కుంభమేళా వెళ్లడం అనేది ప్రతీ హిందువు కల. అయితే కోట్లాది మందితో పోటీపడి అక్కడికి చేరుకోవడం అనేది రవాణా పరంగానే కాదు ఆర్థికంగా కూడా ఛాలెంజ్ లాంటిదే. ఈ రెండు సవాళ్లను హిచ్‌హైకింగ్‌తో (Hitchhiking to the Maha Kumbh ) ఎదుర్కొని పూర్తి చేశాడు ఒక కంటెంట్ క్రియేటర్.
ముఖ్యాంశాలు
భారత జనాభాలో సగం మంది…|
మహా కుంభమేళా వెళ్లడం అనేది కోట్లాది మంది హిందువుల కల. దాదాపు దేశంలో సగం జనాభా మహా కుంభమేళాలో (Maha Kumbh Mela 2025) పవిత్ర స్నానాలు ఆచరించారు. దీని కోసం వారు ఖర్చు కోసం, ప్రయాణ కష్టాలు, సాధకబాధకాల గురించి ఆలోచించలేదు. చాలా మంది రైళ్లు,ఫ్లైట్స్ లేదా సొంత వాహనంలో కుంభమేళా వెళ్లారు.
దీని కోసం డబ్బు బాగా ఖర్చు పెట్లాల్సి ఉంటుంది. కానీ ఒక్క పైసా డబ్బు ఖర్చు చేయకుండా ఇద్దరు కంటెంట్ క్రియేటర్లు కుంభ మేళా వెళ్లారు. దీనినే హిచ్ హైకింగ్ (Hitchhiking) అంటారు.
రెండు రోజులు..పైసా ఖర్చు లేకుండా | Divya Fofanii Hitchhiking
దివ్య ఫోఫానీ అనే కంటెంట్ క్రియేటర్ ముంబై నుంచి మహా కుంభమేళా జరిగే ప్రాంతానికి వెళ్లడానికి వినూత్నమైన మార్గాన్ని ఎంచుకున్నాడు.ఈ ప్రయాణంలో ఒక్కపైసా కూడా ఖర్చు చేయలేదు ఈ యంగ్ క్రియేటర్ (Content Creator). దారిన వెళ్లే వాహనదారులు చేసే సాయంపైనే ఆధారపడి తన ప్రయాణాన్ని పూర్తి చేశాడు.
2025 ఫిబ్రవరి 12వ తేదీ ప్రారంభమైన ఫోఫాని ప్రయాణం రెండు రోజుల్లోనే పూర్తయింది. కుంభమేళా వెళ్లాలి భారతీయుల సంకల్పానికి ప్రతిరూపంగా నిలిచింది అతని ప్రయాణం.
ప్రయాణం ఎలా మొదలైంది ? | Hitchhiking to the Maha Kumbh
ఫోఫానీ ప్రయాణం మహారాష్ట్రలోని థానే (Thane) నుంచి మొదలైంది. అక్కడి నుంచే లిప్టు కోసం కార్డు పట్టుకుని నిల్చున్నాడు. ఇలా మొదలైన ప్రయాణంలో భాగంగా అతను బైకులు, కార్లు, స్కూటీలు, ట్రక్కులు ఎక్కి రెండు రోజుల్లోనే 1,500 కి.మీ కవర్ చేశాడు.ఈ రెండు రోజుల ప్రయాణం అనేది ఒక అద్భుతం అని చెబుతున్నాడు దివ్యా ఫోఫాని.
సవాళ్ల సవారి
థానే నుంచి నాగ్‌పూర్ వరకు అతని ప్రయాణం సాఫీగానే సాగింది. కానీ జబల్పూర్ నుంచి ప్రయాగ్‌రాజ్ (Prayagraj) వెళ్లడమే చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది అన్నాడు ఫోఫాని. ఎందుకంటే ఈ దారిలో ట్రక్కులకు అనుమతి లేదు. అయితే స్థానికుల సాయంతో అతను అన్ని కష్టాలను జయించాడు.
జనవరి 13 ప్రారంభమైన మహా కుంభ మేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. 45 రోజుల మహా కుంభ మేళాలో ఇలాంటి ఎన్నో అద్భుతమైన కథలు ప్రపంచం ముందుకు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం సుమారు 60 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు.
హిచ్ హైకింగ్ అంటే ఏంటి ? | What is Hitchhiking ?
సింపుల‌్‌గా చెప్పాలి అంటే లిఫ్టులు అడుగుతూ పైసా ఖర్చు చేయడకుండా వెళ్లడమే హిచ్ హైకింగ్. తాము వెళ్లేదారిలో వెళ్తున్న వారిని సైగలతో, సైన్ బోర్డులతో గమనించేలా చేసి వారి బండి, వారి పెట్రోలుకు డబ్బులు చెల్లించకుండా వారి మంచితనంతో చేసే సాయాన్ని అందుకోవడం.
సాధారణంగా డబ్బు లేకుండా ఉన్న సమయంలో ఇలా లిఫ్టులు అడగటం సాధారణం. అయితే ఈ మధ్య కంటెంట్ క్రియేషన్ కోసం ఇదో ఐడియాగా మారింది. డబ్బు ఉన్నా కానీ ఇలా చేసి వ్యూవర్‌షిప్ సంపాదిస్తున్నారు. ఇది డబ్బును ఆదాయ చేస్తుంది అనడంలో సందేహం లేదు. తెలియని వ్యక్తి బండి ఎక్కి వెళ్లడం అనేది కొన్ని సార్లు ఇబ్బందులకు కూడా గురి చేయవచ్చు. కానీ ఇది ఒక సాహసయాత్రగా (Adventure Travel) తీసుకుని చాలా మంది హిచ్‌హైకింగ్ చేస్తున్నారు.
📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.