లక్షలు ఖర్చు చేసి యూరోప్ వెళ్లింది చెత్త చూడ్డానికేనా? | Europe Travel Reality
Europe Travel Reality : యూరోప్ వెళ్లడం చాలా మంది కల. కానీ అక్కడ బతకడం ఒకకళ. ఎందుకంటే యూరోప్ చాలా వేగంగా మారుతోంది. సోషల్ మీడియాలో ఫిల్టర్ చేసిన పోస్ట్కార్డ్లాంటి ఫోటోలు, క్లీన్ స్ట్రీట్స్, రొమాంటిక్ వైబ్స్ ఇవన్నీ చూసి యూరోప్ అంటే నెక్ట్స్ లెవెల్ అని అనుకుంటున్నాం కదా…? కానీ అక్కడి పరిస్థితి ఏంటో ఒక భారతీయ ట్రావెల్ వ్లాగర్ ప్రపంచానికి చూపించాడు.
అతను షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. యూరోప్ వెళ్లాలనే చాలా మంది కలను చెరిపేసేలా ఉందని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియా రియాలిటీ | Europe Travel Reality
ప్రతీక్ సింగ్ అనే ట్రావెలర్ లక్షలు ఖర్చు చేసి యూరోప్ చూశాడు. అయినా ఆన్లైన్లో సందడి చేసే ఫోటోలకూ, తాను చూసిన నిజాలకూ మధ్య చాలా తేడాలు ఉన్నాయని తెలిపాడు. అతను వెళ్లిన కొన్ని నగరాల్లో వీధులు చాలా చెత్తగా ఉన్నాయని అన్నాడు.
పబ్లిక్ ప్లేసుల్లో అధిక రద్దీ, శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం ఇవన్నీ ఉన్నట్టు తెలిపాడు. ఇక ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో లాంగ్ క్యూలు, ట్రాఫిక్, సేఫ్టీ ఇష్యూస్ కూడా ఫేస్ చేశాడట.
నిజానికి సోషల్ మీడియాలో ఎక్కువ ఎంగేజ్మెంట్, లైక్స్, ఫాలోవర్స్ కోసం కెమెరా యాంగిల్స్, ఫిల్టర్స్, టైమింగ్ all ప్లాన్డ్గా సెలెక్ట్ చేస్తారు. రియల్ సిచ్యుయేషన్ని ఎక్కువగా దాచిపెడతారు.
లక్షలు ఖర్చుపెట్టేది చెత్త చూడ్డానికా..?
ఇక్కడ ఇంకో మేజర్ ఇష్యూ Schengen Visa ప్రాసెస్. దీని కోసం బ్యాంక్ స్టేట్మెంట్, కవర్ లెటర్స్, ఐటినెరీ, హోటల్ బుకింగ్స్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్… ఇలా ఎన్నో ఫార్మాలిటీస్ పూర్తి చేయాల్సి ఉంటుంది.
వీసా అపాయింట్మెంట్కే చాలా టైమ్ పడుతుంది. ఈ ప్రాసెస్‌లో ఎక్కడ ఆలస్యం అయినా మొత్తం ప్రయాణ ప్రణాళిక డిస్టర్బ్ అవుతుంది. ట్రావెలర్స్ బాగా స్ట్రెస్‌కి గురయ్యే పరిస్థితి ఉంటుంది.
ఇంతా కష్టపడి యూరోప్ వస్తే, అక్కడి వీధుల్లో కూడా అరటి తొక్కలు, టెట్రా ప్యాక్‌లు, రాత్రి బయటికి వెళ్లాలంటే అక్రమంగా నివసించే ఇమ్మిగ్రెంట్స్ సమస్యలు—ఇవన్నీ జర్మనీ, నెదర్లాండ్స్ వంటి దేశాలు ఎదుర్కొంటున్న వాస్తవాలు.
యూరోప్ వెళ్లడం మానేయాలా? | Is Europe Still Worth Visiting?
యూరోప్ అంటే అక్కడి చరిత్ర, నిర్మాణాలు, శిల్పకళ, మ్యూజియమ్స్, నేచర్, అందమైన ల్యాండ్‌స్కేప్స్—ఇవన్నీ ఏమీ మారలేదు. అవి అలాగే ఉన్నాయి. ఇవి నిజంగా సూపర్.
కానీ ట్రావెల్ రియాలిటీ కూడా ముందే తెలుసుకోవాలి కదా. యూరోప్ అంటే బ్యూటీ మాత్రమే కాదు, కొన్ని చోట్ల డర్టీ రియాలిటీ కూడా ఉందని తెలుసుకుని వెళ్లడం మంచిది.
అలాగే జర్మనీ లాంటి దేశాలకు వెళ్లే ముందు సేఫ్టీ విషయంలో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. వాళ్లు “Travel Insurance ఉందా?” అని అడిగితే, మన దేశంలో అసలు సేఫ్టీ ఉందా? అని తిరిగి అడగాలనిపించే రోజులు వచ్చాయని వ్లాగర్ అభిప్రాయం.
యూరోప్, అమెరికా లాంటి పశ్చిమ నాగరికత కంటే South Korea, Japan వంటి తూర్పు ఆసియా దేశాలు ట్రావెల్‌కు మెరుగ్గా ఉంటాయని కూడా అతను చెప్పాడు.
- ఇది కూడా చదవండి : ఏంటి జపాన్ మరీ ఇంత క్లీన్‌గా ఉంటుందా?
కాబట్టి నెక్ట్స్ టైమ్ Europe Trip ప్లాన్ చేస్తే, సోషల్ మీడియా ఫోటోలు చూసి మాత్రమే కాకుండా, అక్కడి గ్రౌండ్ రియాలిటీ, అక్రమ వలసల సమస్యల గురించి కూడా తెలుసుకుని వెళ్లండి. ప్రయాణాలు అందమైన అనుభూతినివ్వాలి. దానికి రియాలిటీ కూడా తోడవ్వాలి.
ప్రయాణికుడు టేక్ | Prayanikudu Take
చెప్పాలో లేదో తెలియదు కానీ… కొంతమంది పాశ్చాత్య ట్రావెల్ కంటెంట్ క్రియేటర్లు మన దేశం వస్తే స్లమ్స్, గుడిసెలు, బిక్షగాళ్లను ఫోటోలు తీసి, ఇదే భారత్ అన్నట్టుగా ప్రమోట్ చేస్తారు. అలా మిలియన్ల కొద్దీ వ్యూస్ సంపాదిస్తారు.
ఇప్పుడు యూరోప్ పరిస్థితి కూడా కొంతవరకు అలాగే మారింది.
సో, సోషల్ మీడియా ఇంఫ్లుయెన్సర్లు… ముఖ్యంగా యూరోప్ వెళ్లే Telugu Travelers, Telugu Travel Vloggers రియాలిటీని (Europe Travel Reality) చూపండి. ఏదీ దాచకండి.
అందంగా ఉంటే అందాలు చూపండి. చెత్త ఉంటే చెత్తగా ఉంది అని చెప్పండి. లైకులు, షేర్లను దాటేసి మీ ప్రొఫెషన్ బేసిక్స్ ఏంటో తెలుసుకోవాలని మనవి. ఎందుకంటే మీ వీడియోలు చూసి వెళ్లి అక్కడ పరిస్థితి పూర్తిగా వేరేలా ఉంటే… అది ఎవరికీ బాగుండదు.
“మీరు ఎక్కడికైనా వెళ్లే ముందు గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ‘Prayanikudu’ అని చివర యాడ్ చేయండి. ఉదాహరణకు : Warangal Prayanikudu ఇలా వెతకండి… తప్పుడు సమాచారంతో ఇబ్బంది పడకుండా ప్రయాణించండి (Travel Without Mistake).”
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు చిట్ చాట్
