Dubai Desserts : హైదరాబాద్‌లో దుబాయ్ రుచులు.. ఫుడ్ లవర్స్ ను ఆకర్షిస్తున్న బెస్ట్ ప్లేసులివే !
Dubai Desserts : ఇటీవల కాలంలో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. కునాఫా చాక్లెట్ బార్లు, పొగలు కక్కే మిల్క్ కేక్‌లు, రకరకాల చాక్లెట్ డ్రీమ్ కేక్‌లు… ఇవన్నీ ఎక్కడ చూసినా కనిపించేస్తున్నాయి. ఎక్కడివి అనుకుంటున్నారా? అన్నీ దుబాయ్ నుంచి వచ్చినవే. దుబాయ్ ఇప్పుడు ప్రపంచానికే డెజర్ట్స్ క్యాపిటల్ అయిపోయింది. అక్కడ ప్రజలు కొత్తగా, విలాసవంతంగా ఉండేవి బాగా ఇష్టపడతారు. అందుకే, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలకు అదిరిపోయే, నోరూరించే స్వీట్స్‌ను తయారు చేయడంలో దుబాయ్ ఒక బ్రాండ్‌గా మారింది. ఫుడ్ బ్లాగర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు వీటిని మరింత పాపులర్ చేయడంతో ఈ దుబాయ్ డెజర్ట్‌లు ఎక్కడికక్కడ చాలా వేగంగా స్ప్రెడ్ అవుతున్నాయి.
హైదరాబాద్ నగరం, ప్రపంచంలో ఏ మూల నుంచి వచ్చిన రుచులనైనా ఆహ్వానిస్తుంది. ముఖ్యంగా, మనకు గల్ఫ్ దేశాలతో ఎప్పటి నుంచో మంచి సంబంధాలున్నాయి కదా. అందుకే హైదరాబాద్ ప్రజలకు అరబిక్ వంటకాలపై ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఇప్పుడు ఆ అభిమానం డెజర్ట్స్లోకి కూడా వచ్చేసింది. హైదరాబాద్‌లోని చాలా రెస్టారెంట్లు, బేకరీలు ఈ ట్రెండ్‌ను బాగా వాడుకుంటున్నాయి. దుబాయ్‌లో వైరల్ అయిన డెజర్ట్‌లను ఇక్కడ మళ్ళీ తయారు చేస్తూ మన వాళ్ళు విదేశాలకు వెళ్లకుండానే ఆ టేస్ట్‌ను ఆస్వాదించేలా చేస్తున్నాయి. హైదరాబాద్‌లో ఈ ట్రెండీ దుబాయ్ డెజర్ట్‌లను ఎక్కడెక్కడ ట్రై చేయొచ్చో వివరంగా తెలుసుకుందాం.
హైదరాబాద్‌లో కచ్చితంగా టేస్ట్ చేయాల్సిన 6 దుబాయ్ డెజర్ట్స్
కునాఫా చాక్లెట్ బార్: ఈ డెజర్ట్ 2024లో ప్రపంచం మొత్తాన్ని ఒక ఊపు ఊపింది. ఇది క్రిస్పీ కటాయిఫి (నూడుల్స్ లాంటి పదార్థం), పిస్తా ఫిలింగ్తో పాటు, పైన మంచి చాక్లెట్‌తో కప్పబడి ఉంటుంది. హైదరాబాద్‌లో దీన్ని కరాచీ బేకరీ, జూచి, హౌస్ ఆఫ్ హ్యాపీనెస్, జోకోలాట్ లాంటి చోట్ల ట్రై చేయవచ్చు.

ఇది కూడా చదవండి : అంటార్కిటికా : 70 శాతం మంచినీరు ఇక్కడే ఉంది…రాత్రి సూరీడు…పగలు చీకటి
మిల్క్ కేక్స్: దుబాయ్‌లోని L’ETO Cafe లోని మిల్క్ కేక్, బాలీవుడ్ స్టార్ ఆలియా భట్ పొగడటంతో తెగ వైరల్ అయిపోయింది. ఇది చాలా సాఫ్ట్‌గా, పాల రుచితో ఉంటుంది. హైదరాబాద్‌లో కెప్టెన్ కునాఫా, గౌర్మెట్ బక్లావా, మోయా, జోకోలాట్ లో దీన్ని ట్రై చేయవచ్చు.
మటిల్డా కేక్: ఇది ఒక పెద్ద, పొరలు పొరలుగా ఉండే చాక్లెట్ కేక్. మటిల్డా సినిమాలో కేక్ తినే సీన్ నుంచి ప్రేరణ పొంది దీన్ని దుబాయ్‌లో పార్కర్స్ కేఫ్ మొదలుపెట్టింది. పైన వేడి ఫడ్జ్ సాస్‌ను పోస్తారు. హైదరాబాద్‌లో బాగెల్ క్రాఫ్ట్ లో దీన్ని టేస్ట్ చేయొచ్చు.
కరాక్ చాయ్ చీజ్ టోస్ట్: ఇది వినడానికి వింతగా ఉన్నా, రుచి మాత్రం బాగుంటుంది. క్రీమ్ చీజ్‌తో నింపిన టోస్ట్ శాండ్విచ్ పైన వేడి కరాక్ చాయ్‌ను పోసి ఇస్తారు. హైదరాబాద్‌లో పిస్తా హౌస్, కబాబ్ క్రాల్లిక్ లో ఈ స్పెషల్ డెజర్ట్‌ను ట్రై చేయవచ్చు.
టిరామిసు: ఇది ఒక క్లాసిక్ ఇటాలియన్ డెజర్ట్. దుబాయ్‌లోని పబ్లిక్ ఇన్ డౌన్‌టౌన్ దుబాయ్ దీన్ని వేడిగా ఎక్స్‌ప్రెస్సో పోసి సర్వ్ చేయడంతో వైరల్ అయింది. హైదరాబాద్‌లో టైగర్ లిల్లీ బిస్ట్రో లో దీన్ని ట్రై చేయొచ్చు.
డ్రీమ్ కేక్: ఈ చాక్లెట్ కేక్ అనేక లేయర్లతో ఉంటుంది. స్పాంజ్, క్రీమీ మౌస్, రిచ్ గనాష్, ఇంకా పగలగొట్టే చాక్లెట్ టాప్ దీని ప్రత్యేకత. దుబాయ్‌లోని ప్రైజ్త్రూ, చంక్ బేక్హౌస్ దీన్ని పాపులర్ చేశాయి. హైదరాబాద్‌లో హైవ్, బేక్లోర్ , సుభాన్ బేకరీ, రోస్టరీ కాఫీ హౌస్ లో దీన్ని టేస్ట్ చేయవచ్చు.
ఇది కూడా చదవండి : Indian License : భారతీయ లైసెన్స్ ఈ 15 దేశాల్లో కూడా చెల్లుతుంది
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.