒక వేళ మీరు కూడా ఊటి వెళ్లందుకు ప్లాన్ చేస్తోంటే…జస్ట్ 3 రోజుల్లో ఏఏ ప్రాంతాలను కవర్ చేయవచ్చో పూర్తి ప్లాన్ అందిస్తున్నాం. చూడండి.

మొదటి రోజు : ఊటిని అన్వేషించండి 

ఊటి లేక్ | Ooty Lake

మీ ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఊటీ లేక్‌ను మించిన డెస్టినేషన్ మరోటి దొరకదు. ఈ ఐకానిక్ లేక్ చుట్టు పక్కల ప్రాంతాల్లో మీకు యూకలిప్టస్ చెట్లు, ముడత పర్వతాలు (Rolling Hills) చాలా కనిపిస్తాయి. ఈ కృత్రిమ సరస్సులో మీరు ఉదయం బోట్ రైడ్ ఎంజాయ్ చేయవచ్చు. దీంతో పాటు పెడల్ బోట్స్ , రోబోట్స్ నడిపి ఎంజాయ్ చేయవచ్చు. అలాగే లేక్‌సైడ్‌లో మీరు సైక్లింగ్ అండ్ గుర్రపు స్వారిని ఆస్వాదించవచ్చు.

బొటానికల్ గార్డెన్ | Govt Botanical Garden

ఊటి సరస్సు తరువాత మీరు గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్‌కు వెళ్లవచ్చు. 22 హెక్టార్ల ఈ బొటానికల్ గార్డెన్‌లో పచ్చదనం మిమ్మల్ని తప్పకుండా కట్టిపడేస్తుంది. 1848 లో ఈ గార్డెన్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ మీకు ఎన్నో అరుదైన వృక్షాలు, అందమైన పుష్పాలు, శిలాజాల్లా మారిన 20 మిలియన్ల నాటి భారీ వృక్షరాజాలు కనిపిస్తాయి. 

ఫోటోగ్రఫీ ఇష్టపడే వారికి ఈ ప్రదేశంలో చాలా పని దొరుకుతుంది. అంటే ఫోటోలు బాగా తీయొచ్చు అని చెబుతున్నాను. ప్రతీ సంవత్సరం ఇక్కడ ఫ్లవర్ షో (Flower Show) జరుగుతుంది. 

సెయింట్ స్టీఫెన్ చర్చ్ | St. Stephen’s Church

ఒక ఊటిలో మొదటి రోజు చివరిగా చూడాల్సిన ప్రదేశం వచ్చేసి సెయింట్ స్టీఫెన్స్ చర్చ్. దక్షిణ భారత దేశంలోనే అతి పురాతనమైన (Oldest Church) చర్చిల్లో ఇది కూడా ఒకటి. ఈ చర్చి నిర్మాణంతో పాటు స్టెయిన్ గ్లాసుతో చేసిన కిటికీలు, బ్రిటిష్ కాలం నాటి ఆర్కిటెక్చర్ ఇవన్నీ మనల్ని స్వాతంత్య్రానికి ముందున్న కాలానికి తీసుకెళ్తాయి.

రెండవ రోజు : అందమైన వ్యూస్, టీ ఎస్టేట్స్ 

దొడ్డబెట్ట పీక్ | Doddabetta Peak : ఊటిలో రెండవ రోజును 2,637 మీటర్ల ఎత్తులో ఉన్న దొడ్డబెట్ట కొండ నుంచి ప్రారంభించండి. నీలగిరిలో (Nilgiri Hills) ఇదే అత్యంత ఎత్తైన ప్రాంతం. ఇక్కడి నుంచి చుట్టుపక్కల కొండలు, లోయల అందం చూసేందుకు ప్రకృతి మీ నుంచి ఒక్క పైసా కూడా చార్జ్ చేయదు. 

వేకువజామునే ఇక్కడికి వెళ్తూ పూర్తిగా పైసా వసూల్ అనుభూతిని సొంతం చేసుకోవచ్చు. మీతో పాటు మంచి కేమెరాను తీసుకెళ్లడం మర్చిపోకండి.

టీ ఫ్యాక్టరీ అండ్ మ్యూజియం | Ooty Itinerary

Tea Factory and Museum : ఊటికి వెళ్లి టీ ఫ్యాక్టరీ , మ్యూజికం చూడకపోతే చాలా చాలా బాగుండదు. ఎందుకంటే ఇక్కడ టీ అనేది హాట్ డ్రింక్ కాదు. హార్ట్ డ్రింక్. ఒక కల్చర్. ఒక కల్ట్. అది ఫీల్ అవ్వాలంటే మీరు టీ ఫ్యాక్టరీ, మ్యూజియానికి తప్పనిసరిగ్గా వెళ్లాల్సిందే. 

ఇక్కడికి వెళ్తే టీ తయారు చేసే అసలైన విధానాన్ని తెలుసుకోవచ్చు. అలాగే మీరు నీలగిరి టీని (Nilgiri Tea) రుచిని ఆస్వాదించవచ్చు. నచ్చితే టీపొడిని కొనుగోలు చేయవచ్చు కూడా.

రోజ్ గార్డెన్ | Rose Garden 

మధ్యాహ్నం మీరు ఊటిలో ఉన్న రోజ్ గార్డెన్‌కు వెళ్లేలా ప్లాన్ చేసుకోండి. అందమైన రోజా పువ్వులు మీకు స్వాగతం పలుకుతాయి. రంగుల రంగుల పువ్వులను వాటి సువాసను పీల్చుతూ కాసేపు బయటి ప్రపంచాన్ని మర్చిపోండి. 

సకుటుంబ సపరివార సస్నేహితులు సస్నేహితురాలి సగర్ల్‌ఫ్రెండ్ సబాయ్‌ఫ్రెండ్… సమేతంగా రోజ్‌గార్డెన్ వెళ్లొచ్చు.

ఊటి మార్కెట్ | Ooty Market 

ooty itinerary
ఊటిలో టీ గార్డెన్

సాయంత్రం అయితే మీరు ఊటి మార్కెట్ ప్లాన్ చేసుకోండి. ఇక్కడ మీరు చేతితో తయారు చేసిన చాకొలెట్స్ కొనవచ్చు. దీంతో పాటు స్థానిక మసాలా దినుసులను (Ooty Spices) కొనొచ్చు. దీంతో పాటు స్థానిక కళాకారులు తయారు చేసిన హ్యాండి క్రాఫ్ట్స్ కూడా తీసుకోవచ్చు.

మూడవ రోజు : 

నీలగిరి రైల్వే | Nigiri Mountain Railway

ఇండియాలో ఉన్న అందమైన రైల్వే ప్రయాణాల్లో (Beautiful Train Journey India) నీలగిరి ట్రెయిన్ జర్ని కూడా ఒకటి. యూనెస్క (UNESCO) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు తెచ్చుకున్న ఈ టాయ్ ట్రెయిన్‌లో మీరు ఊటి నుంచి కూనూరు మధ్య ప్రయాణించవచ్చు.

ఎన్నో సొరంగాలు, వంతెనలు, టీ ఎస్టేట్స్ గుండా వెళ్లే ఈ ట్రెయిన్ మీకో సూపర్ మెమోరిగా మిగిలిపోతుంది. స్ట్రెస్ మొత్తం పటాపంచలు అవుతుంది. 

కూనూరు ఎక్స్‌కర్షన్ | Coonoor Excursion

ఒక్కసారి టాయ్ ట్రెయిన్‌లో కూనూరుకు వెళ్లాక అక్కడే మిగితా రోజును స్పెండ్ చేయండి. ఇక్కడ మీరు సిమ్స్ పార్క్‌ (Sims Park) అనే అందమైన బొటానికల్ గార్డెన్‌కు వెళ్లవచ్చు. దీంతో పాటు ల్యాంబ్స్ రాక్ (Lambs Rock) అనే అందమైన లోయను కూడా సందర్శించవచ్చు. 

ఇంకా టైమ్ ఉంటే ఇక్కడ డాల్ఫిన్ నోస్‌ (Dolphins Nose) అనే ప్రాంతాన్ని, కేథరిన్ ఫాల్స్‌ను సందర్శించండి.

ఎమరాల్డ్ లేక్ | Emerald Lake

ఊటికి తిరిగి వచ్చే సమయంలో జనావాసాలుకు దూరంగా తక్కువ రద్దీ ఉండే ఎమరాల్డ్ సరస్సును సందర్శించండి. ప్రశాంతంగా సమయం గడపాలి అనుకుంటే ఇది మంచి స్పాట్ అవుతుంది.

చుట్టుపక్కల ఎటుచూసినా పరుచుకుని ఉన్నట్టు కనిపించే పచ్చదనం, పక్షుల కిలకిలారావాలతో ఈ ప్రాంతం ఒక పర్ఫెక్ట్ పిక్‌నిక్ (Picnic Spot) స్పాట్‌లా అనిపిస్తుంది. 

📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!