భారత దేశంలో మామిడి ఉత్పత్తి చేసే రాష్ట్రాల జాబితా సిద్ధం చేస్తే అందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు తప్పకుండా ఉంటాయి (Mango Markets In Telugu States) . ఇక్కడ పచ్చని తోటల్లో వివిధ రకాలు మామిడి పండ్లు ఉత్పత్తి అవుతాయి. ప్రతీ సమ్మర్‌లో తెలుగు రాష్ట్రాల నుంచి మామిడి పండ్లు, కాయలు దేశ వ్యాప్తంగా ఎగుమతి అవుతాయి.
ముఖ్యాంశాలు
నేను అస్సాంలోని గౌహతిలో (Guwahati) చిన్న సూపర్ మార్కెట్‌కు వెళ్లినప్పుడు, నోయిడాలోని అట్టా మార్కెట్‌లో ఒక పండ్ల షాపులో కూడా తెలుగు పేపర్లో చుట్టి ఉన్న మామిడిపండ్లు కనిపించాయి. ఇది ప్యూర్లీ మన ప్రాంతాల్లో లభించే మామిడి పండ్ల రుచి, మార్కెటింగ్ బలమే అని చెప్పగలను.
- ఇది కూడా చదవండి : సమ్మర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా ? తెలుగు రాష్ట్రాల్లో టాప్ 16 డెస్టినేషన్స్… Summer Destinations In Telugu States
పండ్లలో కింగు | King Of Fruits
ఇక తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మామిడి పండ్ల మార్కెట్ గురించి మాట్లాడితే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పండ్లల్లో రాజు (King Of Fruits) అయిన మామిడి పండ్లతో నిండిన ట్రక్కులు వస్తుంటాయి. ఈ మార్కెట్లు ప్రజల నుంచి వచ్చే డిమాండ్‌ను తీర్చడమే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాలకు, విదేశాలకు మన వద్ద లభించే బనగానపల్లి, సువర్ణరేఖ (Suvarna Rekha), తోతాపురి వంటి మామిడి రకాలను ఎగుమతి చేస్తాయి.
ఎంతో మందికి ఉపాది | Mango Markets In Telugu States

తెలుగు రాష్ట్రాల్లో మామిడి వ్యాపారం చాలా మందికి జీవనోపాదిని కల్పిస్తుంది. రైతులు, కూలీలు, వ్యాపారులు, వాహనాలు నడిపేవారు, అనుబంధ వ్యాపారాల్లో మామిడి కాయల వల్ల చాలా మంది డబ్బు సంపాదించలుగుతున్నారు. ఇక మార్కెట్ డిమాండ్ అండ్ సప్లైను, క్వాలిటీ, రకాన్ని బట్టి క్వింటాల్‌కు రూ.3,000 నుంచి రూ.8000 వరకు ధర పలుకుతుంది. మీకు ఎప్పుడైనా వీలైతే ఈ మామిడి పండ్ల మార్కెట్‌ను సందర్శించండి. ఎందుకంటే ఇక్కడ ఎగుమతికి సిద్ధం అయిన కాయలతో పాటు దిగుమతి చేసుకున్న కాయలు కూడా లభిస్తాయి.
బోయిన్ పల్లి మార్కెట్ , హైదరాబాద్
Bowenpally Market, Hyderabad (Telangana) : తెలంగాణలో ఉన్న అతిపెద్ద మ్యాంగో మార్కెట్‌లో బోయిన్ పల్లి మార్కెట్ కూడా ఒకటి. ఎండాకాలం ఈ మార్కెట్ రకరకాల మామిడి కాయలు, కొనుగోలుదారులు, అమ్మకం దారులతో సందడిగా ఉంటుంది. తెలంగాణలోని వివిధ ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ఇక్కడికి ట్రక్కుల నిండా కాయలు వస్తుంటాయి.
ఈ మార్కెట్ అనేది బేనిసాన్ (Benishan-Banganapalli), తోతాపురి, హిమాయతి వంటి రకాల కాయలకు ప్రసిద్ది చెందింది.
బాటసింగారం పండ్ల మార్కెట్
Batasingaram Fruit Market, Hyderabad (Telangana) : హైదరాబాద్‌లో మామిడి పండ్లు ఎక్కువగా అన్‌లోడ్ అంటే దిగుమతి చేసుకునే మార్కెట్ ఇదే. కేవలం 2025 ఏప్రిల్ నెలలోనే 4,000 ట్రక్కుల నిండా మామిడి పండ్లు ఈ మార్కెట్లోకి తీసుకువచ్చారంటే ఈ మార్కెట్ ఎంత పెద్దదో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ స్థానిక వెరైటీలతో పాటు బేనిషాన్, తోతాపూరి వంటి దిగుమతి చేసుకున్న మామిడికాయలు కూడా లభిస్తాయి.
- ఇది కూడా చదవండి : Laknavaram : లక్నవరంలో మూడవ ద్వీపం..ఎలా ఉందో చూడండి
జగిత్యాల మ్యాంగో మార్కెట్
Jagtial Mango Market, Telangana : చెల్గాల్ జిల్లాలో ఉన్న జగిత్యాల్ మ్యాంగో మార్కెట్ అనేది తెలంగాణలో అతి పెద్ద మ్యాంగో మార్కెట్‌లలో ఒకటి. ఇక్కడ లభించే బనగానపల్లి లేదా బంగినపల్లి మామిడి పండ్లు చాలా మందికి ఇష్టం. అందుకే ఇక్కడి నుంచి ఈ రకం మామిడి కాయలు ఉత్తర భారత దేశంతో పాటు మధ్యప్రాచ్యానికి (Middle East) కు కూడా ఎగుమతి అవుతుంటాయి.
- వీటితో పాటు హైదరాబాద్‌లోని పహాడి షరీఫ్, ఎంజే మార్కెట్‌లు (MJ Market) కూడా ద్వితియ శ్రేణి మామిడి పండ్ల మార్కెట్‌గా గుర్తింపు తెచ్చుకున్నాయి.
ఆంద్రప్రదేశ్ | Andhra Pradesh Mango Market

భారత దేశంలో మామిడి ఉత్పత్తిలో ఏపీది కీలక స్థానం అని చెప్పవచ్చు. ప్రతీ ఏడాది ఇక్కడ 1.2 మిలియన్ టన్నుల మామిడి ఉత్పత్తి అవుతుంది. దేశ వ్యాప్తంగా ఉండే మామిడి ఉత్పత్తిలో ఇది 22 శాతం. ఇక్కడి సారవంతమైన నేల, తీర ప్రాంతాలు అలాగే బనగాన పల్లి, సువర్ణరేఖ, చిన్నరసాలు (Chinna Rasal), తోతాపురి వంటి ఎన్నో రకాల వెరైటీల వల్ల ఏపీ మ్యాంగోలకు (Andhra Pradesh Mangoes) డిమాండ్ ఉంటుంది.
ఒక ఏపీలో ఉన్న టాప్ 5 మ్యాంగో మార్కెట్ల విషయానికి వస్తే (top mango markets in andhra pradesh)
నున్న మ్యాంగో మార్కెట్, విజయవాడ
Nunna Mango Market, Vijayawada : నున్న మార్కెట్‌ను ఆసియాలోనే అతిపెద్ద మ్యాంగో మార్కెట్ అని కూడా అంటుంటారు. ఆంధప్రదేశ్ మామిడి వ్యాపారానికి ఇది కేంద్ర బింధువు లాంటిది. ఇక్కడ బనగానెపల్లి, చిన్న రసాలు, వంటి అనేక రకాలు మామిడికాయలు లభిస్తాయి. కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి, ఖమ్మం జిల్లాలోని సుమారు 2 లక్షల మంది మామిడి రైతులకు ఈ మార్కట్ చాలా కీలకమైనది. మామిడి సీజన్ వస్తే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కొనుగోలుదారులు ఇక్కడికి వస్తుంటారు.
- ఇది కూడా చదవండి : Lambasingi : నేషనల్ క్రష్ లంబసింగి ఎలా వెళ్లాలి ? నిజంగా స్నో పడుతుందా ? 5 Tips & Facts
చిత్తూరు మ్యాంగో మార్కెట్ | Chittoor Mango Market
ఏపీలో మరో కీలక మ్యాంగో మార్కెట్ ఇదే. ఇక్కడ అనేక రకాల మామిడి లభిస్తుంది. ఎండాకాలంలో ఇక్కడ భారీ స్థాయిలో వ్యాపారం జరుగుతుంది. ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు కూడా మామిడి పండ్లను ఎగుతుమతి చేస్తుంటారు.
నూజివీడు మ్యాంగో మార్కెట్ | Nuzvid Mango Market
ఆంధ్రప్రదేశ్ మ్యాంగో బెల్టులో (AP Mango Belt) నూజివీడు అనేది కీలకమైనదిగా చెబుతుంటారు. ఇక్కడ బనగానపల్లి, చిన్న రసాల మామిడి పండ్లకు మంచి డిమాండ్ ఉంటుంది. చాలా మంది నూజివీడు రసాల అని కూడా పిలుస్తుంటారు. ఈ మార్కెట్ నుంచి దేశంలోని పలు ప్రాంతాలతో పాటు విదేశాలకు కూడా నూజివీడు మామిడి ఎగుతుమతి అవుతుంది. ఇక ఇక్కడ మ్యాంగో మార్కెట్ యార్డును ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.
రాజమండ్రి మ్యాంగో మార్కెట్ | Rajahmundry Mango Market
ఏపీలో అత్యధిక మామిడి ధరలు రికార్డు అయిన మార్కెట్‌గా రాజమండ్రి మ్యాంగో మార్కెట్‌కు పేరుంది. అయితే సీజన్, వెరైటీని బట్టి ఈ ధరల్లో మార్పు ఉంటుంది. గోదావరి జిల్లా నుంచి వచ్చే మామిడి కాయలకు ఈ మార్కెట్ అత్యంత కీలకం కాగా ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు ఎగుమతి కూడా చేస్తుంటారు.
కాకినాడ మ్యాంగో మార్కెట్ | Kakinada Mango Market
కోస్తా ప్రాంతంలో ఉన్న ప్రముఖ మార్కెట్లలో ఇది కూడా ఒకటి. ఇక్కడా బంగినపల్లి వెరైటీతో పాటు ఇతర రకాల మామిడి పండ్లను భారీ స్థాయిలో ఎగుమతి, దిగుమతి చేస్తుంటారు.ఇక్కడ ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఉండటం మరో ప్లస్ పాయింట్.
బోయిన్ పల్లి నుంచి బాట సింగారం వరకు…నున్న మార్కెట్ నుంచి కాకినాడ వరకు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో మామిడి పండ్ల మార్కెట్లు ఉన్నాయి. అందులో ప్రముఖమైనవి, నాకు తెలిసిన, సమాచారం ఉన్న మార్కెట్ల గురించి ఈ పోస్టులో ప్రస్తావించాను. మీకు తెలిసిన మార్కెట్లు ఏమైనా ఉంటే కామెంట్ చేయగలరు.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.