Jagruti Yatra: భారతీయ రైల్వే బంపర్ ఆఫర్.. రూ. 25తో దేశం మొత్తం తిరగొచ్చు.. ఎలాగంటే
Jagruti Yatra: భారతదేశ సంస్కృతి, సహజ సౌందర్యం, చారిత్రక ప్రదేశాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు… ఇలాంటి దేశంలో ప్రయాణించాలనే కోరిక ఎవరికి ఉండదు? అలాంటి వారి కోసం కేంద్రం జాగృతి యాత్ర అనే ప్రత్యేక రైలును తీసుకొచ్చింది. ఈ రైలు 2008 నుంచి నడుస్తోంది. కానీ ఈ రైలు గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.
సాధారణ ప్రయాణం అంటే కేవలం ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి వెళ్ళడం. కానీ భారతదేశంలో ఒక రైలు ప్రయాణం ఉంది, అది మీ జీవితాన్నే మార్చేస్తుంది. అదే జాగృతి యాత్ర. ఇది కేవలం ఒక టూరిస్ట్ రైలు కాదు, ఇది దేశాన్ని నిర్మించే ఆలోచన ఉన్న యువతను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే ఒక గొప్ప కార్యక్రమం. 2008 నుంచి నడుస్తున్న ఈ యాత్ర గురించి చాలామందికి తెలియదు. అయితే, ఈ యాత్రలో పాల్గొనడానికి కొన్ని అర్హతలు ఉన్నాయి. ఇది కేవలం రూ. 25కు దేశం మొత్తం తిప్పే యాత్ర అని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని కూడా సంస్థ స్పష్టం చేసింది. ఈ యాత్రకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, అసలు ఖర్చు ఎంత, ప్రయాణ మార్గం ఎలా ఉంటుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

యాత్ర ప్రధాన లక్ష్యం
జాగృతి యాత్ర ప్రధాన ఉద్దేశ్యం యువతను వ్యాపారవేత్తలుగా మార్చడం. దేశంలోని చిన్న పట్టణాలు, గ్రామాల యువతను ప్రోత్సహించి, వారి ఆలోచనలకు ఒక రూపం ఇవ్వడం ఈ యాత్ర లక్ష్యం. అయితే, ఈ యాత్ర ఖర్చు గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ యాత్రకు దరఖాస్తు చేసుకోవడానికి కేవలం రూ. 100 రిజిస్ట్రేషన్ ఫీజు మాత్రమే చెల్లించాలి. మొత్తం యాత్ర ఖర్చు రూ. 1,00,000(పన్నులు అదనంగా) ఉంటుందని, అయితే ఆర్థికంగా వెనుకబడిన వారికి లేదా అర్హులైన వారికి అవసరాన్ని బట్టి స్కాలర్షిప్లు అందుబాటులో ఉంటాయని సంస్థ పేర్కొంది.
ఇది కూడా చదవండి : Vatican City : 800 మంది మాత్రమే ఉండే దేశం |15 నిమిషాల్లో చుట్టేయొచ్చు
యాత్ర వివరాలు, ప్రయాణ మార్గం
ఈ రైలు యాత్ర 15 రోజులు కొనసాగుతుంది. ఇందులో దాదాపు 500 మంది యువ ప్రయాణీకులకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ యాత్రలో పాల్గొనడానికి దరఖాస్తుదారుల వయస్సు 21 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ యాత్ర నవంబర్ 7, 2025న ముంబై నుండి ప్రారంభమవుతుంది. అక్కడి నుండి అహ్మదాబాద్, హుబ్లీ, బెంగళూరు, మధురై, శ్రీసిటీ, విశాఖపట్నం, బెహ్రంపూర్, నలంద, డియోరియా, ఢిల్లీ, జైపూర్ మీదుగా తిరిగి నవంబర్ 22న ముంబైకి చేరుకుంటుంది. ఈ యాత్రలో యువతకు అనేక వ్యాపార కేంద్రాలు, పారిశ్రామికవేత్తలు, సామాజిక నాయకులతో మాట్లాడే అవకాశం లభిస్తుంది.
ఇది కూడా చదవండి : Bhutan : భూటాన్ ఎలా వెళ్లాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
రిజిస్ట్రేషన్,ఎంపిక విధానం
ఆసక్తి ఉన్నవారు https://www.jagritiyatra.com/ అనే వెబ్‌సైట్‌ను సందర్శించి అక్టోబర్ 15, 2025 లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ యాత్రలో పాల్గొనే యువతను బహుళ-స్థాయి ఎంపిక ప్రక్రియ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తుదారులు ముందుగా ఆన్లైన్లో దరఖాస్తు ఫారమ్‌ను నింపి, ఆ తర్వాత వీడియో ఇంటర్వ్యూలో పాల్గొనవలసి ఉంటుంది. ఈ ప్రక్రియలో ఎంపికైన వారికి మాత్రమే యాత్రలో పాల్గొనే అవకాశం లభిస్తుంది.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.