Nehru Zoological Park లో పిల్లల కోసం సమ్మర్ క్యాంప్…షెడ్యూల్ అండ్ రిజిస్ట్రేషన్ వివరాలు ఇవే

షేర్ చేయండి

వన్యప్రాణులు, ప్రకృతిని ఇష్టపడే పిల్లల కోసం హైదరాబాద్ జూలాజికల్ పార్క్ (Nehru Zoological Park) సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. ఈ క్యాంపు వల్ల విద్యార్థులకు వినోదం, విఙ్ఞానం రెండూ లభిస్తాయి. 

కవర్ చేసే అంశాలు | Nehru Zoological Park

విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఈ ప్రత్యక సమ్మర్ క్యాంపులో పిల్లలకు జూపార్క్ గురించి అవగాహన కల్పిస్తారు. దీంతో పాటు వివిధ జంతువులు (Wild Animals) ఎలా ప్రవర్తిస్తాయి, వాటి లక్షణాలు, ఆహరపు అలవాట్లు వంటి విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. పిల్లలు వారి డౌట్స్ కూడా అడిగి క్లియర్ చేసుకోవచ్చు.

  • దీంతో పాటు సరీసృపాలు (reptiles) గురించి కూటాఅవగాహనా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
  • ఈ కార్య్రమంలో సరీసృపాల గురించి ఉన్న అసత్య ప్రచారాలు, పుకార్లు, మూఢ నమ్మకాల గురించి అవగాహన కల్పిస్తారు.
  • అలాగే పర్యావరణంలో వివిధ జీవుల పాత్ర ఏంటి అనే అంశంపై ఈ క్యాంపులో అవగాహన కల్పిస్తారు.
  • ఇది కూడా చదవండి :  ఈ రాష్ట్రంలో  ఒక్క రైల్వే స్టేషన్ కూడా లేదు..ఏ రాష్ట్రమో తెలుసా? 

దీంతో పాటు క్యాంపులో చేసే పిల్లలకు నైట్ హౌజ్ (Night House) విజిట్ చేసే అవకాశం కూడా కల్పిస్తారు. వన్యప్రాణి నిపుణులు, జూ గైడ్స్ ఆధ్వర్యంలో జరిగే ఈ సమ్మర్ క్యాంపు గురించి…

 మరిన్ని వివరాలు..| Registration and Eligibility

Nehru Zoological Park Summer Camp
Photo : Hyderabad Zoo Official Site
  • అర్హత : 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్ధులు
  • షెడ్యూల్ : 2025 మే మొదటి వారంలో మొదలై జూన్ వరకు నడిచే ఈ క్యాంపులో  ప్రతీ రోజు 15 నుంచి 20 మంది విద్యార్థులకు పాల్గొనే అవకాశం లభిస్తుంది.
  • యాక్టివిటీస్ : జూ పార్క్ (Nehru Zoological Park) టూర్, జంతువులు, సరీసృపాలపై ప్రత్యేక సెషన్, నైట్ హౌజ్ విజిట్‌తో పాటు ప్రకృతి, వన్యజీవులపై మమకారం కలిగేలా ఇంటరాక్టివ్ యాక్టివిటీస్ ఉంటాయి.
  • రిజిస్ట్రేషన్ ఫీ : ప్రతీ పార్టిసిపెంట్ రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. 
  • ఈ క్యాంపులో చిరుతిళ్లు (స్నాక్స్), శాఖాహార భోజనం (లంచ్) అందిస్తారు.
  • ప్రతీ అభ్యర్థికి ఒక వెల్కం కిట్ ఇస్తారు. ఇందులో ఒక టోపి, నోట్ ప్యాడ్, నెహ్రూ జాలాజికల్ పార్క్ బ్యాడ్జి కూడా ఇస్తారు.

ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ? | Registration Process

ఈ సమ్మర్ క్యాంపులో (summer camp) చేరాలని భావిస్తున్నవారు ఆన్‌లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం హైదరాబాద్ జూ పార్క్ అధికారి పోర్టల్‌ను విజిట్ చేయవచ్చు.

  • మరింత సమాచారం కోసం దిగన నెంబర్లపై సంప్రదించవచ్చు. 040-24477355 
  • వాట్సాప్ నెంబర్ : 92810078369

ఎండాకాలం ఏదైనా నేర్చుకుందాం | Summer Holiday Camps In Hyderabad

పిల్లలో మూగజీవులపై, నేచర్‌పై ప్రేమను (Nature) పెంపొందించడంతో పాటు వారిలో ఆసక్తిని పెంచి అవగాహన కల్పించేందుకు ఆ సమ్మర్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ ఎండాకాలం ఏదైనా నేర్చుకుందాం అనుకునే పిల్లలకు ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు.

Latest Vlog : హరిద్వార్‌లోని అతిపవిత్రమైన మా చండి దేవి ఆలయం | Maa Chandi Devi Temple

📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు.

ఇవి కూడా చదవండి

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!