హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్: మెట్రో + ఆర్టీసీ కి ఒకే పాస్! – Metro RTC Combined Pass
Metro RTC Combined Pass : హైదరాబాద్లో మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి పాస్ త్వరలో…! సీఎస్ సంజయ్ జాజు ఆదేశం, పాతనగరం మెట్రో విస్తరణపై కీలక అప్డేట్. పూర్తి వివరాలు.
హైదరాబాద్ నగర ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలోనే మెట్రో రైల్, ర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు ఒకే ఉమ్మడి పాస్ అందుబాటులోకి రానుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజు ఈ మేరకు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఈ రోజు బేగంపేటలోని మెట్రో రైల్ భవన్ లో సీఎస్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హెచ్ఎంఆర్ఎల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, అదనపు ఎండీ అజిత్ రెడ్డి, జాయింట్ ఎండీ శివేంద్ర ప్రతాప్ తో పాటు టీజీఎస్ ఆర్టీసీ, విద్యుత్ శాఖ, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అధికారులు పాల్గొన్నారు.
- ఇది కూడా చదవండి : హైదరాబాద్ మొత్తాన్ని 2 రోజుల్లో పూర్తి చేయగలమా? – No | 2-Day Hyderabad Practical Tour
వెంటనే ఉమ్మడిపాసులకు ఆదేశం | Hyderabad Metro RTC Combined Pass
ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా రోజువారీ, నెలవారీ ఉమ్మడి పాసులను వెంటనే ప్రవేశపెట్టాలని సీఎస్ ఆదేశించారు. దీనిపై ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైల్ (Hyderabad Metro) , ఆర్టీసీ (TGSRTC) అధికారులు స్పందించారు.
సాంకేతికంగా తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని, ఎప్పుడైనా అమలు చేయగలమని తెలిపారు. ఉమ్మడి చార్జీలను త్వరగా ఖరారు చేసి విధానాన్ని అమల్లోకి తేవాలని సీఎస్ స్పష్టం చేశారు.
అంతేకాకుండా, ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పాతనగరంలో 7.5 కిలోమీటర్ల మెట్రో కారిడార్ (Metro Old City Corridor) విస్తరణ పనులపై సీఎస్ ప్రత్యేకంగా దృష్టి సారించారు.
రోడ్ విస్తరణ పనుల పురోగతి, జనరల్ కన్సల్టెన్సీ నియామకానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియపై ఆరా తీశారు. పనులను వేగవంతం చేసి త్వరితగతిన మెట్రో నిర్మాణం ప్రారంభించాలని ఆదేశించారు.
సమావేశం అనంతరం సీఎస్ సంజయ్ జాజు బేగంపేట నుండి ప్యారడైజ్ వరకు మెట్రో రైల్ లో ప్రయాణించారు. ఆయన వెంట హెచ్ఎంఆర్ఎల్ ఎండీ తదితరులు ఉన్నారు.
స్టేషన్లలోని వాణిజ్య సముదాయాలు, పార్కింగ్ స్థలాలను పరిశీలించి అభివృద్ధికి సూచనలు చేశారు. ఎన్ హెచ్-44 పై హెచ్ఎండీఏ నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్లను కూడా పరిశీలించారు.
▶️ వీడియో చూడండి : 3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు – ప్రత్యేక వీడియో
▶️ వీడియో చూడండి : కర్మాన్ఘాట్ ఆంజనేయుడి మహత్యం
