మండుటెండల్లో మిస్ అవ్వకూడని 5 Himalayan Summer Treks
5 Himalayan Summer Treks : జూన్ నుండి అక్టోబర్ వరకు హిమాలయ పర్వతాల మధ్య నడిచే ఈ ట్రెక్స్, ప్రతి ట్రావెలర్స్‌కి ఒక సైలెంట్ అనుభవంగా మిగిలిపోతుంది. ప్రకృతి, మేఘాలు, మంచు కలిసిన ఈ ప్రయాణంలో సమయం స్లోగా నడుస్తుంది.
సమ్మర్లో ఇండియాలో కొన్ని ప్రదేశాలు మనసును పిలుస్తాయి. హిమాలయాల్లో ఉన్న ట్రెక్కింగ్ రూట్స్‌లో నడుస్తూ ఉంటే, మనం ఒక కొత్త లోకంలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఆకాశం దగ్గరగా ఉంటుంది. భూమిపై ఫ్రెష్‌గా కనిపిస్తుంది. మనసు కామ్‌గా మారుతుంది. ఈ సీజన్లో ప్రతి ట్రెయిల్ ఒక ఓపెన్ స్టోరీలా ఉంటుంది.
1. కశ్మీర్ గ్రేట్ లేక్స్ | Kashmir Great Lakes

కశ్మీర్ గ్రేట్ లేక్స్ ట్రెక్‌లో ప్రతి రోజు ఒక లేక్ దగ్గర ముగుస్తుంది. విషంసార్ (Vishansar), క్రిషంసార్ (Krishansar) లాంటి లేక్స్‌లో స్కై రిఫ్లెక్షన్ చూస్తే కలల మధ్య నడుస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. గ్రీన్ మీడోస్ మధ్య నడుస్తూ, పక్కనే నడిచే చిన్న స్ట్రీమ్స్తో ఈ ట్రెయిల్ ఒక జెంటిల్ రిథమ్‌లో సాగుతుంది.
This is Seeshnag Lake, also known as the frozen lake of Kashmir, is in Pahalgam. pic.twitter.com/1kddHbi2i5
— Go Jammu and Kashmir (@GoJammukashmir) February 10, 2025
- ఇది కూడా చదవండి : జమ్మూ అండ్ కశ్మీర్‌కు ఆ పేర్లు ఎలా వచ్చాయి ? భారత దేశ సంస్కృతిలో ప్రాధాన్యత ఏంటి ? | Jammu and Kashmir
2.హాంప్టా పాస్ | Hampta Pass | Himachal Pradesh
రెండు లోకాల మధ్య ప్రయాణం

హాంప్టా పాస్ ట్రెక్‌లో (Hampta Pass Trek) వ్యాలీ నుంచి వ్యాలీకి మారుతూ ఒక అద్భుతమైన అనుభూతిని సొంతం చేసుకోవచ్చు. ట్రెక్కింగ్ సమయంలో కనిపించే సీనరీస్ జీవితాంతం గుర్తుండేలా ఉంటాయి. కుల్లు వ్యాలీలో గ్రీనరీ, స్పితీ (spiti Valley) సైడ్‌లో గోదుమ రంగులో కనిపించే ముడుత పర్వతాలు…ఈ కాంట్రాస్ట్ చాలా అందంగా కనిపిస్తుంది. ప్రతి అడుగులో భూమి రంగులు మారడం ఈ ట్రెక్ స్పెషాలిటీ.
A waterfall of clouds at Hampta Pass, Himachal Pradesh
— Science girl (@sciencegirl) November 7, 2025
pic.twitter.com/9SzyEfZ8oc
- ఇది కూడా చదవండి : మనాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఎక్కడ ఉండాలి, ఏం చూడాలి | Top 10 Tips To Visit Manali
3.గోచలా | Goechala | కాంచన్ జంగా దర్శనం | Sikkim
గోచలా ట్రెక్‌లో ఎర్లీ మార్నింగ్‌లో సన్‌రైజ్ చూస్తే కాంచన్ జంగా (Kanchenjunga) పర్వతాలపై పడే వెలుగు మనసులో నిలిచిపోతుంది. దట్టమైన అడవులు, జలపాతాలు, దూరదూరం వరకు పరచుకుని ఉన్న గడ్డిమైదానాలు…ఈ ట్రెయిల్లో ప్రకృతి ప్రతి రోజు ఒక కొత్త రూపంలో కనిపిస్తుంది.
5. On Goechala trek – Dzongri campsite – one of the first photos I took of night sky against those gigantic mountains. pic.twitter.com/msV22NJFPr
— neha chandok (@NChandok) March 9, 2026
4.తార్సర్ మార్సర్ | Tarsar Marsar Lake | Jammu and Kashmir
నీటి మధ్య ప్రశాంతత

తార్సర్ మార్సర్ లేక్స్ దగ్గర క్యాంప్ చేసిన రాత్రుల్లో, ఆకాశంలోని నక్షత్రాల రిఫ్లెక్షన్ వాటర్‌లో కనిపిస్తుంది. చుట్టూ సైలెన్స్ మధ్యలో నీరు..ఈ ప్రదేశంలో సమయం మెల్లిగా నడుస్తుంది. గ్రీన్ వ్యాలీలో నడుస్తూ ఈ లేక్స్ చేరడం ఒక స్మూత్ జర్నీలా ఉంటుంది.
Morning View Of Tarsar Lake
— All About Kashmir (@wakashmir) August 19, 2021
The blue. The green. The mirror.
Video Credit #fardeenghazi_ pic.twitter.com/DssEqYc6eN
- ఇది కూడా చదవండి : Gulmarg: భారత్‌లో వెలిసిన మంచు స్వర్గం గుల్మార్గ్ పూర్తి ట్రావెల్ గైడ్ | Gulmarg Complete Travel Guide
5. పిన్ పార్వతీ పాస్ | Pin Parvati Pass | Himachal Pradesh
వైల్డ్ హిమాలయ అనుభవం
పిన్ పార్వతీ పాస్ ట్రెక్‌లో గ్రీనరీ నుంచి డ్రై ల్యాండ్‌స్కేప్ వరకు ఒక లాంగ్ జర్నీలా ఉంటుంది. పార్వతీ వ్యాలీలో అడవులు, పిన్ వ్యాలీలో రగ్గడ్ టెర్రెయిన్ ఈ ఛేంజ్ హిమాలయాల ఒక కొత్త రూపాన్ని చూపిస్తుంది. ఈ ట్రెయిల్లో నడుస్తూ ఉంటే ప్రకృతి ఎంత గొప్పదో అర్థం అవుతుంది.
నడిచే ప్రయాణం…అనుభవాల సంగమం
ఈ ట్రెక్స్ అన్నీ కలిసి ఒక కామన్ ఫీలింగ్ ఇస్తాయి. నడుస్తూ ఉంటే మనసు క్లియర్ అవుతుంది. నాయిస్ లేని ప్రదేశాల్లో ప్రతి శబ్దం క్లియర్‌గా వినిపిస్తుంది. గాలి, నీరు, అడుగుల శబ్దం ఇవన్నీ కలిసి ఒక నేచురల్ మ్యూజిక్‌లా ఉంటాయి.
ఎలా వెళ్లాలి ? | How To Travel
హైదరాబాద్ నుండి ఢిల్లీ వరకు ఫ్లైట్ లేదా ట్రెయిన్లో వెళ్లడం ఈజీ. అక్కడి నుంచి కశ్మీర్ ట్రెక్ కోసం శ్రీనగర్, హాంప్టా పాస్ కోసం మనాలి (Manali), గోచలా కోసం గ్యాంగ్‌టక్ లేదా యుక్సోమ్ (Gangtok / Yuksom) లేదా కుల్లు, మనాలి సైడ్ నుండి పిన్ పార్వతీ ప్రయాణం స్టార్ట్ అవుతుంది. రోడ్ జర్నీలు అనేవి పర్వతాల మధ్య సాగుతాయి. ట్రెక్కింగ్ మూడ్‌కి ముందు ఒక బ్యూటిఫుల్ బిగినింగ్‌లా ఉంటుంది.
Hampta Pass is so beautiful!
— TheAstuteReader (@TheAstuteReader) May 19, 2024
Hope to do it again, this time as soon as it opens after the winters! pic.twitter.com/rCrPopUHTo
ఎక్కడ ఉండాలి ? | Accommodation
ఈ ట్రెక్కింగ్ రూట్లో క్యాంప్స్ ఉంటాయి. టెంట్స్‌లో స్టే చేస్తూ, చుట్టూ పర్వతాలు, పైన ఆకాశం ఈ స్టే ఎక్స్‌పీరియెన్స్ చాలా నేచురల్‌గా ఉంటుంది. కొన్ని బేస్ విలేజెస్లో చిన్న హోమ్‌స్టే చేస్తే స్థానికుల జీవితాలు దగ్గరగా చూడవచ్చు.
- ఇది కూడా చదవండి : Key Monastery Spiti: ఓవర్ టూరిజం కాకముందే చూసేయండి… స్పితీ వ్యాలీ!
ఏం చూడాలి ? | Activities
సన్‌రైజ్ సమయంలో పీక్స్‌పై పడే వెలుగు, లేక్స్‌లో రిఫ్లెక్షన్, వ్యాలీస్‌లో ఫాగ్ మూమెంట్ ఇవన్నీ ఈ ట్రెక్స్‌లో మెయిన్ దృశ్యాలు ఉంటాయి. రాత్రి స్కైలో స్టార్స్ చాలా క్లియర్‌గా కనిపిస్తాయి.
ఏం తినాలి ? | What To Eat
సింపుల్‌గా తయారైన హాట్ ఫుడ్ ట్రెక్కింగ్‌లో స్పెషల్‌గా అనిపిస్తుంది. చాయ్, పప్పు అన్నం, రోటీ ఈ ఐటమ్స్ పర్వతాల మధ్య చాలా ఎంజాయ్ చేయడం సంతృప్తిని ఇస్తుంది. లోకల్‌గా తయారైన ఫుడ్‌లో స్థానిక రుచుల ఫ్లేవర్ ఉంటుంది.
చేయాల్సిన పనులు | Activities in 5 Himalayan Summer Treks
- సన్‌రైజ్‌ను సైలెంట్‌గా చూడండి
- క్యాంప్ ఫైర్ దగ్గర రాత్రి టైమ్ ఎంజాయ్ చేయండి
- నేచర్ సౌండ్‌ని వినండి
- లేక్స్ దగ్గర కామ్‌గా కూర్చుని దృశ్యాన్ని అబ్జర్వ్ చేయండి
- ప్రతి అడుగును స్లోగా ఫీల్ అవ్వండి.
జూన్ నుంచి అక్టోబర్ వరకు ఈ హిమాలయన్ ట్రెక్స్ మనిషిని ప్రకృతికి దగ్గర చేస్తాయి. ఈ నడిచే యాత్రలో మనం చేసేది పర్వతారోహణ మాత్రమే కాదు, మనలో ఉన్న శాంతిని కూడా కనుగొనడం. ప్రతి ట్రెయిల్ ఒక కథ, ప్రతి జర్నీ ఒక మెమరీలా నిలుస్తుంది.
- ఈ కథనం సాక్షి దినపత్రిక ఈ-పేపర్ లో కూడా ప్రచురితమైంది. కంటెంట్ రచయిత: ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు పాఠకుల కోసం పునఃప్రచురణ చేశారు.
- ఈపేపర్ స్క్రీన్ షాట్ చూడండి.

📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.






