కుంభ మేళాలో తప్పిపోతే ఏం చేయాలి ? | Missing In Maha Kumbh 2025

షేర్ చేయండి

Maha Kumbh 2025: 2025 జనవరిలో ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రపంచంలోని అతి పెద్ద మేళా ప్రారంభం కానుంది. అయితే ఈ మేళాలో మీరు వాళ్లు ఎవరైనా తప్పిపోతే ఈ కింది చూచనలు పాటించవచ్చు.

Prayanikudu WhatsApp2
| ప్రతిరోజు వాట్స్ అప్ ద్వారా ట్రావెల్ కంటెంట్ తెలుగులో పొందాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి

ప్రపంచంలోనే అతిపెద్ద మేళా

మహకుంబ్ మేళా ( Maha Kumbh Mela 2025 ) అనేది ప్రపంచంలోనే అతిపెద్ద మేళా. భారత దేశంలోని ప్రముఖ నగరాలు అయినా హరిద్వార్ ( Haridwar ) , ఉజ్జయిని, ప్రయాగ్ రాజ్, నాసిక్‌లో ప్రతీ 12 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభ మేళా జరుగుతుంది. 2025 లో మహాకుంభమేళా జరగనుంది అనేది తెలిసిందే. ఈ మేళాకు కోట్లాది మంది వస్తూ ఉంటారు. అందులో చాలా మంది తప్పిపోవడం జరుగుతుంది. ఇలా మీతో లేదా మీ వాళ్లకు జరిగితే ఏం చేయాలో చదవండి.

మనషులను కలపనున్న ఏఐ | AI Usage In Maha Kumbh Mela 2025

Maha Kumbh 2025
మహాకుంభ మేళా

ఈ సారి మహాకుంభ మేళాలో అత్యాధునిక సాంకేతికతను వినయోగించనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌‌తో పని చేసే కెమెరాలను ( AI Cameras In Maha Kumbh Mela 2025 ) ఏర్పాటు చేస్తున్నారు. ఈ కెమెరాలు 45 కోట్ల మంది భక్తుల కోసం 24 గంటలూ పని చేయనున్నాయి. ఏఐ లైసెన్స్ ఉన్న కెమెరాలతో పాటు ఫేస్‌బుక్, ఎక్స్‌ లాంటి సామజిక మాధ్యమాల్లో కూడా తప్పిపోయిన వారి వివరాలు షేర్ చేయనున్నారు

ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళాలో ఎవరైనా తప్పి పోతే ?

ప్రయాగ్‌రాజ్‌లో కుంభ మేళా సమయంలో ఎవరైనా తప్పిపోతే ( Missing Persons Tracking In Prayagaj Maha Kumbha 2025 ) వెంటనే ఈ ఇష్యూని డిజిటల్ రిజిస్ట్రేషన్ చేయించాల్సి ఉంటుంది. దానికి ముందు డిజిటల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రతీ వ్యక్తికి ఒక ఐడీ కార్డును అందించడం జరుగుతుంది. ఇందులో ఒక వ్యక్తికి సంబంధించిన అన్ని వివరాలు , డిజిటల్ ట్రాకింగ్ ప్లానింగ్ కూడా ఉంటుంది. ఎవరైనా వ్యక్తి తప్పిపోతే వారిని డిజిటల్ ట్రాకింగ్ విధానం వల్ల కనుక్కోవచ్చు.

మహాకుంభమేళ కథనాలు

మిస్సింగ్ అయిన వారి కోసం స్పెషల్ సెంటర్


కుంభ మేళాలో భక్తుల కోసం యూపీ ప్రభుత్వం ఒక డిజిటల్ మిస్సింగ్ అండ్ ఫౌండ్ ( Missing and Found center in Kumbha Mela 2025) కేంద్రాన్ని స్థాపించింది. ఈ వ్యవస్థను వినియోగించి మీరు మీవాళ్ల జాడ కనుక్కోవచ్చు. తప్పిపోయిన వారిని వారి బంధు మిత్రుల వద్దకు చేర్చడమే డిజిటల్ సెంటర్ లక్ష్యం.

మహాకుంభ మేళా తేదీలు | Dates Of Maha Kumbh Mela 2025
మహాకుంభ మేళా అనేది 2025 జనవరి 13 వ తేదీన మొదలవుతుంది. ఫివ్రబరి 26న మహా శివరాత్రి వరకు కొనసాగుతుంది. మహా కుంభ మేళాలో స్నానం ఆచరించడం వల్ల పాపాలు తొలగి మోక్షం సిద్ధిస్తుంది అని భక్తుల విశ్వాసం.

గమనిక: ఈ వెబ్‌సైట్లో ప్రకటనలు కూడా ఉంటాయి. ముఖ్యంగా గూగుల్ యాడ్స్ ద్వారా ఈ ప్రకటనలు మీకు కనిపిస్తాయి. ఈ ప్రకటనలే మాకు ఆధారం. ఇందులో కొన్ని ప్రకటనలపై మీరు క్లిక్ చేస్తే మాకు ఆదాయం వస్తుంది.

Watch More Vlogs On : Prayanikudu

ఈ  Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.

ప్రపంచ యాత్ర గైడ్

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!