Ananthagiri hills :ముచుకుందా (మూసీ) నది పుట్టినిల్లు.. అనంతగిరి హిల్స్
Ananthagiri hills : హైదరాబాద్‌కు దగ్గర్లోనే, పచ్చని కొండలు, దట్టమైన అడవులు, మలుపులు తిరిగే రహదారులతో ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకునే ప్రాంతం అనంతగిరి హిల్స్. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో ఉన్న ఈ కొండలు హైదరాబాద్ నగరానికి సుమారు 75 నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.
దట్టమైన అడవులు, కొండ ప్రాంతాలు, పురాతన ఆలయాలు, ప్రకృతితో మమేమం చేసే దారులతో అనంతగిరి హిల్స్ ప్రకృతి ప్రేమికులకు, ట్రెక్కింగ్‌ను ఇష్టపడేవారికి పాపులర్ డెస్టినేషన్‌గా మారింది. (Vikarabad District)
ముచుకుందా (మూసీ) నది పుట్టినిల్లు | Muchukunda (Musi) River Origin
అనంతగిరి హిల్స్‌కు ఉన్న ప్రత్యేకతల్లో ముచుకుందా (మూసీ) నది కూడా ఒకటి. మూసీ నదిని ఒకప్పుడు ముచుకుందా నది అని కూడా పిలిచేవారు.
అనంతగిరి కొండల్లో పుట్టే ఈ నది అనంతరం హైదరాబాద్ నగరం గుండా ప్రవహిస్తుంది. తరువాత కృష్ణా నదిలో కలుస్తుంది. పచ్చని చెట్లు, కొండలు, చిన్న వాగులు, అడవి దారులతో నిండిన ఈ ప్రాంతం నగర జీవితం నుంచి కొంతసేపు దూరంగా ప్రకృతిలో గడపాలనుకునేవారికి మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.
అనంత పద్మనాభ స్వామి ఆలయం | Anantha Padmanabha Swamy Temple
అనంతగిరి హిల్స్‌లో ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం ఈ ప్రాంతంలోని ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రదేశాల్లో ఒకటి. ఈ ఆలయంలోని శ్రీమహావిష్ణువును దర్శించుకునేందుకు భక్తులు దూర దూరం నుంచి వస్తుంటారు. ఈ ఆలయానికి సంబంధించి స్కంద పురాణంతో ముడిపడిన పౌరాణిక కథనాలు కూడా ఉన్నాయి. (Telangana Tourism)
పౌరాణిక కథనాల ప్రకారం మార్కండేయుడు మహర్షి అనంతగిరి ప్రాంతంలో తపస్సు చేసేవారట. ఆయన కాశీకి వెళ్లి గంగానదిలో స్నానం చేస్తుండేవారు. అయితే ఒకానొక సందర్భంలో ఆయన వెళ్లలేకపోవడంతో శ్రీమహావిష్ణువు కలలో స్వప్నంలో దర్శనమిచ్చి గంగాజలాన్ని అందించినట్లు కూడా కథనం ఉంది.
అడవి దారుల్లో ట్రెక్కింగ్ | Ananthagiri Hills Trek
అనంతగిరి హిల్స్‌లోని అడవి మార్గాలు ట్రెక్కింగ్‌ను ఇష్టపడేవారిని ఆకట్టుకుంటాయి. దట్టమైన అడవులు, రాతి దారులు, కొండ ప్రాంతాలు, నేచర్ మధ్య సాగే ఈ ట్రైల్స్ ఈ ప్రాంతాన్ని స్పెషల్ డెస్టినేషన్‌గా మార్చాయి. ఇక్కడ హైకింగ్, ట్రెక్కింగ్, నేచర్ వాక్ వంటి యాక్టివిటీస్ కూడా చేయవచ్చు.
- ఇది కూడా చదవండి : హైదరాబాద్ మొత్తాన్ని 2 రోజుల్లో పూర్తి చేయగలమా? – No | 2-Day Hyderabad Practical Tour
అడవి మార్గాల్లో కనిపించే పచ్చని చెట్లు, చిన్న వాగులు, కొండల మధ్య సాగే రహదారులు ఇవన్నీ చుట్టుపక్కల జిల్లాల్లోని ట్రావెల్ లవర్స్‌ను ఇక్కడికి వచ్చేలా చేస్తాయి. వర్షాకాలంలో పచ్చదనం మరింత పెరగడంతో అనంతగిరి హిల్స్ మరింత అందంగా మారుతుంది
ఎప్పుడు వెళ్లాలి? | Best Time To Visit
అనంతగిరి హిల్స్‌ను ఏడాదిలో ఎప్పుడైనా వెళ్లవచ్చు. వికారాబాద్ ప్రాంతం ఏడాది పొడవునా ఆహ్లాదకరంగా ఉంటుంది అని ఆ జిల్లా అధికారిక వెబ్సైట్ పేర్కొంటోంది. వర్షాకాలంలో పచ్చదనం, శీతాకాలంలో చల్లటి వాతావరణం ఇలా ప్రతీ సీజన్ నెక్ట్స్ లేదా ఫస్ట్ విజిట్‌కు మరో రీజన్ అవుతుంది.
అనంతగిరి హిల్స్ కేవలం హైదరాబాద్‌కు దగ్గర్లో ఉన్న ఒక వీకెండ్ గెటవే (weekend getaway) మాత్రమే కాదు, ప్రకృతి, ఆధ్యాత్మికత, అడవి ప్రయాణం కలిసిన ఒక ప్రత్యేకమైన ప్రాంతం. కొండల మధ్య సాగే ప్రతి ప్రయాణం, పచ్చని అడవి దారుల్లో వేసే ప్రతి అడుగు నగరానికి భిన్నమైన, ప్రశాంతమైన అనుభూతిని అందిస్తుంది.
Ananthagiri Hill image Source : By Praveen120 – Own work, CC BY-SA 3.0,
▶️ వీడియో చూడండి : థాయ్‌లాండ్ కంప్లీట్ ట్రావెల్ గైడ్
