Papavinasanam Dam: పాపవినాశనంలో బోటింగ్ వివాదం…అటవీ శాఖ ప్రకటన

షేర్ చేయండి

తిరుమలలోని పాపవినాశనం డ్యామ్‌లో (Papavinasanam Dam) బోటింగ్ విషయం వివాదంగా మారింది. బోటింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఈ విషయంపై జిల్లా ఫారెస్ట్ అధికారి పీ వివేక్ స్పందించారు. 

తిరుమలలోని (Tirumala) శ్రీ వేంకటేశ్వర జాతీయ పార్కులో ఉన్న పవిత్రమైన పాపవినాశనం డ్యామ్‌లో ఇటీవలే బోటింగ్ విషయం వివాదంగా మారింది. భక్తులు అతి పవిత్రంగా భావించే పాపవినాశనంలో బోటింగ్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఈ విషయంపై జిల్లా ఫారెస్ట్ అధికారి పీ వివేక్ స్పందించారు. 

బోటింగ్ వెనక ఉన్న కారణం | Papavinasanam Dam

Papavinasanam Dam
పాపవినాశనం డ్యామ్‌లో అటవీ శాఖ సిబ్బంది బోటింగ్

పాపవినాశనం డ్యామ్‌లో తనిఖీలు నిర్వహించేందుకే బోటింగ్ చేసినట్టు జిల్లా అటశాఖ అధికారి పీ వివేక్ తెలిపారు. డ్యామ్ పరిసర ప్రాంతంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్టు తమకు సమాచారం అందిందని అందుకే బోట్లపై తనఖీ చేసేందుకు సిబ్బంది వెళ్లారని ఆయన తెలిపారు. స్థానిక పర్యావరణాన్ని కాపాడేందుకు, భద్రత పెంచే దిశలో తనిఖీ నిర్వహించామని అన్నారు.

ఆ వార్తల్లో నిజం లేదు 

పాపవినాశనంలో పర్యాటకం కోసం బోటింగ్ నడిపే దిశలో అటవీ శాఖ ట్రయల్స్ నిర్వహిస్తున్నట్టు వచ్చిన వార్తలపై కూడా పారెస్ట్ డిపార్ట్‌మెంట్ క్లారిటీ ఇచ్చింది. తనిఖీల అనంతరం బోట్లను అక్కడి నుంచి తొలగించినట్టు…పర్యాటకం కోసం బోటింగ్ మొదలుపెట్టే యోచన లేదు అని తెలిపింది.

పాపవినాశనం డ్యామ్ పవిత్రతను, ప్రకృతి సౌందర్యానికి (Tirumala Nature) భంగం కలిగించే పనులు చేసే ఉద్దేశాలు లేవు అని ఈ మేరకు అటవీ శాఖ తెలిపింది. 

భక్తుల స్పందన

Papavinasanam Boating
తనిఖీల కోసమే చేశామని ప్రకటించిన ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్

పాపవినాశనంలో బోటింగ్ జరుగుతోంది అనే వార్త విన్న భక్తులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ వార్తలకు చెక్ పెట్టే విధంగా ఫారెస్ట్ అధికారి పీ వివేక్ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రాంత పవిత్రతను కాపాడి, ఆటవీ ప్రాంతాన్ని పరిరక్షించేందుకు అటవి శాఖ కట్టుబడి ఉంటుంది అనే విధంగా భక్తులకు క్లారిటీ ఇచ్చారు.

మొత్తానికి 

తిరుమలకు నిత్యం లక్షలాది భక్తులు దూరదూరం నుంచి వచ్చి స్వామి వారిని (Lord Venkateshwara) దర్శించకుంటారు. ఇలాంటి తరుణంలో పర్యావరణ పరిరక్షణ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.

జిల్లా ఫారెస్ట్ అధికారులు ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుని అటు భక్తులకు ఆహ్లాదకరమైన అనుభూతిని కల్పించడంతో పాటు పాపవినాశనం డ్యామ్ పవిత్రతను, విశిష్టతను కాపాడుతున్నారు అని ఈ ప్రకటనను బట్టి అర్థం చేసుకోవచ్చు.

📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!