China Visa Fees : 2025 డిసెంబర్ వరకు చవకగా చైనా వీసా..
చైనా సందర్శించాలి అనుకుంటున్న భారతీయ పర్యాటకులకు శుభవార్త. వీసా ఫీస్ పాలసీని ( China Visa Fees ) 2025 డిసెంబర్ 31 వరకు కొనసాగించనున్నట్టు భారత్‌లోని చైనా ఎంబసి ప్రకటించింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచేందుకు, ప్రయాణికులకు తగిన వెసులుబాటు కల్పించే దిశలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ముఖ్యాంశాలు
చైనా వీసా ఫీ వివరాలు | China Visa Fee Structure For Indians
వీసా ఫీజు తగ్గింపును కొనసాగించాలని చైనా రాజబార కార్యాలయం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చైనా వీసా ఫీజు వివరాలు ఏంటో చూద్దాం.
- సింగిల్ ఎంట్రీ : రూ.2,900
- డబుల్ ఎంట్రీ వీసా : రూ.4,400
- ఆరునెలల్లో మల్టిపుల్ ఎంట్రీ వీసా : రూ.5,900
- 12 నెలలు లేదా అంతకు మించిన కాలంలో మల్టిపుల్ ఎంట్రి వీసా : రూ.8,800
- గ్రూఫ్, ఆఫిషియల్ వీసాలు : రూ.1,800
భారత్ చైనా వాస్తవాధీన రేఖ ( Line Of Actual Control ) వద్ధ సుస్థిరతను కొనసాగించడానికి చర్చలు కొనసాగుతున్న తరుణంలో ఈ ప్రకటన వెలువడింది. ఈ ఫీజులు అనేవి భారత్, చైనా మధ్య పర్యాటకాన్ని ప్రోత్సాహించడానికి, కల్చరల్ ఎక్స్ఛేంజ్తో పాటు ఇరు దేశాల మధ్య సంబంధాలు కొనసాగించే లక్ష్యంతో తక్కువగా నిర్ణయించి కొనసాగించనున్నారు అని తెలుస్తోంది.
వీసా ప్రక్రియ సులభతరం | China Visa Process for Indians

2024 ఆగస్టులో చైనీస్ ఎంబసీ తన వీసా మార్గదర్శకాలను సులభతరం చేస్తున్నట్టు ప్రకటించింది. భారతీయుల కోసం వీసా అప్లికేషన్ ప్రాసెస్‌ను అప్డేట్ చేస్తున్నట్టు తెలిపింది.
- డైరక్ట్ సబ్మిషన్ : 2023 నవంబర్ చైనా వీసా పాలసీ విధానం ( Chinese Visa Policy For Indians ) ప్రకారం అభ్యర్థులు వీసా కేంద్రంలో తమ డాక్యుమెంట్స్ డైరక్టుగా అప్లై చేయవచ్చు. దీనికోసం ముందస్తు అపాయింట్మెంట్ అవసరం లేదు. డాక్యుమెంట్స్ సరిగ్గా ఉంటే వీసా ప్రక్రియ వేగవంతం అవుతుంది.
- ఫింగర్‌ప్రింట్ మినహాయింపు: 14 సంవత్సరాల లోపు, 70 ఏళ్లు పైబడిన వారికి ఫింగర్ ప్రింట్ సేకరణ నుంచి మినహాయింపు లభించనుంది.
- దీంతో పాటు ప్రస్తుతం ఉన్న పాస్‌పోర్టుపై ఇంతకు ముందు ఫింగర్‌ప్రింట్ అందించిన వారికి, ఫింగర్‌ప్రింట్ ఇవ్వడం సాధ్యం కాని వారికి మినహయింపు లభించనుంది.

ప్రాసెస్ సమయం | Chinese Visa Process Timing
- ఎక్స్‌ప్రెస్ సర్వీస్ అయితే 3 రోజులు
- రెగ్యులర్ సర్వీస్ అయితే 4 రోజులు
కావాల్సిన డాక్యుమెంట్స్ | Documents for a Chinese Visa
చైనా వీసా కోసం అప్లై చేయాలి అని భావిస్తోన్న అభ్యర్థులు ఈ కింది డాక్యుమెంట్స్ సమర్పించాల్సి ఉంటుంది.
- పూర్తి సమాచారం ఉన్న వీసా అప్లికేషన్ ఫామ్
- ఆరునెలల గడువు ఉన్న పాస్‌పోర్ట్
- రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు
- దీంతో పాటు మీ అవసరాన్ని బట్టి కావాల్సిన డాక్యుమెంట్స్
భారతీయ పర్యాటకులకు తగ్గింపు ధరలో వీసా ప్రాసెస్ చేయడంతో పాటు ఈ ప్రక్రియను సులభతరం చేయడం అనేది ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు ఏర్పాటు చేసే దిశలో ఒక ముందడుగు అని చైనా భావిస్తోంది. మీకు మరింత సమాచారం కావాలి అంటే చైనీస్ ఎంబసి అధికారిక వెబ్సైట్ విజిట్ చేయగలరు.
Trending Video On : Prayanikudu Youtube Channel
- Pandharpur: 7 గంటల్లో 7 ఆలయాల దర్శనం
- Hemkund Sahib Trek : హిమాలయాల్లో బ్రహ్మకమలం దర్శనం
- Kamakhya Temple: కామాఖ్య దేవీ కథ
- Tuljapur : శివాజీ నడిచిన దారిలో తుల్జా భవానీ మాత దర్శనం
- Shillong : అందగత్తెల రాజధాని ఫిల్లాంగ్