IRCTC : తక్కువ ధరలో గంగాసాగర్ యాత్ర.. మీ తల్లిదండ్రులకు ఐఆర్సీటీసీ స్పెషల్ గిఫ్ట్.. ప్యాకేజీ వివరాలివే
IRCTC : మన పెద్దలకు, తల్లిదండ్రులకు పుణ్యక్షేత్రాలను సందర్శించాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. అయితే, ఎక్కువ ఖర్చవుతుందని భావించి చాలా మంది ఆ ఆలోచనను విరమించుకుంటారు. అలాంటి వారి కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) చాలా తక్కువ ధరలో ఒక అద్భుతమైన టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్యాకేజీలో గంగాసాగర్, జగన్నాథ్, కాశీ, వైద్యనాథ్ టెంపుల్ వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చు. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
యాత్ర తేదీలు, గమ్యస్థానాలు
ఈ ప్యాకేజీ సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 22 వరకు అంటే 9 రాత్రులు, 10 రోజులు ఉంటుంది. ఈ ప్యాకేజీలో మీరు సందర్శించే ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు ఇవే:
గయ – విష్ణుపద ఆలయం
పూరీ – జగన్నాథ్ ఆలయం, కోణార్క్ – సూర్య దేవాలయం
కోల్‌కతా – గంగాసాగర్
వైద్యనాథ్ టెంపుల్
వారణాసి – కాశీ విశ్వనాథ్ ఆలయం
అయోధ్య – రామమందిరం, హనుమాన్‌గఢి, సరయు ఆరతి

రైలు ప్రయాణం, సౌకర్యాలు
ఈ టూర్ ప్యాకేజీలోని ట్రైన్ ఆగ్రా క్యాంట్ నుండి ప్రారంభమవుతుంది. గ్వాలియర్, ఝాన్సీ, ఒరాయ్, కాన్పూర్, లక్నో, అయోధ్య, వారణాసి వంటి స్టేషన్లలో ఎక్కవచ్చు, దిగవచ్చు. ఈ ప్యాకేజీలో రైలు ప్రయాణానికి 2AC, 3AC, స్లీపర్ క్లాస్ అందుబాటులో ఉన్నాయి. యాత్రికుల కోసం నిత్యం శుభ్రపరిచే సదుపాయం, టీ, కాఫీ, మినరల్ వాటర్ వంటివి కూడా కల్పిస్తారు.
ఈ టూర్ ప్యాకేజీలో లభించే ముఖ్య సౌకర్యాలు:
రైలు ప్రయాణం (2AC, 3AC, స్లీపర్ క్లాస్)
శాఖాహార భోజనం (బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్)
ఏసీ, నాన్-ఏసీ బస్సులలో సైట్‌సీయింగ్
హోటల్లో బస – షేరింగ్, నాన్-షేరింగ్ రూములు
ఇది కూడా చదవండి : Indian License : భారతీయ లైసెన్స్ ఈ 15 దేశాల్లో కూడా చెల్లుతుంది
ప్యాకేజీ ధరలు
ఎకానమీ క్లాస్ (స్లీపర్ క్లాస్):
పెద్దలకు: రూ. 18,460
పిల్లలకు (5-11 సంవత్సరాలు): రూ. 17,330
స్టాండర్డ్ క్లాస్ (3AC క్లాస్):
పెద్దలకు: రూ. 30,480
పిల్లలకు: రూ. 29,150
ఇది కూడా చదవండి : ప్రపంచ యుద్ధం వస్తే ఈ 10 దేశాలు చాలా సేఫ్
కంఫర్ట్ క్లాస్ (2AC క్లాస్):
పెద్దలకు: రూ. 40,300
పిల్లలకు: రూ. 38,700
బుక్ చేసుకోవడం ఎలా?
ఈ ప్యాకేజీని బుక్ చేసుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి:
ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్ www.irctctourism.com
ఐఆర్సీటీసీ ఆఫీస్ – టూరిజం భవన్, గోమతి నగర్, లక్నో
తక్కువ ఖర్చుతో అన్ని సౌకర్యాలతో పుణ్యక్షేత్రాల దర్శనానికి ఐఆర్సీటీసీ కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ తల్లిదండ్రులకు ఈ టూర్ ప్యాకేజీని బహుమతిగా ఇచ్చి వారిని సంతోషపెట్టండి.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.