Ice City of China : చైనాలో పూర్తిగా మంచుతో నిర్మించిన మంచు నగరం
Ice City of China : చలికాలం అనగానే మనకు శాలువ, స్వెటర్, సూప్ వరకే తెలుసు. కానీ చైనాలోని హార్బిన్ (Harbin) ఐస్ అండ్ స్నో ఫెస్టివల్ అంటే… అది పూర్తిగా ఒక డిఫరెంట్ ప్రపంచం.
డిసెంబర్ చివరి నుంచి ఫిబ్రవరి–మార్చి వరకు సాగే ఈ ఫెస్టివల్లో, పూర్తిగా మంచుతో నిర్మించిన ప్రదేశాలు, బ్రిడ్జీలు, కోటలు మైండ్ బ్లోయింగ్ విజువల్స్ అందిస్తాయి.
రాత్రి సమయంలో ఇక్కడ అసలైన మ్యాజిక్ మొదలవుతుంది. వేలాది రంగుల లైట్ల మధ్య మెరిసే మంచు శిల్పాలను చూస్తే ఏదో కథల లోకంలోకి (China winter destinations) వెళ్లినట్టుగా అనిపిస్తుంది. మైనస్ ఉష్ణోగ్రతల్లోనూ పర్యాటకుల ఎగ్జైట్మెంట్ మాత్రం ఎక్కడా తగ్గదు.
ఈ ఎక్స్‌పోలో భారీ స్నో ఆర్ట్, రష్యన్ స్టైల్ నిర్మాణాలు, ఐస్ లాంతర్న్‌లు కనిపిస్తాయి. ఇవన్నీ కలిసి ఇది ఒక పర్ఫెక్ట్ ఇన్స్టాగ్రామ్ డెస్టినేషన్‌గా మారుస్తాయి.
హార్బిన్ ఎక్కడ ఉంది ? | Where is Harbin
హార్బిన్ అనేది చైనాలో నార్త్ ఈస్ట్ సైడ్‌లో Heilongjiang Provice కు రాజధాని. ఇది రష్యా బార్డర్‌కు దగ్గరగా ఉంటుంది. ఇక్కడ ప్రతీ సంవత్సరం Harbin Ice & Snow Festival జరుగుతుంది. గడ్డకట్టుకున్న నదీ నుంచి మంచుముక్కలను కట్ చేసి భారీ శిల్పాలు, భవనాలు, కోటలు నిర్మిస్తారు.
- ఇది కూడా చదవండి : Rovaniemi : ఇక్కడ క్రిస్మస్ తాతతో ఫోటో దిగవచ్చు
హార్బిన్ అంటే కేవలం శిల్పాలే కాదు. ఐస్ స్కేటింగ్, స్నో స్లైడ్స్, వింటర్ యాక్టివిటీస్‌తో ఇది ఫుల్ అడ్వంచర్ ప్యాకేజ్. భోజన ప్రియులకు కూడా ఇది మంచి ట్రీట్. హాట్ డంప్లింగ్స్, లోకల్ చైనీస్ వింటర్ స్నాక్స్ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ.
An entire city made of ice?
— Jason Smith – 上官杰文 (@ShangguanJiewen) February 6, 2026
Welcome to Harbin, China, home of the world's largest annual ice festival.
Would you go if you could? pic.twitter.com/4DulN5eLRk
ఎలా సిద్ధం అవ్వాలి ? | How To Prepare
ఈ ఫెస్టివల్ చూడాలంటే మంచి ప్లానింగ్ అవసరం. సున్నా కన్నా తక్కువ ఉష్ణోగ్రతల కోసం చలిదుస్తులు, గ్లవ్స్, థర్మల్స్, బూట్స్ తప్పనిసరి. అక్కడికి వెళ్లినప్పుడు బాడీ ఫ్రీజ్ అయినా… మనసు మాత్రం ఫుల్ అయ్యే ఫీలింగ్ వస్తుంది.
లైఫ్‌లో ఒక్కసారైనా వెళ్లి చూడాల్సిన ప్రదేశాల్లో హార్బిన్ ఐస్ ఫెస్టివల్ ఒకటి. చలికాలాన్ని ప్రేమించడం ఎలా అనేది తెలుసుకోవాలంటే ఇక్కడికి వెళ్లాల్సిందే.
ఎలా వెళ్లాలి? | How To Reach
Flights: హైదరాబాద్ నుంచి హార్బిన్ వెళ్లాలంటే ముందుగా బీజింగ్ లేదా షాంఘై చేరుకుని అక్కడి నుంచి హార్బిన్ ఫ్లైట్ తీసుకోవాలి.
Local Travel: మెట్రోలు, ట్యాక్సీలు, ప్రత్యేక ఫెస్టివల్ జోన్లు అందుబాటులో ఉంటాయి.
Stay & Winter Tips: సిటీ సెంటర్లో మంచి హోటల్స్ లభిస్తాయి. ఫెస్టివల్‌ను అనుభవించడానికి సాయంత్రం వెళ్లడం ఉత్తమం.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
