Ladies Day Celebrations 2025 : నుమాయిష్‌లో నేడు మహిళలకు మాత్రమే అనుమతి…

Share This Story

హైదరాబాద్ పరిసరాల్లో ఉండే మహిళలకు శుభవార్త. నేడు హైదరాబాద్ ఎగ్జిబిషన్‌లో కేవలం మహిళలను మాత్రమే అనుమతించనున్నారు. ప్రతీ సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా లేడీస్ డే స్పెషల్ ( Ladies Day Celebrations 2025 ) ఈవెంట్‌ను నిర్వహించనున్నట్టు ఆఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన ( AIIE ) సొసైటీ తెలిపింది. పది సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉన్న అబ్బాయిలకు, పురుషులకు నేడు హైదారాబాద్ ఎగ్జిబిషన్‌లోకి అనుమతి ఉండదు.

Nampally Numaish కు  ఏటా లక్షలాది మంది వస్తుంటారు. అయితే మహిళల కోసం ఏటా లేడీస్ డే సెలబ్రేషన్స్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి, ఎగ్జిబిషన్‌ చూడటానికి చాలా మంది దూరదూరం నుంచి వస్తుంటారు. ఈ రోజు స్టాల్స్ నిర్వాహకులు, సెక్యూరిటీ, ఎగ్జిబిషన్ సొసైటీ సిబ్బంది తప్పా సందర్శకులలో మగవారు, 10 ఏళ్ల కన్నా ఎక్కువ వయసు ఉన్న అబ్బాయిలు కనపించరు. సో ఈ రోజు నుమాయిష్‌ మొత్తం మహిళా లోకంగా మారనుంది. ఈ కార్యక్రమానికి వెళ్లాలి అనుకుంటున్న మహిళలు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10.30 వరకు నుమాయిష్‌ను సందర్శించవచ్చు.

లేడీస్ డే ఎవరు స్టార్ట్ చేశారు ? | Numaish Ladies Day Celebrations History

నుమాయిష్‌లో మహిళల కోసం ప్రత్యేక రోజును కేటాయించాలని, వారి కోసం ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలనే ఐడియా ఇప్పటిది కాదు. 1940 లో హైదరాబాద్ సంస్థానం చివరి నిజాం అయిన మీర్ ఉస్మానస్ అలీ ఖాన్ ( Mir Osman Ali Khan ) ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

మీకో విషయం తెలుసా మొదట్లో ప్రతీ మంగళవారం లేడీస్ డే సెలబ్రేట్ చేసేవారు. అయితే మహిళా సందర్శకుల సంఖ్య తగ్గూతూ ఉండటంతో నిర్వాహకులు మధ్యలో దీన్ని ఆపేశారు. అయితే ప్రతీ సంవత్సరం ఒక రోజు మాత్రం లేడీస్ డే సెలబ్రేట్ చేయడాన్ని కొనసాగిస్తున్నారు.

నుమాయిష్ విశేషాలు | Numaish 2024 Overview | Ladies Day Celebrations 2025

Prayanikudu
| నుమాయిష్‌లో ఒక స్టాల్ వద్ద సందర్శకులు

ఈ సంవత్సరం ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లోని నుమాయిష్‌లో మొత్తం 2400 వరకు స్టాల్స్ ఏర్పాటు చేశారు. నాంపల్లి ప్రాంతంలో ప్రతీ ఏటా జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు నుమాయిష్ జరుగుతుంది. అయితే ఈ ఏటా జనవరి 1 వ తేదీకి బదులు జనవరి 3వ తేదీన నుమాయిష్ మొదలైంది. ఎందుకంటే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంతో సంతాప దినాల కారణంగా రెండు రోజులు వాయిదా పడింది. అందుకే ఈ సారి నుమాయిష్ ఫిబ్రవరి 17 వరకు కొనసాగనుంది. ఒకటి రెండు రోజులు పొడగించే అవకాశం కూడా ఉంది.

నుమాయిష్ టైమింగ్ | Numaish 2024 Timings

హైదరాబాద్ ఎగ్జిబిషన్‌ గ్రౌండ్ ప్రాంగణంలోకి ప్రతీ రోజు సాయంత్రం 4 గంటల నుంచి సందర్శకులను అనుమతిస్తారు. రాత్రి 10.30 వరకు తెరిచే ఉంటుంది నుమాయిష్. అయితే శనివారం, ఆదివారం సమయంలో రద్దీనీ దృష్టిలో ఉంచుకుని సమయాన్ని పెంచారు. రాత్రి 11 వరకు సందర్శకులు నుమాయిష్‌లో స్టాల్స్‌ను సందర్శించవచ్చు. 

నుమాయిష్ ఏ టైమ్‌లో వెళ్లాలి ? | Best Time Visit Numaish 

మీరు రద్దీగా ఉన్న టైమ్‌లో కాకుండా కాస్త జనం తక్కువగా ఉన్న సమయంలో వెళ్లాలి అనుకుంటే మాత్రం ..సోమవారం నుంచి శుక్రవారం లోపు ప్లాన్ చేయండి. అది కూడా సాయంత్రం 4 గంటల నుంచి 6.30 లోపు ఎంట్రీ ఇచ్చేలా ప్లాన్ చేయండి. లేదంటే చాలా రష్‌లో  వేలాది మంది మధ్యలో  తిరగాల్సి ఉంటుంది.  చాలా మంది తమ ఉద్యోగాలు ముగించుకుని , ఫ్యామిలీని పికప్ చేసుకుని సాయంత్రం 6.30 నుంచి  7 గంటల మధ్యలో నుమాయిష్‌లోకి ఎంటర్ అవుతారు. తరువాత కనీసం రెండు గంటలు యావరేజ్‌గా అయినా స్పెండ్ చేస్తారు అనుకుందాం. సో 6.30 నుంచి 9 వరకు నుమాయిష్ ప్రీమియర్ టైమ్ అని చెప్పవచ్చు. ఇది ఏదో రీసెర్చ్ చేసి చెప్పడం లేదు. జస్ట్ కామన్ సెన్స్‌తో చెబుతున్నాను. న్యూస్ ఛానెల్స్ అండ్ రేడియోల్లో కూడా 6.30 నుంచి 9 వరకు ఉండే సమయాన్నిప్రీమియం టైమ్‌గా పరిగణిస్తారు.

Prayanikudu
| వాట్స్ అప్‌లో ఆసక్తికరమైన ట్రావెల్ కంటెంట్ పొందడానికి ఇక్కడ క్లిక్ చేసి గ్రూపులో చేరగలరు
ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెళ్లాల్సిన ప్రదేశం |

నాంపల్లి ఎగ్జిబిషన్ అనేది కేవలం షాపాహాలిక్స్ ( Shopaholics – షాపింగ్ ప్రియులు  )  కోసమే కాదు. ఇక్కడికి కేవలం షాపింగ్ కోసం మాత్రమే కాదు, చాలా మంది సరదా కోసం కూడా వస్తుంటారు. ఫ్యామిలీ ఫ్రెండ్స్‌తో కలిసి ఇక్కడ ఈవినింగ్ వాక్ చేయడానికి కూడా వస్తుంటారు. చిన్నా పెద్దా అనేది తేడాలు లేకుండా అందరి కోసం ఇక్కడ ఏదో ఒకటి ఉంటుంది. దేశంలోని నలుమూలల నుంచి వచ్చే వ్యాపారులు తమతో ఎన్నో రకాల వస్తువుల, బొమ్మలు, దుస్తువులు ఇలా ఎన్నో తీసుకొస్తారు. ఇన్ని వెరైటీస్ చూసే అవకాశం చాలా అరుదుగా లభిస్తుంది. అందుకే సంవత్సరానికి 25 లక్షల మంది సందర్శకులు నుమాయిష్‌కు వస్తుంటారు.

సేఫ్టీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు

నుమాయిష్‌కు వచ్చే సందర్శకుల సేఫ్టీ విషయంతో ఎగ్జిబిషన్ సొసైటీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. నుమాయిష్ గౌండ్‌లో సీసీటీవీలో సర్వెలేన్స్ ఏర్పాటు చేశారు. దీంతో పాటు 500 మంది సెక్యూరిటీ గార్డులను , ఒక ఆన్ సైట్ పోలిస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేశారు. ఫైర్ ఇంజిన్లను కూడా అందుబాటులో ఉంచారు. దీంతో పాటు పోలిస్ సిబ్బంది,  ఎమర్జెన్సీ మెడికల్ టీమ్, విపత్తు నిర్వహణ టీమ్, జీహెచ్ఎంసి సిబ్బంది సహకారంతో కూడా ఉంటుంది.

చిల్డ్రన్స్ డే | Numaish Children’s Day

నుమాయిష్‌లో లేడీస్ డేతో పాటు ప్రతీ ఏటా ఒక రోజు చిల్డ్రన్స్ డే నిర్వహిస్తారు. దీనిని చిల్ట్రన్స్ స్పెషల్ ( Numaish Children’s Special ) అని కూడా పిలుస్తుంటారు. ఈ సంవత్సరం దీన్ని జనవరి 31వ తేదీన నిర్వహించనున్నారు. కుటుంబ సమేతంగా సందర్శించేందుకు నుమాయిష్ అత్యంత అనుకూలం అని చాటి చెప్పేందుకు ఈ ప్రత్యేక రోజును నిర్వహిస్తుంటారు. నిజానికి ఎగ్జిబిషన్‌ను పెద్దల కన్నా పిల్లలే ఎక్కువ ఎంజాయ్ చేస్తుంటారు. 

నుమాయిష్ ఎలా వెళ్లాలి ? | How To Reach Numaish 2025

హైదరాబాద్ నుమాయిష్‌కు దేశంలో వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసి బస్సులు, మెట్రో ట్రైన్లు అందుబాటులో ఉన్నాయి. మీరు నాంపల్లి , ఎంజే మార్కెట్, గాంధీ భవన్ ఎటువైపు నుంచి అయినా ఎగ్జిబిషన్‌లోని ఎంటర్ అవ్వొచ్చు. పార్కింగ్ సదుపాయం కూడా ఉంటుంది. అయితే సొంత వాహనాల  కన్నా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు వినియోగిస్తే పార్కింగ్ దగ్గర ఇబ్బందులు తగ్గుతాయి. 

హైదారాబాద్ నుమాయిష్ నిర్వహణ కోసం ముందస్తు ప్రణాళికతోనే ఎగ్జిబిషన్ సొసైటీ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తుంది. అయితే సందర్శకులు తాకిడి రెస్పాన్సును బట్టి నుమాయిష్‌ను మరింత కాలం కొనసాగించే అధికారం కూడా ఈ సొసైటీకి ఉంది.

తుల్జాపూర్ అమ్మవారి ఆలయంలో ప్రయాణికుడు..కంప్లీట్ ట్రావెల్ గైడ్

Trending Video On : Prayanikudu Youtube Channel

నుమాయిష్ 2025 గురించి మరిన్ని కథనాలు

Share This Story

Leave a Comment

error: Content is protected !!