Gokulashtami Tirupati : తిరుమలలో ఘనంగా గోకులాష్టమి వేడుకలు.. నేడు ఉట్లోత్సవాలు
Gokulashtami Tirupati : తిరుపతి, సెప్టెంబరు 4: శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని తిరుపతి, తిరుచానూరు, కపిలతీర్థం, నారాయణవనం తదితర టీటీడీ స్థానిక ఆలయాల్లో గోకులాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. శ్రీకృష్ణ స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, స్నపన తిరుమంజనం, వాహన సేవలు, గోపూజ, ఆస్థానం వంటి కార్యక్రమాలను ఆలయాల్లో శాస్త్రోక్తంగా నిర్వహించారు.

తిరుచానూరులో ప్రత్యేక కార్యక్రమాలు
తిరుచానూరులోని శ్రీకృష్ణ స్వామివారి ఆలయంలో ఉదయం మూలమూర్తులకు అభిషేకం, మధ్యాహ్నం స్నపన తిరుమంజనం చేపట్టారు. సాయంత్రం 6.45 గంటలకు స్వామివారు పెద్దశేష వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం గోపూజ, గోకులాష్టమి ఆస్థానం నిర్వహించారు.
- ఇది కూడా చదవండి : రామప్ప ఆలయం గురించి తెలుగు వారు తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే
సెప్టెంబరు 5న మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు స్నపన తిరుమంజనం, అనంతరం ఊంజల్‌సేవ ఉంటాయి. సాయంత్రం 6 నుంచి రాత్రి 7.30 గంటల వరకు ఉట్లోత్సవం, ఆస్థానం నిర్వహించనున్నారు.
గోవిందరాజస్వామి, కపిలతీర్థంలో..
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సాయంత్రం 4 గంటలకు శ్రీకృష్ణ స్వామివారికి అభిషేకం నిర్వహించారు. పురాణ పఠనం, ఆస్థానం కూడా చేపట్టారు.
కపిలతీర్థంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో ఉదయం అభిషేకం జరగగా, సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు వీధి ఉత్సవం నిర్వహించారు. అనంతరం గోకులాష్టమి ఆస్థానం జరిగింది.
నారాయణవనంలో భక్తిశ్రద్ధలతో
నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీకృష్ణ స్వామివారికి సాయంత్రం అభిషేకం నిర్వహించి, గోకులాష్టమి ఆస్థానం, నివేదన చేపట్టారు. సెప్టెంబరు 5న ఉదయం 9 గంటలకు వీధి ఉత్సవం, సాయంత్రం 5 గంటలకు ఉట్లోత్సవం నిర్వహించనున్నారు.
ఈ వేడుకల్లో టీటీడీ అధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
▶️ వీడియో చూడండి : పండరిపురం ట్రావెల్ గైడ్