ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గురుద్వారా మన దేశంలో గ్రేటర్ హిమాలయన్ ప్రాంతంలో ఉంది. హేంకుండ్ సాహిబ్ గురుద్వారా ( Hemkund Sahib Yatra ) అనే సిక్కు మతస్థుల అత్యంత పవిత్ర క్షేత్రానికి నేను కూడా వెళ్లాను. దీని కోసం నేను కొన్ని నెలల ముందు నుంచి ప్లాన్ చేశాను.
- ఇది కూడా చదవండి : Palani Temple : పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం గైడ్ ! 10 Facts
ఎందుకంటే ఇక్కడికి వెళ్లేందుకు భక్తులకు, పర్యాటకులకు కేవలం మూడు నెలల సమయం మాత్రమే అవకాశం ఉంటుంది. జూన్ నెల నుంచి అక్టోబర్ వరకు వెళ్లే అవకాశం ఉన్నా కానీ జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లోనే చాలా మంది ఇక్కడికి వెళ్తుంటారు. అక్టోబర్ రెండవ వారం నుంచి మే వరకు ఈ ప్రాంతం మొత్తం మంచుతో నిండిపోతుంది.
ఎక్కడ ఉంది ? | Sri Gurudwara Hemkund Sahib, Chamoli
Where Is Hemkund Sahib Gurudwara : హేంకుండ్ సాహిబ్ అనేది ఉత్తరాఖండ్‌లోని ఛమోలి జిల్లాలో ఉంది. ఇక్కడికి వెళ్లడానికి మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు రిషికేష్, హరిద్వార్ ( Haridwar ) నుంచి ఇక్కడికి చేరుకోవచ్చు. ఇవన్నీ మీరు సులువగా చేయగలగినవే. కానీ అత్యంత కఠినమైనది మాత్రం బేస్ క్యాంప్ అయిన ఘాంఘరియా ( Ghangharia ) అనే ప్రాంతం నుంచి హేంకుండ్ సాహిబ్ గురుద్వారకు ట్రెక్కింగ్ చేయడమే.
కొంచెం కష్టం..కొంచెం ఇష్టం | Hemkund Sahib Yatra Trek Difficulty Level
ఈ ట్రెక్ సాహసవంతమైనది అని చెప్పను. ఎందుకంటే దారి బాగుంటుంటుంది. మీరు గుర్రాలు, కంచెర గాడిదలు, పల్లకి, హెలికాప్టర్ వాడి ఇక్కడికి వెళ్లవచ్చు. అయితే నడకమార్గంలో చేరడమే చాలా కష్టం. ఎందుకంటే ఎలివేషన్ అలా ఉంటుంది. ఈ ప్రయాణం సులభం కాదు. కఠినం కూడా కాదు. మీలో భక్తి ఉంటే సరిపోదు శారీరక శక్తి ఉండాలి అని చాటి చెప్పే ట్రెక్ ఇది. నేను ఈ ట్రెక్‌ను నడిచే పూర్తి చేద్దాం అనుకున్నాను. కానీ మధ్యలోనే గుర్రం ఎక్కి ట్రెక్ పూర్తి చేశాను.
ఈ ప్రయాణం ఎలా సాగిందో మీరు ఈ వీడియోలో కూడా చూడవచ్చు. నేను ప్రయాణికుడు ( Prayanikudu ) అనే పేరుతో Travel Vlogs కూడా చేస్తుంటాను. అందులో పోస్ట్ చేసిన వీడియో ఇదే.
ఈ మధ్యే TRAVEL WEB STORIES చేయడం స్టార్ట్ చేశాను. మీకు నచ్చుతాయి అని ఆశిస్తున్నాను. ఒకసారి చూడండి.