ఈ సోషల్ మీడియా కాలంలో ఎలాంటి వీడియో ఎప్పుడు వైరల్ అవుతుందో తెలియదు. ఇలా వైరల్ అవ్వడానికి కొంత మంది లేనిపోని రిస్కులు కూడా చేస్తుంటారు. ఇలాంటి ఒక వీడియోతో వైరల్ అయ్యాడు ఒక ట్రావెల్ వ్లాగర్ ( Viral Travel Vlogger ). ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ట్రైన్ ప్రయాణాలు అనేవి చాలా అందంగా ఉంటాయి ( సీటు దొరికితేనే ). ట్రైనుకు సంబంధించిన వ్లాగ్స్ ( Train Vlogs ) కూడా చాలా బాగుంటాయి. ప్రయాణంలో కనిపించే అందాలు, తినే భోజనం, కొత్త వారితో పరిచయం ఇవన్నీ కొత్తగా అనిపిస్తాయి. అయితే ఇప్పటి వరకు మీరు చూసిన ట్రైన్ వ్లాగ్స్ అసలే వ్లాగ్సే కాదు అసలైన వ్లాగ్ అంటే ఏంటో చూపిస్తాను అని అనుకున్నాడో ఏమో కానీ..రాహుల్ గుప్తా అనే వ్లాగర్ పెద్ద రిస్కే చేశాడు.
ఇది కూడా చదవండి : ఈ రాష్ట్రంలో ఒక్క రైల్వే స్టేషన్ కూడా లేదు..ఏ రాష్ట్రమో తెలుసా?
హిందీలో ట్రావెల్ వ్లాగ్స్ చేసే రాహుల్ గుప్తా ( Rahul Gupta Train Video ) ఇటీవలే బంగ్లాదేశ్‌లో ఒక ట్రైను ఎక్కాడు. ఎక్కడం అంటే నిజంగానే ట్రైన్ పైకి ఎక్కాడు. అది కూడా ట్రైన్ ఇంజిన్ పైకి ఎక్కి హారన్ దగ్గరికి వెళ్లి వీడియో చేశాడు. దీనికి సంబంధించిన వీడియో అతను తన ఇన్‌స్టాగ్రామ్‌లో ( Instagram ) పోస్ట్ చేయగా అది 19 మిలియన్ల వ్యూస్ సంపాదించింది. నిజంగా ఈ నెంబర్ అనేది అతనికే కాదు చాలా మందికి ఎంకరేజ్‌మ్మెంట్‌లా పని చేసే అవకాశం ఉంది.
నిజానికి బంగ్లాదేశ్‌లో ట్రైను పైన కూర్చుని ప్రయాణించడం సాధారణమైన విషయమే. చాలా మంది ప్రమాదవశాత్తు కింద పడి చనిపోయిన వారు కూడా ఉన్నారు.
ఇన్సురెన్స్ కూడా రాదు | Risky Train Video
ఈ వీడియో చాలా మందికి థ్రిల్లింగ్‌గా అనిపించింది. లాంటి ప్రాణాలు తీసే డ్రిల్స్ థిల్లింగ్‌గానే ఉన్నా..ఎండింగ్ మాత్రం మన చేతిలో ఉండదు. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. ఎందుకంటే ఇలాంటి వీడియోలు తీయడం అనేది ప్రాణాలతో చెలగాటం ఆడటం లాంటిదే. పైగా పోతే ఇన్సురెన్స్ ( Insurance ) కూడా రాదు.
నెటిజెన్ల రియాక్షన్
ఈ వీడియోను చాలా మంది అతన్నితిట్టారు, పొగిడారు, సెటైర్లేశారు . అందులో ఒక యూజర్ అయితే అన్నా నీకు సీటు దొరకలేదా అందుకే పైకి ఎక్కావా ? అని కామెంట్ చేశాడు.
మరో యూజర్ ” అది కాదు ఇప్పుడు లోకోపైలెట్ హారన్ కొడితే నీ గతేంటి ? ఊరంతా వినిపించే ఆ సౌండ్‌ను నీ బాడీ తట్టుకోగలదా ?” అని ప్రశ్నించాడు.
ఇది కూడా చదవండి : ఈట్రైనుకు టికెట్ లేదు, టీసీ లేడు: 75 ఏళ్ల నుంచి ఫ్రీ సేవలు | 10 Facts About Bhakra Nangal Train
మరో యూపర్ భయ్యా నువ్వు టికెట్ కొనలేదా ? కొంటే ఉండాల్సింది ట్రైన్ లోపల కదా మరి బయట ఉన్నావేంటి అని అడిగాడు.
ఈ వీడియోను ఎంటర్‌టైన్మెంట్ యాంగిల్లో చూడలేము. ఎందుకంటే ఇది చాలా రిస్కీ స్టంట్. ట్రైన్ ప్రయాణాన్ని ( Train Journey ) ఎంజాయ్ చేయడం మంచిదే. కానీ జీవితాన్ని ఫణంగా పెట్టడం మాత్రం మంచిది కాదు కదా. ట్రైన్ ప్రయాణాన్ని ఎంజాయ్ చేసేందుకు వందలాది మార్గాలు ఉన్నాయి. అందులో ఏదోక మార్గం ఎంచుకుంటే బెస్ట్ కదా.. ఏమంటారు?
ఈ Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.