Flight Tickets : మీరు ఏదైనా టూర్లకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా ? విమానంలో ప్రయాణించడం మంచిదని భావిస్తున్నారా ? అయితే ఈ ఆఫర్ మీ కోసమే. మీరు కేవలం బస్సు టికెట్ ధరకే విమానంలో ప్రయాణించవచ్చు. ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో మరోసారి బంపర్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. ఇది ‘గెట్ అవే సేల్’ పేరుతో ఒక స్పెషల్ లిమిటెడ్ టైం తగ్గింపు విక్రయాన్ని ప్రకటించింది. దీని ద్వారా కేవలం రూ. 1199 నుండే విమాన టికెట్లను అందిస్తోంది. ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ తన వినియోగదారుల కోసం ఎంపిక చేసిన దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో ప్రత్యేక ఒక-మార్గపు ఛార్జీలను అందుబాటులోకి తెచ్చింది. ఇది అదనపు సౌకర్యాలపై కూడా ప్రత్యేక తగ్గింపులను ఇస్తోంది.
టికెట్ బుకింగ్ వివరాలు
టికెట్లను ఇండిగో వెబ్సైట్ goindigo.in ద్వారా, లేదా ఇండిగో మొబైల్ యాప్ ద్వారా, లేదా ఇండిగో 6ఈస్కై ద్వారా, లేదా ఇండిగో వాట్సాప్ 7065145858 ద్వారా, లేదా ట్రావెల్ పార్టనర్స్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఇది లిమిటెడ్ టైం ఆఫర్. టికెట్ బుకింగ్స్ జూన్ 4, 2025 న ప్రారంభమయ్యాయి. టికెట్లు జూన్ 9, 2025 రాత్రి 23:59 గంటల వరకు బుకింగ్ కోసం అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే బుక్ చేసుకున్న వాళ్లు జూన్ 12, 2025 నుండి సెప్టెంబర్ 24, 2025 వరకు ఎప్పుడైనా ప్రయాణించవచ్చు. మీరు మీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకుని, మీకు అనుకూలమైన సమయంలో టికెట్లను బుక్ చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి : UAE: యూఏఈలో తప్పకుండా చూాడాల్సిన 10 ప్రదేశాలు
దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో ఛార్జీల వివరాలు
ఈ ఆఫర్ కింద, దేశీయ మార్గాల్లో ఒక-మార్గపు విమాన టికెట్ల ధరలు రూ. 1199 నుండే ప్రారంభమవుతున్నాయి. అంతర్జాతీయ మార్గాల్లో టికెట్ల ధరలు రూ. 4,599 నుండే ప్రారంభమవుతున్నాయి. ముంబై-విజయవాడ, కడప-హైదరాబాద్, గోండియా-హైదరాబాద్, సేలం-హైదరాబాద్, కడప-విజయవాడ వంటి మార్గాల్లో విమాన టికెట్ల ధరలు కూడా రూ. 1199 కే అందుబాటులో ఉన్నాయి. ఇది పర్యాటకులకు మరియు సాధారణ ప్రయాణికులకు ఒక మంచి అవకాశం.
ఇది కూడా చదవండి : ఈ రాష్ట్రంలో ఒక్క రైల్వే స్టేషన్ కూడా లేదు..ఏ రాష్ట్రమో తెలుసా?
అదనపు సౌకర్యాలపై ప్రత్యేక తగ్గింపులు!
ఇండిగో అదనపు సౌకర్యాలపై కూడా ప్రత్యేక తగ్గింపులను అందిస్తోంది. దేశీయ మార్గాల్లో, ముందుగా బుక్ చేసుకున్న అదనపు లగేజీపై 50 శాతం వరకు తగ్గింపు ఇస్తోంది. ముందుగా బుక్ చేసుకున్న భోజనం పై కూడా 50 శాతం తగ్గింపు అందిస్తోంది. ఎమర్జెన్సీ ఎక్సెల్ సీట్లు రూ. 500 నుండి ప్రారంభమవుతాయి. మీరు రూ. 299 ప్లాన్‌ను తీసుకుంటే, రద్దు ఛార్జీలు సున్నాగా ఉంటాయి. ఈ ఆఫర్ ఇండిగో నడుపుతున్న నాన్-స్టాక్, మల్టీ-సిటీ, కనెక్టింగ్ విమానాలకు మాత్రమే వర్తిస్తుంది. కోడ్‌షేర్ విమానాలకు వర్తించదు. పూర్తి వివరాల కోసం, ఇండిగో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని కంపెనీ తెలిపింది.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.