రేలారే ప్రసాద్ గళంలో సోమశిల అందాలు … తెలంగాణలో తప్పక చూడాల్సిన ప్రదేశం | Somasila Song 2026
Somasila Song 2026 : తెలంగాణ టూరిజం ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. విభిన్నమైన మార్గంలో పర్యటకాన్ని ప్రమోట్ చేస్తోంది. అదే కోవలో నా మిత్రుడు, గాయకుడు, రచయిత రేలారే ప్రసాద్ (Relare Prasad) పాడిన కొత్త పాట సోమశిల విడుదలైంది.
ఇది కేవలం పాట కాదు, మన నాగర్ కర్నూల్ జిల్లా అందాలను చూపించే ఒక దృశ్య కావ్యం.
చూడకళ్లు చాలవే మన సోమశిల
తన కడుపున దాచుకుంది నల్లమల
ఈ రెండు లైన్లలోనే సోమశిల అసలు అందం ఉంది.
అసలు సోమశిల ఎక్కడ ఉంది? | Somasila Location
సోమశిల అనేది నాగర్ కర్నూల్ జిల్లా, కొల్లాపూర్ మండలంలో, కృష్ణా నది ఒడ్డున ఉన్న ఒక ప్రశాంతమైన పుణ్యక్షేత్రం అండ్ ఎకో-టూరిజం స్పాట్. కృష్ణా నదిపై నిర్మించిన సోమశిల రిజర్వాయర్ వల్ల ఈ ప్రాంతం ఒక అందమైన ద్వీపంలా కనిపిస్తుంది, చుట్టూ నల్లమల (Nallamala Forest) అడవులు ఈ అందాన్ని రెట్టింపు చేస్తాయి.
సోమశిల ప్రత్యేకతల్లో ఇక్కడ ఉన్న 15 శివాలయాలు కూడా ఒకటి. వాటిలో శ్రీ లలితా సోమేశ్వర స్వామి ఆలయం ప్రముఖమైనది. ఈ క్షేత్రంలో చాళుక్యులు, కాకతీయుల కాలానికి చెందిన చారిత్రక శాసనాలు కూడా కనిపిస్తాయి.
పాటలో రేలారే ప్రసాద్ చెప్పినట్టు..సప్తనదులు కూడిన మన సంగమేశ్వరాలయం..నిజంగానే ఇక్కడ కృష్ణా, భవనాశి వంటి నదుల సంగమం అద్భుతంగా ఉంటుంది.
పాట మాత్రమే కాదు… ట్రావెల్ గైడ్ కూడా | Why To Visit Somasila
సోమ శిలపై వచ్చిన ఈ పాట ఒక పాట మాత్రమే కాదు…ఒక ట్రావెల్ గైడ్ కూడా. పాటలోని ప్రతి చరణం ఒక టూరిస్ట్ స్పాట్ ని చూపిస్తుంది..
- రెండు కొండల మధ్యన పారే జల సిరులు : రిజర్వాయర్ బోటింగ్ లో ఈ దృశ్యం అద్భుతం.
- నింగి ఆ నీరు కలిసినట్టు దృశ్యాలు: ఫోటోగ్రఫీ హెవెన్ ఈవీడియో. సూర్యోదయం, సూర్యాస్తమయం వేళ నీటిలో సూర్యుడి ప్రతిబింబం – పాటలో సూర్యుడొచ్చి నీటితో ఉన్నట్టు ప్రతిబింబం అన్నది ఒక అక్షర సత్యం.
- ద్వీపమే స్వయంగా వెలసినట్టు: వర్షాకాలంలో నీటి మధ్యలో చిన్న చిన్న గుట్టలు ద్వీపాల్లా కనిపిస్తాయి.
దక్షిణాది రిషికేశ్లా..సోమశిల
సోమశిల ఆలయ ప్రాంగణాన్ని ఆథ్యాత్మిక కేంద్రంగానే కాదు…స్పిరిచువల్ రిక్రయేషన్ వేదికగా మార్చాలని చూస్తోంది తెలంగాణ టూరిజం విభాగం. దేవ్‌భూమి ఉత్తరాఖండ్‌లో రిషికేశ్‌ను ప్రపంచ యోగా రాజధాని అని అంటారు. అలాగే సోమశిలనున కూడా యోగా, ఎకో-టూరిజం కేంద్రంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
అందులో భాగంగా వెల్నెస్ అండ్ స్పిరిచువల్ రిట్రీట్ (Wellness and Spiritual Retreat) గా అభివృద్ధి చేస్తోంది. దీని కోసం కేంద్రం నుండి రూ. 68.10 కోట్లు మంజూరయ్యాయి.
అంతేకాదు, హైదరాబాద్ నుండి సోమశిల శ్రీశైలం మీదుగా హెలీ టూరిజం (Heli Tourism) కూడా మొదలైంది. హెలికాప్టర్ లో నల్లమల అడవులు, కృష్ణా నదిని పై నుండి చూడొచ్చు. అలాగే సోమశిల నుండి శ్రీశైలం కి బోట్ సర్వీస్ కూడా ఉంది.

ఎలా వెళ్లాలి? | How To Reach Somasila
హైదరాబాద్ నుండి (From Hyderabad) : సుమారు 160-180 కి.మీ దూరంలో ఉంటుంది సోమశిల. కొల్లాపూర్ మీదుగా కారులేదా బైక్ లో 4 గంటల ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
Open in Google Maps
ఎప్పుడు వెళ్లాలి ? (Best Time To Visit): జూలై నుండి ఫిబ్రవరి మధ్యలో వెళ్లడం ఉత్తమం. వర్షాకాలంలో రిజర్వాయర్ నిండుగా ఉండి పాటలో చెప్పినట్టు దివినుండీ దిగివచ్చిన తీరుగా కనిపిస్తుంది.
సందర్శనీయ ప్రదేశాలు (Places To Visit): లలితా సోమేశ్వర ఆలయం, సంగమేశ్వర ఆలయం (బోట్ లో వెళ్లాలి), సోమశిల రిజర్వాయర్, నల్లమల అటవీ ప్రాంతం.
పాట గురించి | About The Song
ఈ పాటను పూర్తిగా తెలంగాణ టూరిజాన్ని ప్రమోట్ చేసే ఉద్దేశంతో తీశారు.
Song Credits: Lyrics & Singer: Relare Prasad | Music: Kalyan Keys | Concept & Director: Dr. Peddapalli Vijayakumar | DOP: Raaja Studios
Watch Somasila Full Song 2026 : ఈ పాట వింటుంటేనే సోమశిల వెళ్లాలనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి వినండి – https://www.youtube.com/watch?v=TBC988xMQ_E
మిత్రుడు రేలారే ప్రసాద్ అన్నట్టు… తెలంగాణ తల్లి నుదుట నిలిచిన సింధూరం, నల్లమల వనములో వెలసిన మణిహారం.. సోమశిల నిజంగా మన తెలంగాణకు మణిహారమే. ఈసారి వీకెండ్ ప్లాన్ ఏంటా అని ఆలోచిస్తున్నారా? సోమశిలకు వెళ్లి రండి.
అలాగే టూరిజం మంత్రి జూపల్లిగారితో కలిసి హైదరాబాద్‌ను హాట్ ఎయిర్బెలూన్లో ప్రయాణిస్తూ ప్రయాణికుడు చేసిన ఇంటర్వ్యూను కూడా చూడండి.
▶️ వీడియో చూడండి : 3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు – ప్రత్యేక వీడియో
అలాగే గత సోమవారం సాక్షిలో ప్రయాణికుడు రాసిన ఫుల్ పేజి ట్రావెల్ ఫీచర్‌ను చదవండి

🔗 e-Paper Link:
Credit & Acknowledgement:
Entire page content contributed by M.G. Kishore (Prayanikudu.com). With thanks to the Sakshi editorial team for publication support.
Feature Photo Credit to the https://www.youtube.com/@Soundboxfilmandmusic
