ఎక్స్‌ పీరియం ఎకో పార్క్ ఎలా వెళ్లాలి ? టికెట్ ధర ఎంత ? విశేషాలు ఏంటి ? | Hyderabad Experium Eco Park

షేర్ చేయండి

హైదరాబాద్‌లో ప్రకృతి ప్రేమికుల కోసం ఎక్స్ పీరియం ఎకో పార్క్ ( Hyderabad Experium Eco Park )  ద్వారాలు తెరుచుకున్నాయి. నేచర్, ఆర్ట్, అడ్వెంచర్ కలబోతల ఈ అందమైన పార్కు ఇకపై భాగ్యనగరంలో ప్రత్యేేక ఆకర్షణగా నిలవనుంది. మీరు కూడా ఈ పార్కుకు వెళ్లాలి అనుకుంటే పూర్తి వివరాలు చదవేయండి.

ఎక్స్‌పోరియం పార్కు గురించి | Overview of Experium Eco Park

  • ఎక్కడ ఉంది ? :  ఎక్స్ పీరియం పార్కు హైదరాబాద్‌కు సమీపంలో, చిల్కూరు బాలాజీ ఆలయం దగ్గర్లో ప్రగాతి రిసార్టు నుంచి కొద్ది దూరంలో ఉన్న ప్రొద్దుటూరు గ్రామంలో ఉంది.
  • విస్తీర్ణం :  150 ఎకరాల మేరా విస్తరించిన భారత దేశంలోని అతిపెద్ద ఎకో పార్కు ( Biggest Eco Park India )  ఇది.
  • ఎప్పుడు ప్రారంభం అయింది : 2025 జనవరి 28వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ఈ ఎకో పార్కును ప్రారంభించారు.
  • Experium Eco Park : 25,000 అరుదైన మొక్కలతో అలరిస్తున్న ఎక్స్ పీరియం పార్క్

ప్రధాన ఆకర్షణలు | Key Attractions About Experium Eco Park

Ten Facts About Experium Park Nursery In Hyderabad (1)
Ten Facts About Experium Park Nursery In Hyderabad (1)
  • ఈ ఎకో పార్కులో 25,000 రకాలు మొక్కలు ఉన్నాయి. వీటిని 85 దేశాల నుంచి సేకరించారు. వీటి ధర రూ.1 లక్ష్ నుంచి రూ.3.5 కోట్ల వరకు ఉంటుంది.
  • ప్రకృతి ప్రేమికులు, పర్యావరణ వేత్తలకు ఇది ఒక అద్భుతమైన ప్రదేశం.
  • ఇక్కడ భారత దేశంలోనే అతి పెద్ద యాంపిథియేటర్ ( India’s Biggest Amphitheatre ) ఉంది. ఇందులో 1,500 మంది సందర్శకులు ఒకేసారి కూర్చోవచ్చు. భారత వారసత్వ సంపద, కీర్తిని చాటేలా కార్యక్రమాలు ఉంటాయి ఇక్కడ.
  • ఇక్క భారత దేశంలోనే తొలి ఫోర్ డైరక్షన్ జిప్‌లైన్ ఉంది. దీని విస్తీర్ణం ఒక కిమీ. దీంతో పాటు ఇక్కడ అది పెద్ద స్నో పార్కు కూడా ఇక్కడే ఉంది.
  • ఇది కూడా చదవండి : మనాలిలో చేయాల్సిన 30 పనులు | 30 Activities in Manali | With Photos
  • ఇక్కడ ప్రపంచంలోనే తొలి ట్రీ కాఫీ షాపు ( world’s first tree coffee shop ) ఉంది. దీంతో పాటు అండర్ వాటర్ రెస్టారెంట్ ఉంది. 
  • ఇక్కడ 20 వరకు స్టెయిన్‌లెస్ స్టీల్ శిల్పాలను ఏర్పాటు చేశారు. వీటి ఎత్తు 30 అడుగులు ఉంటుంది. 
Ten Facts About Experium Park Nursery In Hyderabad (1)
| ఎక్స్‌పీరయం ఎకో పార్కులో ఒక కళాకృతి | Photo : X/experium
  • 12 ఎకరాల మేరా మ్యాన్ మేడ్ బీచ్ ( Man Made Beach Hyderabad ) ఉంటుంది. ఇక్కడ మీరు రిలాక్స్ అవ్వొచ్చు, ఫోటోగ్రఫీ చేయవచ్చు.
  • ఇక్కడ అతి పెద్ద బాక్స్ క్రికెట్ ఫెసిలిటీ ఉంది.
  • ఇక్కడ 40 రూములు, 20 లగ్జరీ కాటేజీలు ఉన్నాయి. హైదరాబాద్‌కు సమీపంలో మంచి హనీమూన్ స్పాట్ ( Honeymoon Near Hyderabad )  అవుతుంది. 
  •  ఇది కూడా చదవండి : Honeymoon : వీసా అవసరం లేకుండా ఈ ఏడు దేశాల్లో హనీమూన్‌కు వెళ్లొచ్చు.
  • ఇక్కడ 600 సెల్ఫీ పాయింట్స్ ఉన్నాయి. 
  • ఇక్కడ పైకస్ జాతికి చెందిన 5,000 ఏళ్లనాటి చెట్టును చూడవచ్చు.
  • ఎక్స్‌పీరియం ఎకో పార్కులో ప్రపంచ స్థాయి రుచులను మిచెలిన్ గ్రాండ్ డైనింగ్‌లో ( Michelin-Grade Dining ) ఎంజాయ్ చేయవచ్చు.
  • ఈ పార్కు నిర్మాణం కోసం ఏకంగా రూ.150 కోట్లు ఖర్చు చేశారు.
  • ఇందులో మొత్తం 1,000 వరకు ఉద్యోగులు పని చేస్తున్నారు.

ఎంట్రీ ఫ్రీ | Experium Eco Park Entry Fee and Timings

టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి ? | How To Get Experium Eco Park Tickets

Hyderabad Experium Eco Park
| ఇలాంటివి ఎన్నో మీరు అక్కడ చూడవచ్చు. | Photo : X/experium

ప్రస్తుతానికి అయితే  ఈ టికెట్లు కేవలం అక్కడి వెళ్లి మాత్రమే కొనగలరు. ఆన్ సైట్ టికెట్ కౌంటర్‌లో మీరు కొనుగోలు చేయవచ్చు. ఆన్‌లైన్ బుకింగ్ సదుపాయం ( Experium Eco Park Tickets Online ) త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఎలా చేరుకోవాలి ? | How To Reach Experium Eco Park 

  • కారు, సొంత వాహనంలో :  చిల్కూరు బాలాజీ ఆలయం రహాదారి నుంచి ప్రగతీ రీసార్ట్ వైపు వెళ్తే, సమీపంలోనే ఉంటుంది. 
  • పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ : చిల్కూరువైపు వెళ్లే బస్సులు ఎక్కవచ్చు. దాంతో పాటు పార్కు సమీపం నుంచి వెళ్లే బస్సుల గురించి కనుక్కోగలరు.
  •  Valley Of Flowers : వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఎలా వెళ్లాలి? ఎప్పుడు వెళ్లాలి ?

టిప్స్ | Tips for Visiting Experium Eco Park 

  • ఎకో ఫ్రెండ్లీ పార్క్ వెళ్లే ముందు టికెట్ ధరలు, స్థానిక ప్రాంతాల గురించి తెలుసుకోండి. దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి.
  • మీతో పాటు మంచినీటి బాటిల్‌ను తీసుకెళ్లండి. మరీ ముఖ్యంగా ఎండాకాలం జాగ్రత్త.
  • మీతో పాటు ఒక కెమెరా, స్మార్ట్ ఫోన్ తీసుకెళ్లండి. ఎందుకంటే ఇక్కడ ఫోటోలు తీసుకునే ప్రదేశాలు చాలా ఉంటాయి.

మొత్తానికి | Why To Visit Experium

ఎక్స్‌పోరియం ఎకో పార్కు అనేది ఒక పర్యాటక ప్రదేశం మాత్రమే కాదు. ఇది నేచర్, కల్చర్, అడ్వంచర్ కలబోతల అద్భుతమైన యాత్ర. మీరు ప్రశాతంగా కాసేపు సమయం గడపాలి అనుకున్నా, లేకా కుటుంబంతో, స్నేహితులతో, స్పెషల్ పర్సన్‌తో కాసేపు సరదాగా గడపాలి అనుకున్నా ఇది మంచి ఛాయిస్ అవుతుంది. సో, ఇంకెందుకు ఆలస్యం వెంటనే ప్లాన్ చేసుకోండి.

ఈ  Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!