International Kite Festivals : పతంగుల పండగను వైభవంగా నిర్వహించే 11 దేశాలు …

షేర్ చేయండి

 మకర సంక్రాంతి సందర్భంగా భారతదేశంలోని పలు ప్రాంతాల్లో పతంగులు పండగను నిర్వహిస్తారు. అయితే  కైట్ ఫెస్టివల్‌ అనేది మన భారత దేశానికి మాత్రమే పరిమితం ( International Kite Festivals ) అయిన వేడుక కాదు. అంతర్జాతీయంగా అనేక దేశాలు వివిధ సందర్బాలత్లో గాలిపటాల వేడుకను నిర్వహిస్తాయి. ఆ దేశాలు ఇవే.

1. అహ్మదాబాద్ , గుజరాత్

Ahmedabad Kite Festival
| అహ్మదాబాద్ కైట్ ఫెస్టివల్

భారత దేశంలో కైట్ ఫెస్టివల్ అనగానే ముందుగా అహ్మదాబాద్ గుర్తుకు వస్తుంది. ప్రతీ ఏడాది జనవరి నెలలో మకర సంక్రాంతి సమయంలో ఇక్కడ కైట్ ఫెస్టివల్ ( Ahmedabad Kite Festival ) నిర్వహిస్తారు. ఇందులో పాల్గొనడానికి విదేశాల నుంచి కూడా పతంగుల ప్రేమికులు వస్తుంటారు.

2. వో కైట్ ఫెస్టివల్, ఫ్యానో, డెన్మార్క్

a kite in the sky
| డెన్మార్క్‌లో గాలిపటం వేడుకలో ఒక గాలిపటం

ఐరోపాలోని డెన్మార్క్ దేశంలో ప్రతీ ఏడాది జూన్‌ నెలలో వో కైట్ ఫెస్టివల్ ( Wao Kite Festival, Denmark ) నిర్వహిస్తారు. ఈ సందర్బంగా అందమైన గాలిపటాలను ఎగురేవస్తారు. ఈ సమయంలో ఇక్కడ ప్రత్యేక పోటీలు, వర్క్ ‌షాపులు నిర్వహిస్తారు.

3. లాంగ్ బీచ్ కైట్ ఫెస్టివల్, కాలిఫోర్నియా, అమెరికా

California long beach kite festival
| కాలిఫోర్నియాలోని లాంగ్ బీచ్

అమెరికాలోని అనేక ప్రాంతాల్లో వివిధ సందర్భాల్లో గాలిపటాల వేడుకలను నిర్వహిస్తారు. కాలిఫోర్నియాలోని లాంగ్ బీచ్‌ కైట్ ఫెస్టివల్‌ అనేది ( Long Beach Kite Festival, CA, USA ) ఎండా కాలంలో నిర్వహిస్తారు. ఇందులో ప్రొఫెషనల్ ఫ్లైయర్స్‌తో పాటు గాలిపటాలు ఇష్టపడే వారు కూడా వెళ్తుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి చాలా మంది ఈ ఈవెంట్ అటెండ్ అవుతుంటారు.

4. బాలి కైట్ ఫెస్టివల్ , ఇండోనేషియా | Bali International Kite Festivals

Bali Kite Festival
| బాలి గాలిలో గాలి పటం ఎగువేస్తే…

బాలిలో జరిగే గాలిపటాల వేడుకను అటెండ్ అవ్వడానికి చాలా మంది ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఈ ఈవెంట్ ప్రతీ ఏడాది జులై నుంచి ఆగస్టు నెలలో జరుగుతుంది. బాలిలోని ( Bali Kite Festival ) అందమైన వినీలాకాశంలో ఎగిరే గాలిపటాలను చూడటం అదో అద్భుతం. చిన్నా పెద్దా అనే తేడాలేవీ లేకుండా అందరు అన్ని రకాలు పతంగులు ఎగురవేస్తారు. ఇక్కడ (  Bali Kite Festival ) ఎన్నో రకాల గాలి పటాలను మీరు చూడవచ్చు.

5. ఫ్రాన్స్ | France International Kite Festivals

Kite Festival, Berck-sur-Mer, France
| ఫ్రాన్స్‌‌లో గాలిపటం వేడుకను చూడటానికి వేలాది మంది సందర్శకులు వస్తారు.

ఐరోపాలోని ఫ్రాన్స్‌లో బెర్క్ సుర్‌మెర్‌లో ప్రతీ సంవత్సరవ ఏప్రిల్ నెలలో వైభవంగా కైట్ ఫెస్ట్ జరుగుతుంది. ఇందులో పాల్గొనడానికి వందల సంఖ్యలో పార్టిసిపెంట్స్ వస్తారు. వారి ప్రొఫెషనల్ ఫ్లైయింగ్ స్కిల్స్‌ను చూడటానికి, ఆకాశంలో ఎగిరే భారీ వెరైటీ గాలిపటాలను చూడటానికి వేలాది మంది వీక్షకులు వెళ్తుంటారు. ఇక్కడ కైట్‌ షోస్‌తో ( Kite Festival In France ) పాటు ఛాంపియన్‌షిప్ పోటీలు కూడా జరగుతుంటాయి.

6. నైజీరియా | Nigeria France International Kite Festivals

Kano Kite Festival, Nigeria
| నైజీరియాలో గాలిపటం ఆఫ్రికాలోనే చాలా ఫేమస్

నైజీరియాలోని కెనోలో జరిగే కైట్ ఫెస్టివల్ ( Kano Kite Festival, Nigeria ) గురించి బయటి ప్రపంచానికి అతంగా తెలియదు. ఇది ఈద్ ల్ ఫితర్ సమయంలో జరిగే వేడుక. ఒకవైపు పండగ వాతావరణం మరో వైపు ఆవాశంలో ఎగిరే గాలిపటం కాంబినేషన్‌ను చాలా మంది ఇష్టపడేలా ఉంటుంది. దీంతోపాటు సంగీతం, డ్యాన్స్ వంటి ఈవెంట్స్‌ కూడా రెగ్యులర్‌గా జరుగుతుంటాయి.

7.మొరాకో | Morocco France International Kite Festivals

Dakhla Kite Festival, Morocco
| భారతీయుల ఎక్కువగా వెళ్లే దేశాల్లో మొరాకో ఒకటి

ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టు జాబితాలో ర్యాంకు మెరుగు పరచుకున్న దేశం మొరాకో. ఆఫ్రికాలోనే అతి పెద్ద కైట్ ఫెస్టివల్ ఇక్కడ ( Morocco Kite Festival ) జరుగుతుంది. ఢఖ్లా ( Dakhla Town ) పట్టణంలోని అందమైన తీరంలో కైట్ ఫెస్టివల్ ప్రతీ ఏటా జరుగుతుంది. 

8. మిషిగన్, అమెరికా | Michigan Kite Festival

The Great Lakes Kite Festival, Michigan, USA
| అమెరికాలోె చాలా చోట్ల కైట్ ఫెస్టివల్స్ జరుగుతాయి.

అమెరికాలోని మిషిగన్‌లో ( Michigan, USA ) రాత్రి సమయంలో అద్భుతమైన గాలిపటం వేడుకలు జరుగుతాయి. మిషిగన్‌లోని ది గ్రేట్ లేక్స్ కైట్స్ ఫెస్టివల్ ( The Great Lake Kite Festival ) పేరిట ప్రతీ సంవత్సరం మే నెలలో నిర్వహిస్తారు. ఈ సమయంలో పగలు రాత్రి  అందమైన గాలిపటాలు సందడి చేస్తాయి. రాత్రి సమయంలో ఆకాశంలో నక్షత్రాలతో గాలిపటాలు పోటీ పడతాయి. 

9. దుబాయ్, యూఏఈ | Dubai France International Kite Festivals

dubai kite festival
| దుబాయి ఇప్పుడు పెట్రోల్ బావుల కోసం కాదు అక్కడి ఎంటర్‌టైన్మెంట్ కోసం పాపులర్ అవుతోంది.

ప్రపంచంలోని ప్రముఖ టూరిస్టు డెస్టినేషన్స్ లిస్టు తయారు చేస్తే అందులో దుబాయ్ ( Dubai ) ఖచ్చితంగా  ఉంటుంది. ఇక్కడ సంవత్సరం మొత్తం ఎన్నో వేడుకలు జరుగుతాయి. అలాగే మార్చి నెలలో దుబాయ్‌లో కైట్ ఫెస్టివల్ ( Dubai Kite Festival ) జరగుతుంది. అంతర్జాతీయంగా ఎంతో మంది ఇక్కడికి వచ్చి సంబరాలు చేసుకుంటారు.

10. ఆస్ట్రేలియా | Adelaide International Kite Festivals

International Kite Festivals
| ఆస్ట్రేలియా ఎంత అందమైనదో అక్కడి గాలిపటాలు కూడా అంతే అందంగా ఉంటాయి

ఆస్ట్రేలియాలోని సెమాపోర్‌లో మార్చి‌లో కైట్ ఫెస్టివల్ జరుగుతుంది. దీనిని అడిలైడ్ అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ పేరుతో ఈస్టర్ లాంగ్ వీకెండ్స్‌లో నిర్వహిస్తారు. చాలా కలర్‌ఫుల్ వేడుక ఇది.

11.జపాన్‌ | Sapporo International Kite Festivals

Sapporo International Kite Festival, Japan
| జపాన్‌లో సంప్రాదాయ శైలిలో తయారు చేసిన గాలిపటం

జపాన్ దేశంలో మే నెలలో సప్పోర అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. ఇక్కడ జపనీస్ సంప్రదాయ గాలిపటాలను ఎగరవేయడానికి అంతర్జాతీయంగా ఎంతో మంది ఇక్కడి వస్తుంటారు. కైట్ ఫెస్టివల్ కాస్త డిఫరెంటె‌గా అనిస్తుంది.

WEB STORY

గాలిపటాలు అనేవి మనిషి ఆశలకు ప్రతీరూపం లాంటివి. మనిషి శరీరం దారం అయితే మనసు పతంగ్ లాంటిది. మనసును గాలిలో తేలనిచ్చినా అది ఎప్పుడు మనిషి కంట్రోల్లోనే ఉండాలి అని చెప్పకనే చెబుతుంది. ఇంత మంచి ఫిలాసఫీ చెప్పిన తరువాత ఇక ఈ స్టోరిని ఇక్కడే ముగించేస్తే బాగుంటుంది కదా.

Most Popular Stories

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!
వరుణ్‌తేజ్‌‌లో ఒక మంచి ప్రయాణికుడు ఉన్నాడని తెలుసా? 25,000 అరుదైన మొక్కలు… వావ్ అనిపిస్తున్న ఎక్స్ పీరియం పార్క్ మన దేశంలో అతిపురాతనమైన 10 హిల్ స్టేషన్స్ | Oldest Hill Stations In India ప్రయాగ్‌రాజ్‌ వెళ్తే తప్పకుండా వెళ్లాల్సిన ఫుడ్ స్టాల్స్ ఇవే | Flavors of Prayagraj చిలుకూరు శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రియాంకా చోప్రా…రాజమౌళి సినిమా కోసమే అంటూ పుకార్లు