Kedarnath Ropeway : ఇక 36 నిమిషాల్లో కేదార్‌నాథ్ ఆలయం చేరుకోవచ్చు…

షేర్ చేయండి

కేదార్‌నాథ్‌కు వెళ్లాలనుకునే తీర్థయాత్రికులకు శుభవార్త. ప్రయాణికుల కోసం ప్రతిష్ఠాత్మకమైన రోప్‌వే ప్రాజెక్టుకు (Kedarnath Ropeway) కేంద్ర మంత్రివర్గం అమోదం తెలిపింది. ఈ రోప్‌వే అందుబాటులోకి వస్తే దేశంలోనే అత్యంత పవిత్ర క్షేత్రాలలో ఒకటైన కేదార్‌నాథ్‌కు వెళ్లే భక్తుల శారీరక శ్రమ తగ్గనుంది.

ట్రెక్కింగ్‌కు పట్టే సమయం 8 నుంచి 9 గంటల నుంచి 36 నిమిషాలకు తగ్గనుంది.

ప్రాజెక్టు గురించి | Kedarnath Ropeway Project Overview

12.9 కిమీ పొడవైన కేదార్‌నాథ్‌ రోప్‌వే ఉత్తరాఖండ్‌లోని సోన్ ప్రయాగ్‌నుంచి కేదార్‌నాథ్‌ వరకు భక్తులను తీసుకెళ్లనుంది. డిజైన్, బిల్డ్, ఫినాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్‌ఫర్ మోడల్‌లో రూ.4,081 కోట్లతో ఈ రోప్‌వేను ఏర్పాటు చేయనున్నారు. 

భక్తులకు కలిగే ప్రయోజనాలు | Kedarnath Ropeway Benefits

Kedarnath Ropeway
ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుతం కేదార్‌నాథ్‌ వెళ్లాలి అనుకునే భక్తులు గౌరీ కుండ్ (Gauri Kund) లేదా ఇతర మార్గాల నుంచి సుమారు16 కిమీ ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ట్రెక్కింగ్ వద్దని భావించే ప్రయాణికులు హెలికాప్టర్, కంచెర గాడిదలు లేదా పల్లకిలో ఆలయానికి చేరుకుంటారు.

  • ఈ రోప్‌వే వల్ల ప్రయాణికుల డబ్బు, సమయం సేవ్ అవ్వనుంది. 
  • దీంతో పాటు ఇది పర్యావరణానికి తక్కువ హాని కలుగుతుంది. 
  • ఏడాది మొత్తం సోన్ ప్రయాగ్‌ (Sonprayag) నుంచి కేదార్‌‌నాథ్‌ వరకు ప్రయాణించే వెసులుబాటు కలుగుతుంది. 

12 జ్యోతిర్లింగాలలో (12 Jyotirling) భాగంగా తీర్థయాత్రికులు కేదార్‌‌నాథ్‌ ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ కొత్త రోప్‌వే వల్ల రుద్రప్రయాగ్‌లోని (Rudraprayag) 3,583 మీటర్ల ఎత్తైన ఈ ఆలయాన్ని చేరుకోవడం సులభతరం అవుతుంది. 

టూరిజానికి ఊతం | Boosting Tourism & Employment

Kedarnath Ropeway : ఇక 36 నిమిషాల్లో కేదార్‌నాథ్ ఆలయం చేరుకోవచ్చు…ఈ రోప్‌వే వల్ల ప్రయాణికులకే కాదు నిరుద్యోగులకు కూడా ప్రయోజనం కలగనుంది. నిర్మాణ దశ నుంచి ఆపరేషన్ స్టేజ్ వరకు నైపుణ్యం ఉన్న సిబ్బంది అవసరం ఉంటుంది. ఈ భారీ ప్రాజెక్టు ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించనుంది. 

దీంతో పాటు టూరిజం ఆధారిత సేవారంగం, ఫుడ్, బివరేజెస్ ఇతర రంగాలపై కూడా దీని ప్రభావం ఉంటుంది. పర్వత ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధికి కూడా ఈ రోప్‌వే దోహదం చేస్తుంది.

పర్యావరణ హితం

Environmental Considerations : కేదార్‌నాథ్ రోప్‌వే ప్రాజెక్టు అనేది పర్యావరణ హితమైన ప్రాజెక్టు. దీని వల్ల చమురు వినియోగం గణనీయంగా తగ్గుతుంది. దీంతో పాటు కఠినమైన కొండల్లో ట్రెక్కింగ్ (Trekking) చేసే వారి సంఖ్య తగ్గుతుంది. దీని వల్ల స్థానిక పర్యావరణానికి కూడా నష్టం కలగకుండా ఉంటుంది. 

మొత్తానికి 

కేదార్‌నాథ్‌ రోప్‌వే అనేది ఉత్తరాఖండ్‌లో (Uttarakhand) పర్యావరణ హితమైన పర్యాటకాన్ని ప్రోత్సాహించడంతో పాటు తీర్థ యాత్రికులకు శ్రమలేని ఆధ్యాత్మిక అనుభవాన్ని (Spiritual Experience) కలిగిస్తుంది. ప్రతీ ఏడాది లక్షలాది మంది భక్తులు సందర్శించే ఈ పవిత్రమైన క్షేత్రానికి రోప్‌వే రావడం అనేది మరింత మంది వేగంగా మహా శివుడిని (Lord Shiva) దర్శించుకునేే అవకాశాన్ని కలిగిస్తుంది.

📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!