భారత్ -చైనా మధ్య ఒక కీలక ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా త్వరలో భారతీయులు చైనాకు, చైనీయులు భారత్ రావడానికి డైరెక్ట్ ఫ్లైట్స్ ( India China Direct Flights ) క్యాచ్ చేయవచ్చు. గత 5 సంవత్సరాల నుంచి ఇరు దేశాల మధ్య డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు.
ముఖ్యాంశాలు
వయా వెళ్లేవారు..
ఈ వార్త రాసే సమయం వరకు కూడా ఎవరైనా చైనాకు వెళ్లాలి అనుకుంటే కనెక్టింగ్ ఫ్లైట్ క్యాచ్ చేయాల్సి వచ్చేది. ఇందులో చాలా మంది థాయ్‌లాండ్ లోని ( Thailand ) బ్యాంకాక్ సువర్ణభూమి విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి చైనాకు వెళ్లేవారు. ఇంకా వివిధ దేశాల నుంచి భారతీయులు చైనాకు వెళ్లేవారు. దీని వల్ల ఇతర దేశాలు చాలా లాభపడ్డాయి.అయితే మరికొన్ని రోజుల్లో ఈ పరిస్థితి మారనుంది.

ఇరు దేశాల అంగీకారం | India China Direct Flights
భారత్ -చైనా ఇరు దేశాలు డైరెక్ట్ విమానాలు నడిపే విధంగా, వైమానిక సర్వీసులు పున: ప్రారంభించే విధంగా ఒప్పందం చేసుకున్నాయి.ఇరు దేశాల దౌత్యవేత్తల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని వల్ల ఇరు దేశాల మధ్య దూరం తగ్గి ప్రజలు చేరువవుతారు అని ఆశిస్తున్నారు. దీంతో కైలాష్ మానసరోవర్ యాత్ర చేయాలని భావించే యాత్రికుల కోరికి కూడా త్వరలో నెరవేర నుంది.
2020 నుంచి మారిన పరిస్థితి | Indo-China Border Dispute
గత కొన్నేళ్లుగా భారత్-చైనా సరిహద్దు వద్ద పరిస్థితులు సరిగ్గా లేనందు వల్ల ఇరు దేశాల మధ్య విమానాలు సర్వీసులు ( India China Direct Flights ) , వ్యాపార వ్యవహారాలు ఆగిపోయాయి. ఈ సమస్యలపై భారత్ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించి మార్పు తీసుకురావాలి అని ప్రయత్నించంది.సరిహద్దు వద్ద 2020కు ముందు పరిస్థితులు మళ్లీ ఏర్పడితే కానీ చైనాతో మళ్లీ వ్యాపార, వాణిజ్యం, ఇతర అంశాలపై ముందుకు సాగేది లేదు అనే విధంగా భారత్ వ్యవహరించింది.
తరువాత సరిహద్ద వ్యవహారాలు చక్కబెడితే కానీ లాభం రాదు అని అర్థం చేసుకున్న డ్రాగన్ దేశం చర్చలకు ముందుకు వచ్చింది. అందులో భాగంగానే కొంత కాలం క్రితం ఇరు దేశాలు డేంచోక్ ( Demchok ), డెప్సాంగ్ ( Depsang ) ప్రాంతాల నుంచి సైన్యాన్ని వెనక్కి రప్పించాయి. నాలుగేళ్లలో తొలిసారి ఈ ప్రాంతంలో భారత్- చైనా దేశాల సైనికులు సరిహద్దు వద్ద పెట్రోలింగ్ కూడా చేశారు. పరిస్థితులు మెరుగు అవుతున్న తరుణంలో ఇక డైరెక్ట్ విమాన సర్వీసులు ప్రారంభించే అంశం ముందుకు కదిలింది.
- ఇది కూడా చదవండి : విమానంలో Airplane Mode ఎందుకు ఆన్ చేయాలి ? లేదంటే ఏం జరుగుతుంది ?
కైలాస పర్వత యాత్రకు లైన్ క్లియర్ | Kailash Mansarovar Yatra 2025
చైనాకు డైరెక్ట్ ఫ్లైట్స్ వేయడం వల్ల కైలాష్ మాన్‌సరోవర యాత్ర చేపట్టున్న భక్తులకు వెసులుబాటు కలుగుతుంది. కైలాస పర్వతాన్ని దర్శించుకోవాలి అనే లక్షలాధి మంది భక్తులు కోరుకుంటారు. పరిస్థితులు బాలేని సమయంలో నేపాల్ గగనతలం నుంచి సుమారు 200 కిమీ దూరంలో ఉన్న కైలాస పర్వతాన్ని ( Kailash Darshan From Nepal ) విమానంలో నుంచి చూసే అవకాశం ఉండేది. దీని కోసం రూ.2 లక్షల వరకు ప్యాకేజీ తీసుకోవాల్సి వచ్చేది.
ఈ డైరక్ట్ ఫ్టైల్ వల్ల ఇక నుంచి కొన్ని వందల అడుగులు దూరం నుంచి కైలాస పర్వతాన్ని చూసే అవకాశం లభిస్తుంది. ఈ విషయంపై ఒక ట్రావెల్ ఏజెన్సీతో గతంలో మాట్లాడగా కైలాస పర్వతాన్ని తాకే అవకాశం ఉండదు అని, కేవలం దూరం నుంచి మాత్రమే ఉంటుంది అని తెలిసింది. అయితే పూర్తి వివరాలు ఫస్ట్ బ్యాచ్ వెళ్లి వచ్చాకే తెలుస్తాయి.
ఒకరికి నష్టం…ఒకరికి లాభం |
ఎక్స్‌పైర్ అయిన మందులు మొక్కలకు ఎరువుగా పనికొస్తాయి అన్నట్టు…చైనాకు డైరెక్ట్ ఫ్లైట్స్ లేకపోవడం వల్ల సింగాపూర్ ( Singapore ), వియత్నాం, బంగ్లాదేశ్, మలేషియా, హాంగ్‌కాంగ్ చాలా లాభం పొందాయి. ఈ ఐదేళ్ల పాటు భారతీయులు ఈ దేశానికి వెళ్లి అక్కడి నుంచి చైనాకు వెళ్లేవారు. అయితే ఈ పరిస్థితి ఇక మారనుంది. ఏడాది ఎండాకాల నుంచే మాన్‌సరోవర్ యాత్ర మొదలు కానున్నట్టు విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలోతెలిపింది.
ఇంకా క్లారిటీ రాలేదు : ఇండిగో

భారత్ చైనా మధ్య విమానా సర్వీసులు ఎప్పటి నుంచి ప్రారంభం అవుతాయో అనే అంశంపై ఇంకా క్లారిటీ లేదు. ఇక ప్రభుత్వ నుంచి అనుమతి రాగానే..పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ నుంచి ఏమైనా సమాచారం రాగానే వెంటనే సర్వీసులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఇండిగో తెలిపింది. గతంలో, అంటే 2020 ఫిబ్రవరి 6 వరకు కూడా ఢిల్లీ నుంచి చైనాలోని చెంగ్డూ (Chengdu )కు, 2020 ఫిబ్రవరి 1వ తేదీ వరకు కలకత్తా నుంచి గాంగ్‌ఝ ( Guangzhou ) కు విమానాలు నడిపేది ఇండిగో. ఢిల్లీ నుంచి షాంఘాయ్ ( Shanghai ) విమానాలను కూడా 2020 లోనే నిలిపివేసింది ఇండిగో.
చైనాకు వెళ్లే విమానాల వివరాలు, ఈ సర్వీస్ ప్రారంభం అయ్యే తేదీలు, చార్జీలు ఇవన్నింటిపై త్వరలో ఒక క్లారిటే వచ్చే అవకాశం ఉంది. ఏమైనా అప్డేట్ ఉంటే ఇక్కడ అప్డేట్ చేస్తాము. సో స్టే ఇన్ టచ్.
ఈ Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.