Krishnashtami Hyderabad 2026: జన్మాష్టమికి ఈ 7 ఆలయాలకు వెళ్లేందుకు రెడీనా?
Krishnashtami Hyderabad : శ్రీకృష్ణ జన్మాష్టమి అంటేనే భక్తి, సంగీతం, నృత్యం, అర్ధరాత్రి వేళ జరిగే మహా హారతులతో పరవశించిపోయేలా చేసే ఆధ్యాత్మిక వాతావరణం. హైదరాబాద్ నగరంలో ఈ పండుగను అత్యంత వైభవంగా సెలబ్రేట్ చేసే అనేక ప్రదేశాలు ఉన్నాయి.
2026వ సంవత్సరంలో జన్మాష్టమి సెప్టెంబర్ 4వ (Sri Krishna Janmastami Date 2026) తేదీ శుక్రవారం వస్తోంది. ఈ శుభ సందర్భంగా మీరు కుటుంబ సమేతంగా హైదరాబాద్‌లో సందర్శించదగిన 8 ప్రముఖ కృష్ణ మందిరాలు ఇవే.
1. ఇస్కాన్ శ్రీ శ్రీ రాధా మదనమోహన మందిర్, ఆబిడ్స్ (Iskon Abids):
హైదరాబాద్‌లో జన్మాష్టమి సందర్భంగా భక్తులు ఎక్కువగా వెళ్లే ఆలయం ఇది. జన్మాష్టమీ సమయంలో ఇక్కడ ప్రత్యేక పూజలు, అభిషేకాలు, భజనలు, ఇతర కల్చరల్ ఈవెంట్స్ జరుగుతాయి. (Golden Jubilee ISKCON Hyderabad)
2. హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్, బంజారా హిల్స్ (Banjarahills Golden Temple) :
వైట్ మార్బుల్‌తో నిర్మించిన అద్భుతమైన ఆలయం ఇది. జన్మాష్టమీ సమయంలో ఇక్కడ భక్తి గీతాలు, ఊంజల్ సేవలు, అర్థరాత్రి వరకు వేడుకలు కన్నుల పండువగా జరుగుతాయి.
3. హరే కృష్ణ హెరిటేజ్ టవర్, నార్సింగి (Iskon Narsingi):
ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణం, భజనలు, ప్రవచనాలతో జన్మాష్టమిని ఇక్కడ ఎంతో భక్తిశ్రద్ధలతో సెలబ్రేట్ చేస్తారు.
4. ఇస్కాన్ గోకులం, మియాపూర్ (Miyapur Iskcon Gokulam):
హైదరాబాద్‌లోని వెస్ట్రన్ పార్ట్‌లో ఉన్న పాపులర్ టెంపుల్ ఇది. జన్మాష్టమీ సమయంలో దూర దూరం నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ప్రత్యేక కీర్తనలు, కార్యక్రమాలు, మహా హారతి ఇక్కడ జరుగుతాయి.
5. శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం, KPH (Venugopala Swamy Temple KPH) :
ఇది ప్రాచీన కృష్ణ ఆలయం. వేణుగోపాల స్వామికి ప్రత్యేక పూజలు, భజనలతో జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతాయి.
6. MCEME Krishna Mandir, తిరుమలగిరి:
సికింద్రాబాద్‌లోని ప్రశాంతమైన ఈ ఆలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, జన్మాష్టమి ఉత్సవాలు ఆకట్టుకుంటాయి.
7. బిర్లా మందిర్, నౌబత్ పహాడ్ (Birla Mandir):
హైదరాబాద్‌లో ఐకానిక్ డెస్టినేషన్ అయిన బిర్లామందిర్‌లో జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేక పూజలు, భజనలు, హారతులు నిర్వహిస్తారు.
ఈ జన్మాష్టమికి ఈ ఆలయాలకే వెళ్లాలని కాదు మీకు దగ్గర్లో ఉన్న ఏ వేణుగోపాల స్వామి ఆలయానికి అయినా వెళవచ్చు. అలాగే ఈ లిస్టులో లేని ఆలయాలు ఏమైనా ఉంటే వాటిని కామెంట్ సెక్షన్లో రిఫర్ చేయండి. మీకు, మీ కుటుంబానికి సుఖ, శాంతి, ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ… హరే కృష్ణ!
ప్రయాణికుడు వాట్సాప్ ఛానెల్లో చేరడానికి క్లిక్ చేయండి.
