Immigration Tips : విదేశాలకు వెళ్తున్నారా? ఇమ్మిగ్రేషన్ అధికారుల ముందు ఈ మాటలు అస్సలు అనకండి
Immigration Tips :మీరు అంతర్జాతీయ ప్రయాణాలు (International Travel) చేస్తున్నప్పుడు ఇమ్మిగ్రేషన్ (Immigration) కౌంటర్ దగ్గర జరిగే ప్రాసెస్ చాలా ముఖ్యమైంది. మీ దగ్గర అన్ని డాక్యుమెంట్లు పర్ఫెక్ట్గా ఉన్నప్పటికీ, నోరు జారినా లేదా తప్పు సమాధానం ఇచ్చినా సమస్యల్లో పడతారు. ఇమ్మిగ్రేషన్ అధికారులు మీ మాటల్లోని వైరుధ్యాలను (Inconsistencies) సులువుగా పసిగట్టగలరు. కాబట్టి, విదేశాలకు వెళ్లేవారు, ముఖ్యంగా ఫస్ట్ టైమ్ వెళ్లేవాళ్లు, ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్స్‌కు అస్సలు చెప్పకూడని 6 నిజాల గురించి తెలుసుకోవడం చాలా అవసరం.
నేను ఎక్కడ ఉండాలో నాకు తెలియదు
ఎందుకు చెప్పకూడదు? మీరు ఏ దేశానికి వెళ్తున్నా, ఎక్కడ బస చేయబోతున్నారో కచ్చితంగా తెలియదని చెబితే, మీకు సరైన ప్లానింగ్ లేదని, లేదా అక్కడ అక్రమంగా ఉండాలని చూస్తున్నారేమోనని అధికారులు అనుమానించే అవకాశం ఉంది.
ఏం చెప్పాలి? ఎప్పుడూ మీ హోటల్ బుకింగ్ అడ్రస్, Airbnb వివరాలు లేదా మీరు బంధువులు/స్నేహితుల ఇంట్లో ఉంటుంటే వారి పూర్తి అడ్రస్‌ను రెడీగా ఉంచుకోవాలి. మీరు ప్లాన్డ్గా ఉన్నారని చూపించడానికి, క్యాన్సిలబుల్ బుకింగ్ ప్రింట్లు లేదా కన్ఫర్మేషన్ మెయిల్స్ చూపించడం మంచిది.

ఆన్లైన్లో పరిచయమైన ఫ్రెండ్‌ను కలవడానికి వచ్చాను
ఎందుకు చెప్పకూడదు? సోషల్ మీడియా ద్వారా లేదా ఆన్లైన్లో పరిచయమైన వ్యక్తిని కలవడానికి వచ్చానని చెబితే, అది ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్స్‌కు అనుమానం కలిగిస్తుంది. మీ రిలేషన్షిప్ క్లియర్‌గా లేకపోతే ఇబ్బందుల్లో పడతారు.
ఏం చెప్పాలి? మీరు ఒక స్నేహితుడిని లేదా బంధువును కలవడానికి వచ్చారని సాధారణంగా చెప్పండి. వారి అడ్రస్‌ను మాత్రమే ఇవ్వండి. అంతకు మించి ఎక్కువగా మాట్లాడకండి. అవసరం అయితే తప్ప, రిలేషన్షిప్ గురించి బ్రీఫ్‌గా చెప్పండి. పిచ్చి సమాధానాలు ఇస్తే… అదనపు ప్రశ్నలు అడిగి, ఎంట్రీని నిరాకరించే ప్రమాదం ఉంది.
నేను ఇక్కడ పని చేయడానికి వచ్చాను(వర్క్ వీసా లేకుండా)
ఎందుకు చెప్పకూడదు? మీరు కచ్చితంగా వర్క్ వీసా (Work Visa) కలిగి ఉంటే తప్ప, వర్క్ అనే పదం అస్సలు వాడకూడదు. మీరు సాధారణ మీటింగ్ లేదా కాన్ఫరెన్స్‌కు హాజరవుతున్నా కూడా, అధికారులు దాన్ని అనుమానాస్పదంగా చూస్తారు.
ఏం చెప్పాలి? మీరు ఒక చిన్న బిజినెస్ ట్రిప్ కోసం, ఒక సెమినార్ కోసం, లేదా ఏదైనా ట్రైనింగ్ కోసం వచ్చారని చెప్పండి. తమ దేశంలో లోకల్ ఉద్యోగాలు చేసే ఉద్దేశం లేదని స్పష్టంగా తెలియజేయండి. మీ వీసా దేని కోసం మంజూరు చేయబడిందో, అదే కారణానికి కట్టుబడి ఉండండి.
ఇది కూడా చదవండి : Dangerous Countries : 2025 లో వెళ్లకూడని అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు
నేను ఇక్కడ ఉన్నప్పుడు ప్లాన్ చేసుకుంటాను
ఎందుకు చెప్పకూడదు? సరైన ప్లానింగ్ లేకుండా వచ్చానని చెబితే, మీరు నిజమైన సందర్శకులు (Genuine Visitor) కాదేమోనని లేదా ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇస్తున్నారేమోనని అధికారులు అనుకోవచ్చు.
ఏం చెప్పాలి? మీరు అనుకోకుండా ప్రయాణం చేసేవారైనప్పటికీ (Spontaneous Traveller), ఒక ప్లాన్ రెడీగా ఉంచుకోండి. మీరు చూడాలనుకుంటున్న నగరాలు, బుక్ చేసుకున్న టూర్స్ లేదా ప్రదేశాల గురించి క్లుప్తంగా వివరించండి. సరైన సమాధానాలు ఇస్తే, మీకు త్వరగా క్లియరెన్స్ వస్తుంది.
నా దగ్గర రిటర్న్ టికెట్ లేదు
ఎందుకు చెప్పకూడదు? మీ దగ్గర తిరిగి వెళ్లే టికెట్ (Return Ticket) లేకపోతే, మీ వీసా గడువు ముగిసినా ఆ దేశంలోనే అక్రమంగా ఉండాలని ప్లాన్ చేస్తున్నారేమోనని అధికారులు అనుమానిస్తారు.
ఏం చెప్పాలి? తిరిగి వెళ్లే టికెట్‌ను కచ్చితంగా మీ వెంట తీసుకెళ్లండి. అది ఫ్లెక్సిబుల్ (తేదీ మార్చుకోదగినది) లేదా రీఫండబుల్ (డబ్బు వెనక్కి వచ్చేది) టికెట్ అయినా పర్లేదు. మీ వీసా అనుమతించిన సమయంలోపే మీరు తిరిగి మీ దేశానికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని ఇది అధికారులకు నిరూపిస్తుంది.
ఇది కూడా చదవండి : Vanuatu: వనవాటు దేశం ఎక్కడుంది ? ఎలా వెళ్లాలి ? కంప్లీట్ ట్రావెల్ గైడ్
నా దగ్గర సరిపడా డబ్బులు లేవు
ఎందుకు చెప్పకూడదు? ఆ దేశంలో మీ అవసరాలు తీర్చుకోవడానికి సరిపడా డబ్బులు మీ వద్ద లేవని చెబితే, అది పెద్ద సమస్య అవుతుంది. మీరు ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై భారం అవుతారని అధికారులు భావిస్తారు.
ఏం చెప్పాలి? ఈ ప్రశ్న అడిగినప్పుడు, మీరు మీ ఖర్చుల కోసం సరిపడా డబ్బు తెచ్చుకున్నారని నిరూపించాలి. బ్యాంక్ స్టేట్మెంట్ కాపీలు, క్రెడిట్ కార్డ్ వివరాలు లేదా చేతిలో ఉన్న క్యాష్ వంటి వాటిని ప్రూఫ్‌గా చూపించడానికి సిద్ధంగా ఉండండి.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
