1000 ఏళ్ల క్రితం తిరుమలలో బ్రహ్మోత్సవం ఎలా జరిగేదో తెలుసా? శాసనాల్లో బయటపడ్డ అసలు నిజం! | Tirumala Brahmotsavam Origin
Tirumala Brahmotsavam Origin : శాసనాల్లో శ్రీవారి బ్రహ్మోత్సవ చరిత్ర ఏంటో తెలుసా? 966లో పల్లవ రాణి దానం నుంచి ఏడాదికి 10 ఉత్సవాల వరకు 1000 ఏళ్ల వైభవం పూర్తి Timeline…
తిరుమలలో బ్రహ్మోత్సవాలు అంటే ఇప్పుడు మన కళ్లముందు కనిపించేది భారీ స్థాయి ఆధ్యాత్మిక వేడుక. కానీ ఈ ఉత్సవ సంప్రదాయం ఎలా మొదలైంది? ఎప్పటి నుంచి జరుగుతోంది? కాలక్రమంలో ఎన్ని మార్పులు వచ్చాయి? ఈ ప్రశ్నలకు సమాధానం పురాణ కథనాల్లో మాత్రమే కాదు.. తిరుమల ఆలయ గోడలపై ఉన్న Inscriptions (శాసనాలు)లోనూ కనిపిస్తుంది.
రాజులు, రాణులు, సామంతులు చేసిన దానాలు, కొత్తగా ఏర్పడిన ఉత్సవాలు, ఉత్సవమూర్తి మార్పులు ఇలా ఎన్నో విషయాలను ఈ శాసనాలు తెలియజేస్తున్నాయి.
బ్రహ్మ నిర్వహించిన ఉత్సవం | The Festival Conducted by Lord Brahma

బ్రహ్మోత్సవాల చరిత్ర.. ఒక Timeline
• 966 CE: పల్లవ రాణి సామవై పెరుందేవి శ్రీవారికి వెండి భోగ శ్రీనివాసమూర్తిని సమర్పించింది. ఉత్సవాల కోసం భూములు, ఆభరణాలు కూడా దానం చేసింది. ఆమె దానశాసనం తిరుమల ఆలయ మొదటి ప్రాకారంలోని ఉత్తర గోడపై ఉంది. ఆ సమయంలో పురట్టాసి, మార్గశిర మాసాల్లో బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి.
• 1209–1263: వీర నరసింహ యాదవరాయుల కాలానికి పాంగుని బ్రహ్మోత్సవం ఆపాదించబడింది.
• 1254: విజయ గండగోపాలదేవుని కాలంలో చిత్తిరై బ్రహ్మోత్సవం చేరింది.
• 1300–1330: యాదవరాయుల కాలంలో ఆడి బ్రహ్మోత్సవం ఏర్పడింది. దీంతో విజయనగర సామ్రాజ్యం ఏర్పడే సమయానికి తిరుమలలో సంవత్సరానికి ఐదు బ్రహ్మోత్సవాలు జరిగే స్థాయికి సంప్రదాయం చేరింది.
• 1339 ప్రాంతం: మలయప్పస్వామివారు ఉత్సవమూర్తిగా ఉపయోగించబడుతున్న దశకు సంబంధించిన శాసన ఆధారాలు కనిపిస్తాయి. శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామికి ఉత్సవాలు నిర్వహించే సంప్రదాయం ఏర్పడింది.
• 14వ–15వ శతాబ్దాలు: విజయనగర కాలంలో ఉత్సవాల సంఖ్య, వైభవం మరింత విస్తరించింది. చివరి దశలో సంవత్సరానికి పది బ్రహ్మోత్సవాల వరకు శాసనాల్లో నమోదయ్యాయి.
• 1513: శ్రీకృష్ణదేవరాయలు తిరుమలను దర్శించిన అనంతరం తన జన్మమాసమైన తై మాసంలో కొత్త బ్రహ్మోత్సవాన్ని ఏర్పాటు చేశారు.
• 1533–1534: కార్తీక బ్రహ్మోత్సవానికి సంబంధించిన శాసన ఆధారాలు కనిపిస్తాయి.
• 1539: తాళ్లపాక పెద తిరుమలయ్యంగార్ ఆధ్వర్యంలో ఆణి బ్రహ్మోత్సవం ఏర్పడింది. ఈ కాలంలో వార్షిక బ్రహ్మోత్సవాల సంఖ్య పది దశకు చేరినట్లు చారిత్రక వివరాలు చెబుతున్నాయి.
• 1843: తిరుమల ఆలయ పరిపాలన హథీరాంజీ మఠ మహంతుల ఆధీనంలోకి వెళ్లింది.
• 1933: తిరుమల తిరుపతి దేవస్థానములు ఏర్పడటంతో మహంతుల పరిపాలన ముగిసింది. ఆ తర్వాత బ్రహ్మోత్సవాల నిర్వహణ మరింత సంస్థాగతంగా మారింది.
- ఇది కూడా చదవండి : తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఎవరు నిర్మించారు ? శ్రీవారు వైకుంఠం విడిచి ఎందుకు వచ్చారు?
తొమ్మిదిరోజుల పండగ మాత్రమే కాదు…
తిరుమల వెళ్లే భక్తులకు బ్రహ్మోత్సవం అంటే కేవలం తొమ్మిది రోజుల పండుగగా కాకుండా, వెయ్యేళ్లకు పైగా మారుతూ వచ్చిన సంప్రదాయంగా చూడవచ్చు. ఒకప్పుడు సంవత్సరంలో రెండు ఉత్సవాలతో కనిపించిన సంప్రదాయం.. చోళులు, యాదవరాయులు, విజయనగర రాజుల కాలంలో అనేక ఉత్సవాలుగా విస్తరించింది.
ముఖ్యంగా మలయప్పస్వామివారి ఉత్సవమూర్తి సంప్రదాయం, శ్రీకృష్ణదేవరాయలు ఏర్పాటు చేసిన ఉత్సవం, రాజుల దానాలు వంటి అంశాలు నేటి వాహన సేవలు, బ్రహ్మోత్సవాల వెనుక ఉన్న చారిత్రక నేపథ్యాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి.

తిరుమల వెళ్లే భక్తులు ఈ శాసనాన్ని ఎక్కడ చూడొచ్చు?
సామవై పెరుందేవి దానానికి సంబంధించిన ముఖ్యమైన శాసనం తిరుమల శ్రీవారి ఆలయ మొదటి ప్రాకారంలోని ఉత్తర గోడపై చెక్కబడి ఉన్నట్లు TTD తెలిపింది.
ఆలయ దర్శనానికి వెళ్లినప్పుడు చుట్టూ ఉన్న చారిత్రక నిర్మాణాలను కూడా గమనించండి. సాధారణ దర్శన అనుభవానికి భిన్నంగా తిరుమల చరిత్రను అర్థం చేసుకోవడానికి ఇలాంటి శాసనాలు ఉపయోగపడతాయి.
Travel Tip: శ్రీవారి దర్శనంతో పాటు ఆలయ నిర్మాణం, ప్రాకారాలు, శాసనాల వంటి చారిత్రక అంశాలను గమనించడానికి కొంత సమయం కేటాయించండి. బ్రహ్మోత్సవాల వెనుక ఉన్న చరిత్రను తెలుసుకున్న తర్వాత వాహన సేవలను చూడటం మరింత ఆసక్తికరంగా అనిపిస్తుంది.
FAQ
- తిరుమల బ్రహ్మోత్సవాల చరిత్ర ఎంత పాతది? | How Old is Tirumala Brahmostavam History
శాసన ఆధారాల ప్రకారం కనీసం 10వ శతాబ్దం నుంచే బ్రహ్మోత్సవాల నిర్వహణకు సంబంధించిన ఆధారాలు కనిపిస్తున్నాయి.
- సామవై పెరుందేవి శాసనం ఎక్కడ ఉంది? | Where is Samavai Perundevi Inscriptions?
తిరుమల ఆలయ మొదటి ప్రాకారంలోని ఉత్తర గోడపై ఆమె దానశాసనం చెక్కబడి ఉంది.
- మలయప్పస్వామివారి ఉత్సవమూర్తి సంప్రదాయం ఎప్పటి నుంచి కనిపిస్తుంది?
సుమారు 1339 ప్రాంతం నుంచి మలయప్పస్వామివారు ఉత్సవమూర్తిగా ఉపయోగించబడుతున్నట్లు శాసన ఆధారాలు ఉన్నాయని TTD తెలిపింది.
Source: TTD Official Press Release
▶️ వీడియో చూడండి : పండరిపురం ట్రావెల్ గైడ్
