Hampi : భారత చరిత్రలో విలక్షణమైన నేల హంపి
Hampi : హంపి అంటే చాలా మంది “శిథిలాల నగరం” లేదా Hampi Ruins అని పిలుస్తుంటారు. గూగుల్‌లో వెతికినా కూడా Ancient Ruins (పురాతన శిథిలాలు) అనేలా కనిపిస్తుంది. కానీ హంపీలో అడుగుపెట్టగానే మైండ్‌లో వచ్చే ఫస్ట్ థాట్ — ఇవి శిథిలాలు కాదు. ఇవి ఒక పురాతన నగరానికి మిగిలిన జ్ఞాపకాలు.
హిస్టరీ క్లాస్‌లలో వినేటప్పుడు బోర్ కొట్టిన విషయాలన్నీ, ఇక్కడి శిథిలాలు నోరు తెరుచుకోకుండా తమ కథను చెప్పుతున్నట్టుగా అనిపిస్తాయి.
అన్నింటికన్నా ముందు హంపీలో రాళ్లు ఎక్కువ, ట్రాఫిక్ తక్కువ. సిటీ లైఫ్ నుంచి వచ్చిన చాలామందికి ఈ మార్పు ఒక కల్చరల్ షాక్‌లా ఉంటుంది. భారీ భవనాలు లేవు, మాల్స్ లేవు. కానీ విస్తారమైన స్థలం, అంతులేని నిశ్శబ్దం మాత్రం ఉంటుంది.
- ఇది కూడా చదవండి : Arunachalam: అరుణాచల పర్వతంపైకి వెళ్లొచ్చా? గిరి ప్రదక్షిణ ఏ సమయంలో చేయాలి? పూర్తి గైడ్
ఆ సైలెన్స్‌లో కూడా శ్రద్ధగా వింటే, ప్రతీ రాయి తన కథను చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఆ కథ అర్థం కావాలంటే, ఇక్కడి చరిత్ర గురించి కొంతైనా తెలుసుకోవాలి. తుంగభద్రా తీరంలో ఉన్న ఈ ప్రదేశంలో రాళ్లు చరిత్రకు మౌన సాక్షులుగా నిలుస్తాయి.
జీవం లేని ప్రదేశం కాదు
రాళ్లకు జీవం ఉండదు. కానీ హంపీ జీవం లేని ప్రదేశం మాత్రం కాదు. ఇక్కడి రాళ్లు, ఆలయాలు, నది శబ్దం ఇవన్నీ మనల్ని పర్యాటకులుగా కాదు, ఒక చరిత్రకారుడిలా ట్రీట్ చేస్తాయి. ఎందుకంటే ఇక్కడ అడుగుపెట్టిన క్షణం నుంచే మనం గతంలోకి వెళ్లిపోతాం.
కాలం అందమేంటో చెప్పే రంగులు
సూర్యాస్తమయం సమయంలో హంపీ రంగులు ఒక అందమైన కవిత్వంలా కనిపిస్తాయి. రాళ్లపై పడే బంగారు కాంతి, ఒక్కో క్షణంలో ఒక్కో షేడ్‌గా మారుతూ మనసును కట్టిపడేస్తుంది.
చరిత్రను మనం పుస్తకాలలో చదవడం అలవాటు చేసుకున్నాం. కానీ పుస్తకాలను దాటి చరిత్రను అర్థం చేసుకునే అవకాశం హంపీ లాంటి ప్రదేశాల్లోనే దొరుకుతుంది.
శిథిలమైన గోడలు చెప్పే మాటలను వినడానికి చెవులు రిక్కించాల్సిన అవసరం లేదు. మనసును తెరిస్తే చాలు. ఎందుకంటే చరిత్ర తన కథను చెప్పడానికి శిథిలాలనే కథానాయకులుగా ఎంచుకుంటుంది.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
▶️ వీడియో చూడండి : 3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు – ప్రత్యేక వీడియో
