జకార్తాలో అగ్నిపర్వతం విస్ఫోటనం.. తెలుగు వారికి అలర్ట్ | Anak Krakatau
ఇండోనేషియాలో అనక్ క్రకటావు (Anak Krakatau) అగ్నిపర్వతం విస్ఫోటనం వల్ల జకార్తా బాలి సహా ఆరు విమానాశ్రయాల్లో ఫ్లైట్స్ నిలిపివేత. తెలుగు ప్రయాణికులకు తాజా అలర్ట్.
ఇండోనేషియాలో సెప్టెంబర్ ఆరు ఉదయం పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. సుందా జలసంధిలో ఉన్న అనక్ క్రకటావు అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. అధికారిక సమాచారం ప్రకారం ఈ విస్ఫోటనం సెప్టెంబర్ ఆరు తెల్లవారుజామున 3:53 గంటలకు సుమారు 30 సెకన్ల పాటు జరిగింది. దీని నుండి వెలువడిన బూడిద మేఘాలు గాలిలో చాలా ఎత్తు వరకు వ్యాపించాయి.
దీని ప్రభావంతో జకార్తా (Jakarta) లోని ప్రధాన విమానాశ్రయంలో విమానాల రాకపోకలను ఉదయం 5:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు.
అసలు ఏం జరిగింది | What Actually Happened
ఈ బూడిద విమానాల ఇంజిన్లకు చాలా ప్రమాదకరం. అందుకే ఇండోనేషియా విమానయాన అధికారులు ముందు జాగ్రత్త చర్యగా మొత్తం ఆరు విమానాశ్రయాలలో (Airports) కార్యకలాపాలను నిలిపివేశారు.
జకార్తా ప్రధాన విమానాశ్రయమైన సోకర్నో హట్టా (Soekarno Hatta) లో వందలాది విమానాలు ప్రభావితమయ్యాయి. బాలి (Bali) లోని ప్రధాన విమానాశ్రయంలో కూడా జకార్తా వెళ్లే కొన్ని విమానాలు రద్దు అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలు, చేపల వేటను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు.
UPDATE TERBARU ERUPSI GUNUNG ANAK KRAKATAU SABTU PAGI (5 SEPTEMBER 2026)!
— Sumatera Adil & Federal (@indepenSumatera) September 5, 2026
Aktivitas erupsi Gunung Anak Krakatau di Selat Sunda yang terjadi sejak Jumat malam hingga Sabtu pagi ini (5/9/2026) masih terus menunjukkan eskalasi vulkanik!
Setelah visual letusan sempat tidak… pic.twitter.com/ZmW4chv1yg
భారతీయలకు ఎందుకు ముఖ్యం | Why Important for Indians
ఇండోనేషియా భారతీయులకు ఫేవరిట్ విదేశీ గమ్యస్థానాలలో ఒకటి. వీసా లేకుండా ఎంటర్ అయ్యి, తక్కువ బడ్జెట్ లో బాలి పర్యటన చేయవచ్చు. ఇలాంటి అనేక కారణాలతో ప్రతి నెలా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ నుండి వేల మంది వెళ్తుంటారు. ముఖ్యంగా కొత్త జంటలు, ఉద్యోగులు బాలిని ఎక్కువగా ఎంచుకుంటారు.
తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లేవారికి .. | Info for Telugu Travellers

తెలుగు రాష్ట్రాల నుండి వెళ్లేవారు సాధారణంగా సింగపూర్ లేదా కౌలాలంపూర్ మీదుగా వెళ్తారు. మీ ప్రయాణం జకార్తా మీదుగా కనెక్టింగ్ విమానంలో ఉంటే ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని విమాన సంస్థలు తమ విమానాలను రద్దు లేదా టైమ్ మార్చినట్లు ప్రకటించాయి. కాబట్టి బయలుదేరే ముందు ఒకసారి చెక్ చేయడం బెటర్.
ప్రయాణానికి ముందు.. | What to Check Before Travel
ముందుగా మీ విమాన సంస్థ నుండి వచ్చిన మెసేజును పరిశీలించండి. కేవలం గూగుల్ లో కనిపించే సమాచారం మీద మాత్రమే ఆధారపడవద్దు. సంబంధిత విమాన సంస్థ అధికారిక వెబ్ సైట్లో విమాన స్థితిని తప్పక చూడండి. ఒకవేళ విమానం రద్దయితే మళ్లీ బుకింగ్ లేదా డబ్బు తిరిగి ఇచ్చే విధానం గురించి సంప్రదించండి.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి | Precautions Now
అగ్నిపర్వతానికి దగ్గరలో ఉన్న ప్రాంతాలకు వెళ్లవద్దు. అధికారులు దాని చుట్టూ 3 కిలోమీటర్ల ప్రాంతానికి వెళ్లడం నిషేధించారు.జకార్తా లేదా బాలిలో ఉన్న తెలుగు ప్రయాణికులు లోకల్ అఫిషియల్స్ సూచనలు పాటించాలి. బయట బూడిద ఉన్నప్పుడు ముఖానికి మాస్క్ ధరించడం మంచిది.
టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ కేర్లెస్గా ఉండవద్దు. పరిస్థితి వేగంగా మారుతోంది కాబట్టి ప్రయాణానికి కొన్ని గంటల ముందు కూడా ఒకసారి ఫ్లైట్ పరిస్థితి ఏంటో తెలుసుకోండి. ఈ పోస్టును 2026 సెప్టెంబర్ 7 గంటలకు అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాశాము. అప్టేడ్స్ చెక్ చేసుకోగలరు.
ఇంపార్టెంట్ Travel Information
హైదరాబాద్ నుండి జకార్తాకు డైరక్ట్ ఫ్లైట్ లేదు. సింగపూర్ లేదా కౌలాలంపూర్ మీదుగా వెళ్లాలి. జకార్తా అనేది విమానాశ్రయం నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. బాలి విమానాశ్రయం పూర్తిగా మూతబడలేదు. జకార్తా మార్గాల్లో మాత్రమే అంతరాయం ఉంది.
▶️ వీడియో చూడండి : థాయ్లాండ్ కంప్లీట్ ట్రావెల్ గైడ్
