Flavors of Prayagraj : ప్రయాగ్‌రాజ్‌ వెళ్తే తప్పకుండా వెళ్లాల్సిన 4 ఫుడ్ స్టాల్స్ ఇవే

షేర్ చేయండి

Flavors of Prayagraj : మహా కుంభ మేళా సమయంలో లేదా సాధారణ సమయంలో ప్రయాగ్‌రాజ్ వెళ్తే మీరు తప్పకుండా ఇక్కడి పాపులర్ ఫుడ్ వెరైటీలనుట్రై చేయండి. మీ కోసం ప్రయాగ్‌రాజ్‌లో 4 ఐకానిక్ ఫుడ్ స్టాల్స్ సెలక్ట్ చేసి తీసుకొచ్చాం. 

ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో 2025 జనవరి 13న ప్రారంభమైన మహాకుంభ మేళా ( Maha Kumbh Mela 2025 )  వైభవంగా సాగుతోంది. ఇప్పటి వరకు కోట్లాది మంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేశారు. 45 రోజుల పాటు జరిగే ఈ ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్మాత్మిక మేళాకు రోజుకు కోటి మంది చొప్పున మొత్తం 45 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. 

Food In Prayagraj : 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభ మేళాను సందర్శించాలనే వారిలో మీరు కూడా ఉంటే మీ కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మీరు ప్రశాంతంగా పవిత్ర స్నానాలు చేయడానికి ప్రయాగ్‌రాజ్ వెళ్లవచ్చు. అయితే అక్కడికి వెళ్తే మాత్రం మీరు తప్పకుండా అక్కడి పాపులర్ ఫుడ్ ఖచ్చితంగా ట్రై చేయండి. మీ కోసం ప్రయాగ్‌రాజ్‌లో 4 ఐకానిక్ ఫుడ్ స్టాల్స్ సెలక్ట్ చేసి తీసుకొచ్చాం. 

ప్రయాగ్‌రాజ్‌లో ట్రై చేయాల్సిన ఫుడ్ | Must-Try Foods in Prayagraj

ప్రయాగ్‌రాజ్ నగరం ఎంత విశిష్టమైనదో అక్కడి తినుభండారాలు కూడా అంతే రుచికరమైనవి. ఇక్కడి వీధుల్లో నడుచుకుంటూ వెళ్తుంటే మీకు ఎన్నో రకాల ఫుడ్ ఐటమ్స్ ( Flavors of Prayagraj ) కనిపిస్తాయి. ఇలా ఎన్నో ఫుడ్ స్టాల్స్‌ ఉన్నా అందులో ఈ 4  ప్రదేశాలు మాత్రం చాలా పాపులర్…వీలైతే ఒకసారి వెళ్లి ట్రై చేయండి.

1  పండిత్ జీ కి ఛాట్ భండార్ | Pandit Ji Chaat Bhandar
dahi Wada in prayagraj
| ప్రతీకాత్మక చిత్రం
  • ఛాట్ అంటే ఇష్టపడేవారికి పండిత్ జీ ఛాట్ భండార్ బాగా నచ్చుతుంది. ఈ ఛాట్ షాప్ వచ్చేసి కల్నల్ గంజ్‌లో ఉంటుంది. చాలా మంది ఫుడ్ లవర్స్ ఇక్కడికి వచ్చి ఫేమస్ దహి వడా ( Dahi Vada ) టేస్ట్ చూసి వెళ్తుంటారు. దీంతో పాటు ఇక్కడ ఆలూ టిక్కి , పానీ పూరి, టమాటో ఛాట్ కూడా బాగుంటాయి. దీంతో పాటు మీరు గులాబ్ జామున్ ట్రై చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఛాట్ తిన్నాక గులాబ్ జామున్‌ తింటే ఆ కిక్కే వేరప్పా.
2. హీరా హల్వాయి | Heera Halwai Prayagraj
Food in Prayagraj (3)
| ప్రతీకాత్మక చిత్రం
  • ఉత్తర భారత దేశంలో జిలేబీ అనేది ఒక బ్రహ్మ పదార్థం లాంటిది. దీనిని పాలతో, పోహాతో ఇలా దేనితో పడితే దానితో కలిపి తినేస్తారు. హీరా హల్వాయి షాప్ అతను ఒక అడుగు ముందుకు వేసి పెరుగుతో జిలేబీ సర్వ్ చేస్తాడు. సివిల్‌లైన్స్‌ దగ్గర్లోని వివేక్ విహార్ కాలనీలో ఉండే హీరా హల్వాయిలో తప్పకుండా దహి జిలేబీ ట్రై చేయండి.ఎందుకంటే వింటర్‌లోనే ఈ కాంబినేషన్ బాగుంటుందంట.
3. సైనిక్ షాప్ : Sainik Shop Prayagraj
Samosa In Prayagraj
| ప్రతీకాత్మక చిత్రం
  • సమోసాలు చాలా రకాలు . ఉల్లిసమోసా, ఆలూ సమోసా, చికెన్, ఎగ్, స్వీట్‌కార్న్ ఇలా ఎన్నో వైరటీ సమోసాలు ( Types Of Samosa )  మార్కెట్లో లభిస్తాయి. ప్రయాగ్‌రాజ‌్‌లోని సైనిక్ షాప్‌లో మీరు ఛోలే సమోసా ట్రై చేయవచ్చు. ఛోలే అంటే అది తెల్లగా, పెద్దసైజులో ఉండే శనగల్లా ఉంటాయి. ఈ చలికాలం తప్పకుండా ట్రై చేయాల్సిన డిష్ ఇది.
4. నేత్రామ్స్ కచోరీ | Netram’s Kachori
Chole Kachori in Prayagraj
| ఛోలే కచోరీ
  • ప్రయాగ్‌రాజ్‌‌లో అత్యంత పురాతన ఫుడ్ ( Food ) స్టాల్‌లో ఇది కూడా ఒకటి. 168 సంవత్సరాల నుంచి కత్రా రోడ్‌లో ఫుడ్ లవర్స్‌ నాలుక లపలపలాడిస్తోంది నేతామ్స్ కచోరి. కూరగాయలు, మసాలా వేసి తయారు చేసే ఫిల్లింగ్, కరకరలాడే పై భాగంతో ఈ కచోరీ అదరగొడుతుంది. కచోరీని మీరు ఆలూ కర్రీ, రైతా లేదా చట్నీతో ఆరగించవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి.
  • పవిత్ర నగరమైన ప్రయాగ్‌రాజ్‌కు ( Prayagraj ) మీరు కుంభమేళా సమయంలో వెళ్లినా లేక సాధారణ సమయంలో వెళ్లినా ఈ ఫుడ్ స్టాల్స్ అందుబాటులో ఉంటాయి. ఒకవేళ మీకు ప్లాన్ చేసుకుని వెళ్లే అవకాశం ఉంటే అందులో టేస్టీ ఫుడ్‌ ఎంజాయ్ చేయడానికి కూడా టైమ్ కేటాయించండి. పొట్ట సంతోషంగా ఉంటేనే కదా బుర్ర ప్రశాంతంగా ఉంటుంది..ఏమంటారు ?

Web Story: ఈ వెబ్‌స్టోరీ చూడటానికి ఫోటోపై క్లిక్ చేయండి

రుచి కన్నా ఆరోగ్యం ముఖ్యం :  Health Tips In Prayagraj
  •  పైన వివరించిన స్టాల్స్‌లో సాయంత్రం, ఉదయం సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. రద్దీ లేని సమయంలో వెళ్లేందుకు ప్రయత్నించండి.
  • ఆహార పదార్థాలు తయారు చేసేందుకు వినియోగించే పదార్థాలు, వాటిని తయారు చేసే విధానాన్ని అక్కడి వెళ్లి గమనించండి. శుభ్రంగా అనిపిస్తేనే తినండి. ఫేమస్ కదా అని ఆరోగ్యాలు పణంగా పెట్టలేము కదా.
  • ఈ పదార్థాల్లో మసాలా పదార్థాల వినియోగం ( Flavors of Prayagraj ) అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. సో అది కూడా గమనించగలరు. 
  • వీలైనంత వరకు పరిశుభ్రంగా ఉండే ప్రదేశాల్లో, హోటల్స్‌లో తినడానికి ప్రయత్నించండి. 
ఈ  Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
Prayanikudu WhatsApp2
| ప్రయాణికుడు వాట్సాప్ గ్రూపులో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!