2025 ఏప్రిల్ నెలలో తిరుమలతో పాటు తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామీ ఆలయంలో జరిగే ప్రత్యేక కార్యక్రమాల వివరాలు (April Events In Tirumala) మీ కోసం అందిస్తున్నాం. దీన్ని బట్టి మీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోండి.
తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవాలనే భక్తులకు ఏప్రిల్ మాసం చాలా ప్రత్యేం అని చెప్పవచ్చు. ఈ నెలలో ఎన్నో పండగలు, ప్రత్యేక కార్యక్రమాలు, వేడుకలు జరగనున్నాయి. ఈ పోస్టులో తిరుమల ఆలయంతో (Tirumala Temple) పాటు తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామీ ఆలయంలో ఏప్రిల్ మాసంలో జరిగే ప్రత్యేక కార్యక్రమాల వివరాలు మీ కోసం అందిస్తున్నాం. దీన్ని బట్టి మీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోండి.
ముఖ్యాంశాలు
తిరుమలలో ప్రత్యేక కార్యక్రమాలు | April Events In Tirumala
శ్రీరామ నవమి ఆస్థానం ( ఏప్రిల్ 6) : సాక్షాత్తు శ్రీహరియే కౌశల్యాపుత్రుడిగా జన్మించిన పర్వదినాన్ని శ్రీరామ నవమిగా (Sri Rama Navami) ప్రపంచ వ్యాప్తంగా వైభవంగా సెలబ్రేట్ చేసుకుంటారు.
- శ్రీరామ పట్టాభిషేక ఆస్థానం ( ఏప్రిల్ 7) : శ్రీరామచంద్రుడి పట్టాభిషేకం జరిగిన తరుణాన్ని పురుస్కరించుకుని నిర్వహించే కార్యక్రమం.
- సర్వ ఏకాదశి (ఏప్రిల్ 8) : ఈ రోజున భక్తులు ఉపవాస దీక్ష తీసుకుని ఆధ్మాత్మిక చింతనలో మునిగిపోతారు.
- వసంతోత్సవాలు (ఏప్రిల్ 10 నుంచి 12 వరకు ) : మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలో పూల అలంకరణ విశేషంగా ఆకట్టుకుంటుంది.
- చైత్ర పూర్ణమి గరడ సేవ & తుంబురు తీర్థ ముక్కోటి (ఏప్రిల్ 12): పౌర్ణమి రోజున ప్రత్యేక ఊరేగింపు, కార్యక్రమాలు జరుగుతాయి.
- భాష్యకార్ల ఉత్సవ ప్రారంభం (ఏప్రిల్ 23) : శ్రీరామానుజాచార్యుల గౌరవార్థం ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి.
- మతత్రయ ఏకాదశి (ఏప్రిల్ 24) : ఉపవాస దీక్ష తీసుకునే మరో పవిత్రమైన రోజు.
- పరుశురామ జయంతి & అక్షయ త్రితియ (ఏప్రిల్ 30) : అక్షయ త్రితియతో పాటు పరుశురాముడి జయంతి.
Read Also : Ravana Lanka : రావణుడి లంక ఎక్కడ ఉంది ? ఎలా వెళ్లాలి ? 5 ఆసక్తికరమైన విషయాలు
శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో ప్రత్యే కార్యక్రమాలు

ఏప్రిల్ నెలలో తిరుమలతో పాటు తిరుపతిలోని శ్రీ గోవిందరాజు స్వామి ఆలయంలో ( Sri Govindraja Swamy Temple) కూడా ప్రత్యేక కార్యక్రామాలు జరుగుతాయి. ఆ కార్యక్రమాల విశేషాలు :
- రోహిణ నక్షత్ర ఊరేగింపు (ఏప్రిల్ 3) : రుక్మిణీ, సత్యభామ ( Satyabhama) సమేత శ్రీ పార్థసారథి స్వామి వారు ఊరేగింపుగా బయల్దేరి భక్తులకు దర్శనం ఇస్తారు.
- శ్రీ ఆండాల్ అమ్మవారు ఊరేగింపు (ఏప్రిల్ 4 & 18) : శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక ఊరేగింపు ఉంటుంది.
- శ్రీ పట్టాభిరామ స్వామి ఊరేగింపు (ఏప్రిల్ 6) : శ్రీ రామ నవమి సందర్భంగా వైభవంగా ఊరేగింపు.
- గరుడ సేవ (ఏప్రిల్ 12) : శ్రీ గోవిందరాజ స్వామి వారిని గరుడ వాహనంపై ప్రత్యేకంగా ఊరేగింపుగా తీసుకెళ్తారు.
- శ్రావణ నక్షత్రం ఊరేగింపు (ఏప్రిల్ 22) : శ్రీ భూ సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ( Sri Kalayan Venkateshwara Swamy) వారి ఉరేగింపు.
- భాష్యకార్ల ఉత్సవం ( ఏప్రిల్ 23 -మే 2)
ఈ ప్రత్యేక రోజుల్లో (April Events In Tirumala) తిరుమలకు, తిరుపతిలోని ( Tirupati) గోవిందరాజు స్వామి వారి ఆలయానికి వెళ్తే స్వామి వార్ల దర్శనంతో పాటు ఆధ్మాత్మిక చైతన్యాన్ని పొందవచ్చు.
ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.