IRCTC : తిరుపతి వెళ్లాలనుకునే భక్తులకు శుభవార్త.. ఐఆర్సీటీసీ నుండి తక్కువ ధరలో టూర్ ప్యాకేజీ
IRCTC : తిరుపతి వెళ్లాలనుకునే భక్తులకు గుడ్ న్యూస్. ఐఆర్సీటీసీ టూరిజం తక్కువ ధరలో తిరుపతి టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ఈ యాత్రా ప్యాకేజీ తిరుమలతో పాటు శ్రీకాళహస్తి దేవాలయం, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయాన్ని కవర్ చేస్తుంది. ఈ టూర్ ప్యాకేజీని బుక్ చేసుకున్న వారికి రైలు టిక్కెట్లు బుక్ చేసుకునే టెన్షన్ ఉండదు. స్థానికంగా తిరిగేందుకు కూడా చింతించాల్సిన అవసరం లేదు. మీరు తిరుమల, శ్రీకాళహస్తి, తిరుచానూరులను ఒకే ప్యాకేజీలో చూసి రావచ్చు. ఈ ప్యాకేజీ ద్వారా మీరు తక్కువ ధరలో, హాయిగా పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చు. రైలు ప్రయాణం, భోజనం, హోటల్ వసతి ఈ ప్యాకేజీలో చేర్చబడ్డాయి. ఐఆర్సీటీసీ ఈ టూర్ ప్యాకేజీని నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ ద్వారా తిరుపతి అనే పేరుతో అందిస్తోంది.
యాత్ర వివరాలు
ఈ యాత్రా ప్యాకేజీ ప్రతిరోజూ అందుబాటులో ఉంటుంది. నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణం ఉంటుంది. ప్రయాణం లింగంపల్లి స్టేషన్ నుండి సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభమవుతుంది. మీరు సికింద్రాబాద్‌లో సాయంత్రం 6:10 గంటలకు, నల్గొండలో ఉదయం 7:38 గంటలకు ఈ రైలు ఎక్కవచ్చు. మరుసటి రోజు ఉదయం 5:55 గంటలకు మీరు తిరుపతి చేరుకుంటారు. అక్కడి నుండి మిమ్మల్ని హోటల్‌కు తీసుకెళ్తారు. ఫ్రెషప్ అయిన తర్వాత, మీరు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీకాళహస్తి దేవాలయ దర్శనం చేసుకుంటారు. రాత్రి తిరుపతిలోనే బస చేస్తారు.

తిరుమల దర్శనం, తిరుగు ప్రయాణం
మూడవ రోజు, మీరు తెల్లవారుజామున 2:30 గంటలకు హోటల్ నుండి తిరుమల బయలుదేరతారు. అక్కడ, మిమ్మల్ని ఉచిత దర్శనం క్యూ వద్ద దింపుతారు. దర్శనం పూర్తయిన తర్వాత, మధ్యాహ్నం మిమ్మల్ని తిరిగి హోటల్‌కు తీసుకెళ్తారు. సాయంత్రం 6:20 గంటలకు, మీరు తిరుపతి రైల్వే స్టేషన్ నుండి నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరుతారు. మరుసటి రోజు ఉదయం హైదరాబాద్ చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది.
ప్యాకేజీ ధరలు
ఈ యాత్రా ప్యాకేజీలో కంఫర్ట్ క్లాస్, స్టాండర్డ్ ఏసీ క్లాస్‌లు ఉన్నాయి.
కంఫర్ట్ ప్యాకేజీలో:
ఒకరికి: రూ. 13,950
ఇద్దరికి: రూ.10,860 (ఒకరికి)
ముగ్గురికి: రూ.9,080 (ఒకరికి)
స్టాండర్డ్ క్లాస్‌లో:
ఒకరికి: రూ.12,080
ఇద్దరికి: రూ.8,990 (ఒకరికి)
ముగ్గురికి: రూ.7,210 (ఒకరికి)
ఈ టూర్ ప్యాకేజీలో రైలులో స్లీపర్ లేదా 3ఏసీ క్లాస్ టిక్కెట్లు, తిరుపతిలో ఏసీ హోటల్ వసతి, భక్తుల ప్రయాణం ఒకే ఏసీ వాహనంలో, ఒకసారి అల్పాహారం, ప్రయాణ బీమా కవర్ చేయబడతాయి.
ప్యాకేజీలో చేర్చబడనివి
రైలులో ఆహారం లేదా అల్పాహారం మినహా ఇతర భోజనాలు, దర్శన టిక్కెట్లు, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం, టూర్ గైడ్ సేవలు, వ్యక్తిగత ఖర్చులు ఈ ప్యాకేజీలో చేర్చబడవు. హడావుడిగా తిరుపతి యాత్ర ప్లాన్ చేసుకునే వారికి ఈ యాత్రా ప్యాకేజీ చాలా ఉపయోగపడుతుంది. ఈ యాత్రా ప్యాకేజీ గురించి మరింత సమాచారం ఐఆర్సీటీసీ టూరిజం వెబ్సైట్ https://www.irctctourism.com/ లో చూడవచ్చు.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
