Uzbekistan Visa Free : ఉజ్బెకిస్థాన్‌కు ఇక వీసా అవసరం లేదు.. భారతీయులకు 30 రోజులు ఫ్రీ ఎంట్రీ!
Uzbekistan Visa Free : ఫారిన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్న భారతీయులకు గుడ్ న్యూస్. ఉజ్బెకిస్థాన్ భారతీయ పాస్‌పోర్ట్ ఉన్న వాళ్లకు 30 రోజుల వీసా-ఫ్రీ ప్రవేశాన్ని ప్రకటించింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉజ్బెకిస్థాన్ పర్యటన సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయేవ్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
ఈ కొత్త విధానాన్ని ఇరు దేశాల మధ్య పర్యాటకం, ప్రజల మధ్య సంబంధాలు, వ్యాపార వ్యవహారాలను మరింతగా పెంచే లక్ష్యంతో తీసుకున్నట్లు వెల్లడించారు.
ఫ్రీ వీసా అంటే.. | Uzbekistan Free Visa
ఇప్పటి వరకు ఉజ్బెకిస్థాన్ వెళ్లాలనుకునే భారతీయ ప్రయాణికులు వీసా ప్రాసెస్‌ను పూర్తి చేయాల్సి వచ్చేది. కొత్త వీసా-ఫ్రీ విధానం (Visa Free ) అమల్లోకి వస్తే సాధారణ భారతీయ పాస్‌పోర్ట్‌తో 30 రోజుల వరకు వీసా లేకుండానే ఉజ్బెకిస్థాన్‌లో పర్యటించే అవకాశం ఉంటుంది.
అయితే ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చే తేదీ, ఎంట్రీ రూల్స్, ట్రావెల్ డాక్యుమెంట్స్ వంటి అంశాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అందుకే ఈ దేశానికి వెళ్లే ముందు తాజా అప్డేట్స్ తెలుసుకుంటే బెటర్.
ఉజ్బెకిస్థాన్ ఎక్కడ ఉంది? | Uzbekistan Location
మధ్య ఆసియాలో ఉన్న ఉజ్బెకిస్థాన్ చరిత్ర, ఇస్లామిక్ ఆర్కిటెక్చర్, సిల్క్ రోడ్ హెరిటేజ్‌ను చూసి తెలుసుకునేందుకు చాలా మంది వెళ్తుంటారు. సమర్కండ్, బుఖారా, ఖీవా, తాష్కెంట్ వంటి నగరాలకు ఎక్కువ మంది పర్యాటకులు వెళ్లేందుకు ఇష్టపడుతుంటారు.
- ఇది కూడా చదవండి : Tbilisi : పురాతన వీధుల నుంచి నైట్ లైట్స్ వరకు మర్చిపోలేని యూరోప్ అనుభవం
మరీ ముఖ్యంగా సమర్కండ్లోని రెగిస్తాన్ స్క్వేర్, బుఖారాలోని చారిత్రక కట్టడాలు, ఖీవాలోని పురాతన నగర ప్రాంతాలు ప్రయాణికులకు ప్రత్యేక అనుభూతిని అందిస్తాయి.
భారతీయులకు 30 రోజుల వీసా-ఫ్రీ ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తే Central Asia ట్రావెల్ ప్లాన్ చేసుకునేవారు ఉజ్బెకిస్థాన్ వెళ్లే అవకాశం ఉంది.
▶️ వీడియో చూడండి : 3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు – ప్రత్యేక వీడియో
