ఇంటి నుంచి ఫోన్ లేకుండా ఎలా వెళ్లమో అంతర్జాతీయ ట్రిప్‌లో కూడా మందుల విషయంలో (Medicines for an International Trip) సరైన ప్లానింగ్ లేకుండా వెళ్లకూడదు. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని మీకు తెలిసే ఉంటుంది. విదేశీ ప్రయాణంలో ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ విషయంలో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
నాతోటి ప్రయాణికులకు నమస్కారం! మీరు ఏదైనా విదేశీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా ? అయితే ఈ స్టోరీ మీకు బాగా యూజ్ అవుతుంది. నా గెస్ కరెక్ట్ అయితే మీ ప్రయాణం అద్బుతంగా ఉండేలా మీరు ప్లాన్ చేస్తుంటారు. బట్టలు, కేమెరా, వీసా పాస్‌పోర్టు, బ్యాగులు, పవర్ బ్యాంకులు అన్నీ రెడీ చేసుంటారు. ఈ పనుల్లో పడి అసలైన విషయం మర్చిపోకండి. అవే మీరు తీసుకెళ్లాల్సిన మందులు.
ఇంటి నుంచి ఫోన్ లేకుండా ఎలా వెళ్లమో అంతర్జాతీయ ట్రిప్‌లో కూడా మందుల విషయంలో సరైన ప్లానింగ్ లేకుండా వెళ్లకూడదు. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని మీకు తెలిసే ఉంటుంది.
విదేశీ ప్రయాణంలో ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ విషయంలో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.ఇంకెందుకు ఆలస్యం విదేశీ ప్రయాణంలో మెడికేషన్ ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలుసుకుందామా ?
ముఖ్యాంశాలు
ఫారిన్ ట్రిప్‌లో మందుల గొడవ ఏంటి ? | Medicines for An International Trip

ఫారిన్ ట్రిప్ (Foreign Trip) వెళ్తుంటే ఈ మందులు గొడవేంటి ? విదేశాల్లో మెడికల్ షాప్స్ ఉండవా? లేక మెడిసిన్స్ దొరకవా అని మీరు ఆలోచిస్తే …అందులో తప్పేం లేదు. ఎందుకంటే నేను కూడా అదే ఆలోచించి ఈ ఆర్టికల్ ప్రారంభించాను. అయితే మీరు అనుకున్నంత సింపుల్ కాదు ఈ మెడిసన్ వ్యవహారం. మీరు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ! ఎందుకంటే…
- ఒక్కో దేశం ఒక్కో చట్టం : మందులు విషయంలో ప్రతీ దేశానికి కొన్ని నియమాలు, నిబంధనలు ఉంటాయి. మన దేశంలో ప్రతీ మెడికల్ షాపుల్లో ఉంటే కొన్ని మందులు విదేశాల్లో అసలు లభించకపోవచ్చు. లేదా చట్టవిరుద్ధం అయి ఉండొచ్చు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, మీరు ఒక కొత్త దేశంలో ల్యాండ్ అయ్యారు. కానీ మీరు క్యారీ చేస్తున్న ఎలర్జీ మందు అక్కడ ఇల్లీగల్ అంటే చట్ట విరుద్ధం అనుకోండి…జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. తరువాత సినిమా మొత్తం మీకు అర్థం అయ్యే ఉంటుంది.
- మనశ్శాంతి కోసం : మీరు ఒక కొత్త దేశానికి వెళ్లి అక్కడ జబ్బుపడ్డారు అనుకోండి. మీరు రెగ్యులర్‌గా వాడే మందు గురించి లేదా అలాంటి మందుల గురించి అక్కడి వారికి చెప్పలేని పరిస్థితి వస్తే ఏం చేస్తారు ?. ఈ చిన్న టెన్షన్ మీ మూడ్ చెడగొట్టేస్తుంది. సో మీ మందులు మీరు ప్యాక్ చేసుకోవడం వల్ల ఈ టెన్షన్స్ ఏమీ ఉండవు. మీకు అవసరం ఉన్నప్పడు వాటిని వాడుకోవచ్చు.
- వచ్చీ రాని భాషలో: కొత్త దేశం వెళ్లినప్పుడు అక్కడి భాష రాకపోతే మన బాధను మనం చెప్పడం కష్టం అవుతుంది. తలనొప్పి, జలుబు, జ్వరం లాంటివి సులభంగా చెప్పేయోచ్చు కానీ చాలా సమస్యలు చెప్పడంలో భాషాపరమైన ఇబ్బంది కలుగుతుంది. వాళ్లకు మన సమస్యే అర్థం కానప్పుడు వాళ్ల దగ్గర మెడిసిన్ ఉన్నా కానీ…వాటిని ఎలా ఇస్తారు ? ఇవ్వేలేరు కదా! అందుకే మన మందులు మనమే ప్యాక్ చేసుకోవాలి!
- నకిలీ కష్టాలు : విదేశాల్లో లభించే మందులు ఒరిజినలా లేకా డుప్లికేటా అనేది తెలుసుకోవడం కష్టం.
- ఇది కూడా చదవండి: Jet Lag Decoded : జెట్‌లాగ్ అంటే ఏంటి ? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?
ఎలాంటి మందులు ప్యాక్ చేసుకోవచ్చు ? | How To Pack Medicines

ఇక్కడే మీరు జాగ్రత్తగా ప్లాన్ చేయడం మొదలు పెట్టాలి. దాని కోసం ఈ కింది అంశాలు పరిగణలోకి తీసుకోండి !
- వైద్యుల సలహా : అన్నింటికన్నా ముందు మీరు మీ వైద్యుడిని సంప్రదించి విదేశీ ప్రయాణం గురించి చెప్పండి. మీ ఆరోగ్య సమస్యల చరిత్ర మొత్తం వారికి తెలుసు కాబట్టి మీ డెస్టినేషన్, ప్రయాణ సమయాన్ని బట్టి మీకు వ్యక్తిగతంగా ప్రిస్క్రిప్షన్ రాసి ఇస్తారు. మీరు రెగ్యులర్‌గా వినియోగించే మెడిసిన్ గురించి వారిని వ్యక్తిగత ప్రిస్క్రిప్షన్ అడగడం మర్చిపోకండి. దీంతో పాటు ఏమైనా వ్యాక్సిన్ లేదా ముందుస్తుగా వేసుకోవాల్సిన మెడిసిన్ (Preventive Medicine) ఏమైనా ఉంటుందా అని కూడా అడగండి.
- మీ మందుల పేర్లు : ఇది చాలా తేలికైన పని. మీరు రెగ్యులర్‌గా వాడే మందుల జెనరిక్ నేమ్, మోతాదు, ఫ్రీక్వెన్స్ వంటివి నోట్ చేసుకోండి. మొత్తం ట్రిప్‌కు సరిపడా మందులను ప్యాక్ చేసుకోండి. దీంతో పాటు మీ ప్రయాణం పొడగించాల్సి వచ్చినా లేదా ఏదైనా సమస్యల వల్ల వాయిదా పడినా సరిపడే విధంగా కొన్ని మందులను ఎక్స్‌ట్రా కూడా ప్యాక్ చేసుకోండి. వాటిని ఒరిజనల్ లేబుల్లోనే ఉంచండి. పోపుల డబ్బాల్లాంటి డబ్బాలో పెట్టుకుని క్యారీ చేయకండి.
- ఇది కూడా చదవండి: కొత్త దేశం వెళ్తున్నారా? అయితే ఈ పపులు అస్సలు చేయకండి!
తప్పకుండా తీసుకెళ్లాల్సినవి | Must Carry Medicine
మీరు చదవబోయే ఈ కింది మందులు అనేవి మీకు ఎప్పుడు ఉపయోగపడతాయో తెలియదు. కానీ వీటిని క్యారీ చేయడం మంచిది. అయితే మీ లిస్టు రెడీ చేసుకుని మీ వైద్యుడికి చూపించడం మరవకండి.
- పెయిన్ కిల్లర్స్ : ప్యారాసిటమల్, తలనొప్పి, జలుబుకు, చిన్న చిన్న గాయాలు అయితే వాడాల్సిన మందులను వైద్యుల సలహా మేరకు మీరు క్యారీ చేయవచ్చు.
- అలర్జీ మందులు : విదేశాల్లో ఉండే కాలుష్యం, దుమ్ము, కొత్త రకం ఫుడ్ తిన్నప్పుడు కలిగే ఇబ్బందుల నుంచి తప్పించుకునే మందులను క్యారీ చేయవచ్చు.
- జీర్ణ శక్తి పెంచే మందులు : అజీర్తి, యాంటి డయేరియా మందులు మీతో పాటు తీసుకెళ్లవచ్చు. ఎందుకంటే కొత్త ప్రదేశాల్లో తినే ఫుడ్ మీకు సెట్ అవ్వొచ్చు అవ్వకపోవచ్చు.
- జలుబు, దగ్గు మందులు: జలుబు, దగ్గు, గొంతు నొప్పికి సంబంధించిన మందులను కూడా ప్యాక్ చేసుకోవచ్చు. వాతావరణంలో మార్పు వల్ల చాలా మందికి వచ్చే సాధారణ సమస్యలు ఇవే!
- ఫస్ట్ ఎయిడ్ కిట్ : బ్యాండేజీలు, యాంటిసెప్టిక్ క్రీమ్, యాంటిసెప్టిక్ వైప్స్, పెయిన్ రిలీఫ్ స్ఫ్రేస్ వంటి వాటిని తీసుకెళ్లే చిన్న చిన్న దెబ్బలు, స్క్రాచెస్ వచ్చినా మీరు వెంటనే ట్రీట్మెంట్ ప్రారంభించవచ్చు.
- మోషన్ సిక్నెస్ రిలీఫ్ : విమానాల్లో, ట్రెయిన్లో, బోట్లల్లో ప్రయాణించే సమయంలో వచ్చే మోషన్ సిక్నెస్ కోసం కూడా మీరు మందులు ప్లాన్ చేసుకోవచ్చు.
- సన్ స్క్రీన్ : ఎక్కువ మోతాదులో ఎస్‌ఫీఎఫ్ ఉన్న సన్‌స్రీన్ లోషన్ (Sunscreen Lotion) తీసుకుంటే ఎండ నుంచి మీ చర్మాన్ని రక్షించుకోవచ్చు.
- ఎలాక్ట్రాల్ పౌడర్ ( ఓఆర్‌ఎస్ ) కూడా మీరు మీతో పాటు తీసుకెళ్లేలా ప్లాన్ చేసుకోండి.
వ్యక్తి గత అవసరాలు
Medicines for an International Trips : చాలా మందికి వ్యక్తిగతంగా, ఆరోగ్య పరంగా కొన్ని ప్రత్యేక అవసరాలు ఉంటాయి. వాటికి తగ్గట్టు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది:
- ఇన్‌హేలర్స్ : ఆస్తమా ఉన్నవాళ్లు ఆస్తమా ఇన్‌హేలర్స్ తీసుకెళ్లవచ్చు.
- ఎడిపెన్ : తీవ్రమైన అలర్జీలు ఉన్న వాళ్లు ఎడిపెన్ తీసుకెళ్తుంటారు.
- మధుమేహం : డయాబెటిస్ ఉన్నవాళ్లు ఇన్సులిన్, గ్లూకోజ్ మీటర్, టెస్ట్ స్ట్రిప్స్ , ఎమర్జెన్సీ గ్లూకాగోన్ తీసుకెళ్లవచ్చు.
- కాంటాక్ట్ లెన్స్ సొల్యూషన్ : ఒకవేళ మీరు కాంటాక్ట్ లెన్స్ ధరించేవారు అయితే తప్పకుండా ఇది తీసుకెళ్లవచ్చు.
ప్రొఫెషనల్‌గా ప్యాకింగ్ చేసుకోవడానికి టిప్స్

పైన వివరించిన అవసరాలను బట్టి వైద్యుల సూచనల మేరకు కావాల్సిన మెడిసిన్ తీసుకున్నాక వాటిని ఎలా ప్యాక్ చేసుకోవాలో తెలుసుకుందాం.
- ఒరిజినల్ కంటైనర్స్: మందులను వాటి కంటైనర్స్‌తో సహా ప్యాక్ చేసుకోండి. సింపుల్‌గా చెప్పాలి అంటే మెడికల్ షాపులో తీసుకున్నప్పుడు ప్యాక్ ఎలా ఉంటుందో అలాగే క్యారీ చేయాలి. అంతే కానీ వాటిని బయటికి తీసి పొపుల డబ్బాలాంటి డబ్బాలో పెట్టకండి. కస్టమ్స్, సెక్యూరిటీ చెకింగ్ సమయంలో వారు చూసేది ఇదే ! (Medicines for an International Trips)

- క్యారీ ఆన్ బ్యాగు బెస్టు : మీకు అత్యవసరం అనిపించే మెడిసిన్‌ను చెక్డ్ లగేజీలు (Checked Luggage) అస్సలు పెట్టకండి. లగేజీ మిస్ అవడం లేదా మీ దగ్గరికి ఆలస్యంగా అయితే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అందుకే ముఖ్యమైన మందులను మీతో పాటు క్యారీ చేసే బ్యాగులోనే పెట్టుకోండి.
- ఎక్స్‌ట్రా తీసుకెళ్లండి : మీ ప్రయాణం వ్యవధిని బట్టి మందులను ప్లాన్ చేసుకోండి. వీలైతే ఒక వారం మందులను ఎక్స్‌ట్రా పెట్టుకోండి. పనికొస్తే పనికొస్తాయి లేదంటే మీతో పాటు నాలుగు ఊళ్లు తిరిగొస్తాయి. విదేశాలకు వెళ్లినప్పుడు కొన్ని అనుకోని పరిస్థితుల్లో మన ప్రయాణం పొడగించాల్సి రావచ్చు. అలాంటప్పుడు మందులు పనికొస్తాయి.
- చల్లగా, పొడిగా: మీతో పాటు తీసుకెళ్లే మందులను పొడిగా, చల్లగా ఉండే వాతావరణంలో నిల్వ చేేసుకోండి. సూర్యరశ్మి (Sunlight) పడకుండా చూసుకోండి. కొన్ని మందులకు ఫ్రిడ్జి అవసరం అవుతుంది. అందుకోసం ఇన్సులేటెడ్ కూలర్ బ్యాగ్ తీసుకెళ్లండి.
- క్లియర్ బ్యాగ్ : మెడిసిన్ అంతా కూడా పారదర్శకంగా ఉండే క్లియర్ బ్యాగులో క్యారీ చేయండి. సెక్యూరిటీ చెకింగ్ సమయంలో సులభంగా వాటిని చూపించే అవకాశం ఉంటుంది.
పేపర్ వర్క్: కావాల్సిన డాక్యుమెంట్స్

విదేశీ ప్రయాణంలో (International Trip) మనమేంటో, మన అవసరాలు ఏంటో పేపర్‌పై ఉండాలి. అందుకే పేపర్ వర్క్‌ను లైట్ తీసుకోకండి.
- ప్రిస్క్రిప్షన్ కాపీ : మీ మెడిసిన్‌కు సంబంధించిన ప్రిస్క్రిప్షన్ కాపీలను పేపర్ రూపంలో, డిజిటల్‌గా (మొబైల్లో లేదా క్లౌడ్‌లో) అందుబాటులో ఉంచుకోండి.
- డాక్టర్ లెటర్ : మీ ఆరోగ్య పరిస్థితి గురించి , మీరు తీసుకునే మందుల గురించి మీ వైద్యుడు రాసిన లేఖ చాలా ఉపయోగపడుతుంది. కొన్ని సందర్భాల్లో ఇది మిమ్మల్ని సమస్యల నుంచి గట్టెక్కిస్తుంది కూడా.
- మందుల జాబితా : పైన వివరించి విధంగా మీ మందులకు సంబంధించిన సమాచారాన్ని పేర్లను, వేసుకోవాల్సిన సమయం, డోజేజ్, వైద్యుడి కాంటాక్ట్ నెంబర్ వంటివి అన్నింటినీ కలిపి ఒక లిస్టు తయారు చేసి దాన్ని మీ కుటుంబ సభ్యుల వద్దో, ఫ్రెండ్ వద్దో ఉంచండి.
బయల్దేరే ముందు
- మీరు తీసుకెళ్తున్న మందులను ఒక్కొక్కటిగా మీరు వెళ్లనున్న దేశాలు అనుమతిస్తాయో లేదో చెక్ చేయండి. డౌట్ వస్తే ఎంబసీ లేదా కాన్సులేట్‌కు కాల్ చేసి అడగండి.
- మీరు బయల్దేరే ముందు ఒకసారి డాక్టర్‌తో మాట్లాడండి.
- మీ ట్రావెల్ ఇన్సురెస్స్ (Travel Insurance) సంస్థకు మీ ప్రయాణం గురించి మీ ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పండి. ఏవైనా అనారోగ్యాలు కవర్ అవుతాయో లేదో తెలుసుకోవాలి అని ఉంటే వారిని అడగండి.
- ఇది కూడా చదవండి : Visa Free Countries: భారత్‌కు దగ్గరగా ఉన్న ఈ 8 దేశాలకు వీసా లేకుండానే వెళ్లొచ్చు
గుర్తుంచుకోండి
Pack Medicines For An International Trip : విదేశీ ప్రయాణం అనేది జీవితంలో ఒక అరుదుగా లభించే అందమైన అనుభవం. ఇలాంటి యాత్రలను ఎంజాయ్ చేయాలి అనుకుంటే మీరు చిన్న చిన్న విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోండి. బయల్దేరే ముందు ఈ స్టోరీని మళ్లీ చదవండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే షేర్ చేయండి.
గమనిక : ఏ మందులు తీసుకెళ్లాలో అనేది మీ వ్యక్తిగత వైద్యుడి సూచన మేరకు నిర్ణయం తీసుకోండి. అలాగే ఏ దేశం వెళ్తున్నారో ఆ దేశంలో మీరు తీసుకెళ్లే మందులు చట్టబద్ధమో కాదో కూడా చెక్ చేసుకోండి. ఇంటి వైద్యంగా తీసుకెళ్లే వాము, సోంపు, శొంఠి, జెండూ బామ్ వంటివి కూడా చెక్ చేసి చూడండి.
📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
- Niagara Falls, మాన్యుమెంట్ వ్యాలీ.. అమెరికాలో తప్పకుండా చూడాల్సిన 10 నేచురల్ వండర్స్
- Visa Free Countries: భారత్‌కు దగ్గరగా ఉన్న ఈ 8 దేశాలకు వీసా లేకుండానే వెళ్లొచ్చు