Empowering Naturalists: ఇకో పర్యాటకాన్ని ప్రోత్సహించేలా అమ్రాబాద్ టైగర్‌ రిజర్వ్‌లో నేచర్ గైడ్ ట్రైనింగ్

షేర్ చేయండి

Empowering Naturalists – తెలంగాణ ప్రభుత్వం ఇకో పర్యాటకాన్ని విశేషంగా ప్రోత్సాహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ కార్పోరేషన్ ఇటీవలే నేచర్ గైడ్ ట్రైనింగ్ ఏర్పాటు చేసింది. డెక్కన్ వుడ్స్ అండ్ ట్రెయిల్స్ (Deccan Woods and Trails) అనే పేరుతో శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఇందులో భాగంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో (Amrabad Tiger Reserve) 2025 ఫిబ్రవరి 9 నుంచి 12 వరకు నాలుగు రోజుల పాటు ప్రకృతి ప్రేమికులకు, ఔత్సాహికులకు ప్రత్యేేక ట్రైనింగ్ ఇచ్చారు. ఎకోటూరిజాన్ని (Eco Tourism) ప్రోత్సాహించడంతో పాటు ప్రకృతి ప్రేమికుల్లో వన్యప్రాణి సంరక్షణ గురించి అవగాహన కల్పించడం,తద్వారా అనేక మందికి మార్గదర్శనం చేసేలా వారిని ప్రోత్సాహించడమే ఈ శిక్షణ ప్రధాన ఉద్దేశం.

ఉదయాన్నే జంగిల్ సఫారీ | Jungle Safari In Amrabad Tiger Reserve

Tiger in Amrabad Tiger Reserve
అమ్రాబాద్ పులుల అభయారణ్యం

శిక్షణలో  భాగంగా ఉదయాన్నే అభ్యర్థులకు జంగిల్ సఫారీ నిర్వహించారు. దీంతోవారికి వన్య ప్రాణులను దగ్గరి (Wild Life) నుంచి గమనించే అవకాశం లభించింది. ఈ సఫారీలను అడవిలో వివిధ రకాల జంతుజీవాలను గుర్తించి, వాటి ప్రవర్తనను అర్థం చేసుకునేందుకు వీలుగా డిసైన్ చేశారు.

పర్యావరణ హితమైన హైకింగ్ | Empowering Naturalists

Empowering Naturalists
ఫీల్డ్‌లో ట్రైనింగ్‌ అందుకుంటున్న అభ్యర్థులు

అభ్యర్థులను వివిధ రకాల మొక్కలను గుర్తించేందుకు వీలుగా ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇచ్చారు. పర్యావరణాన్ని సంతులింగా ఉంచడంలో వివధ గడ్డ జాతి మొక్కలు ప్రాధాన్యత ఏంటో తెలిపారు. పర్యావరణానికి హాని కలగకుండా ట్రెక్కింగ్  చేయడం వంటి అంశాలపై ప్రాక్టికల్ శిక్షణ ఇచ్చారు.  సంరక్షణ విధానాలు , వన్యా ప్రాణులు అవాసాల పునరుద్ధరణ విధానాలు, (Wildlife Rehabilitation) పద్ధతుల గురించి తెలియజేశారు.

ఈ ట్రైనింగ్ ప్రాధాన్యత ఏంటంటే ?

Nature Guide Training In Amrabad Tiger Reserve
వన్యప్రాణుల జీవన విధానం, వాటీ శరీర నిర్మణం వంటి ఎన్నో అంశాలపై అవగాహన నిర్వహించారు.

నేచర్ గైడ్ ట్రైనింగ్‌లో ఖమ్మం, మహబూబాబాద్, ములుగు జిల్లాల నుంచి 25 మంది సభ్యులు పాల్గొన్నారు. వీరిని ప్రొఫెషనల్ నేచర్ గైడ్స్‌గా మాత్రమే కాకుండా తెలంగాణలో ఎకోటూరిజాన్ని, వన, వన్యప్రాణి సంరక్షణ కోసం ప్రమోట్ చేసేలే శిక్షణ సాగింది. 

ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు తెలంగాణ అటవీ శాఖ (Telangana Forest Development Corporation) నుంచి నేచర్ గైడ్ సర్టిఫకేషన్ లభిస్తుంది. ఈ సర్టిఫికెట్ ఉంటే  తెలంగాణలోని వివధ ఇకో టూరిజం ప్రాంతాల్లో ప్రొఫెషనల్ నేచురలిస్టులుగా, ఎకోటూర్ గైడ్లుగా (Eco Tour Guide) , కన్జర్వేషన్ అడ్వకేట్స్‌గా విధులు నిర్వర్తించే అవకాశం ఉంటుంది. 

తెలంగాణలో పుష్కలమైన అటవీ సంపద (Telangana Forests) ఉండటం అనేది ప్లస్ పాయింట్. ఇకో టూరిజంలో ( Eco-Tourism) ముందంజలో ఉండాలి అంటే ఈ రంగంలో నిపుణలు, గైడ్స్ అవసరం అవుతుంది. అటు వన్యప్రాణి సంరక్షణ, ఇటు పర్యాటకులకు అవగాహన కల్పించాలి అంటే గైడ్స్‌‌కు విషయాలు తెలిసి ఉండాలి. అందుకని ఈ నేచర్ గైడ్ ట్రైనింగ్ సెషన్ నిర్వహించారని తెలుస్తోంది.

థియరీతో పాటు ఫీల్డ్‌లోనూ ట్రైనింగ్

Nature Guide Training In Amrabad Tiger Reserve
అమ్రాబాద్ అభయారణ్యం ఫారెస్ట్ అధికారలు, సిబ్బంది, పర్యావరణవేత్తలు

ఈ శిక్షణా కార్యక్రమాన్ని తెలంగాణ ఫారెస్ట్ డెవెలెప్మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటీవ్ డైరక్టర్ ఎల్ రంజిత్ నాయక్ ప్రారంభించారు. ఈ శిక్షణా సమయంలో అభ్యర్థులకు క్లాస్‌రూమ్స్‌లో థియరీతో పాటు ఫీల్డ్ ట్రైనింగ్ కూడా అందించారు. తెలంగాణలో జీవవైవిద్యం గురించి, ఎకోటూరిజం గురించి అర్థం అయ్యేలా వివరించారు.

అభ్యర్థులకు పర్యావరణం గురించి అవగాహన కల్పించడంతో పాటు వన్యప్రాణుల (Wild Life) జీవన విధానాన్ని పరిశీలించి పరిశోధించడం, వాటిని ట్రాక్ చేసే పద్ధతులను నేర్పించారు. వీటితో పాటు ఎథికల్ గైడ్‌లైన్స్, అటవీ చట్టాల (Forest Laws) గురించి అవగాహన కల్పించారు. అదే విధంగా మనుషులు వన్య ప్రాణుల మధ్య సంక్షోభానికి (Wildlife Human Conflict) తావు లేకుండా పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం వంటి అంశాలపై అవగాహన నిర్వహించారు.

Nature Guide Training In Amrabad Tiger Reserve
వన పరిపరిరక్షణలో, వన్యప్రాణుల సంరక్షణలో స్థానికులతో కలిసి పనిచేయడం ప్రాధాన్యత గురించి వివరిస్తున్న అధికారి

తెలంగాణలో ఇకో టూరిజం అవకాశాలను మెరుగుపరిచి విస్తరిచడం, పర్యావరణ హిత పర్యాటకాన్ని ప్రోత్సహిచడమే లక్ష్యంగా ఈ శిక్షణను ఏర్పాటు చేసినట్టు డైరక్టర్ ఎల్ రంజిత్ నాయక్ తెలిపారు. నాలుగు రోజులు పాటు సాగిన ఈ శిక్షణా కార్యక్రమం అఖిల్ మైలవరపు, అపరంజని యాదవల్లి, శ్వతా గొర్రపల్లి వంటి అనుభవజ్ఞులైన పర్యావరణ వేత్తల ఆధ్వర్యంలో జరగింది.

📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ట్రెండింగ్ వార్తలు కోసం NakkaToka.com విజిట్ చేయండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!