Medaram Jatara Circuit : నాలుగు జిల్లాలను కదిలించే ట్రావెల్ సర్క్యూట్
Medaram Jatara Circuit : 2026 జనవరి 28 నుంచి 31 వరకు జరిగే ఈ జాతర సమయంలో తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో పర్యాటకుల తాకిడి గణనీయంగా పెరుగుతుంది. ఈ రోజుల్లో లక్షలాది మంది భక్తులు రోడ్డు, రైలు, బస్సుల ద్వారా మేడారం వైపు కదులుతారు
నాలుగు జిల్లాలను కదిలించే ట్రావెల్ సర్క్యూట్తె లంగాణలో జరిగే మేడారం జాతర కేవలం ఒక గిరిజన జాతర మాత్రమే కాదు. ఇది ఒక కంప్లీట్ ట్రావెల్ సర్క్యూట్‌ను క్రియేట్ చేస్తుంది.
2026 జనవరి 28 నుంచి 31 వరకు జరిగే ఈ జాతర సమయంలో తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో పర్యాటకుల తాకిడి గణనీయంగా పెరుగుతుంది. ఈ రోజుల్లో లక్షలాది మంది భక్తులు రోడ్డు, రైలు, బస్సుల ద్వారా మేడారం వైపు కదులుతారు.
ములుగు : జాతర సందడి మొత్తం ఇక్కడే
Mulugu: Jatara Heart Point
మేడారం గ్రామం ములుగు జిల్లాలో ఉంది. ఈ జిల్లా మొత్తం సర్క్యూట్లో సెంట్రల్ పాయింట్లా పనిచేస్తుంది. తాత్కాలిక క్యాంపులు, పార్కింగ్ జోన్లు, మెడికల్ సదుపాయాలు, కంట్రోల్ రూమ్స్ అన్నీ ఇక్కడే ఏర్పాటు చేస్తారు. అటవీ మార్గాల్లో భక్తులు నడిచి దర్శనానికి వెళ్లడం ఈ జాతర ప్రత్యేక ఆకర్షణ.
- ఇది కూడా చదవండి : Medaram Special Trains : మేడారం జాతరకు 28 ప్రత్యేక జనసాధారణ రైళ్లు
వరంగల్ : కీలక ప్రవేశ మార్గం |Medaram Jatara Circuit
Warangal: Major Entry Gateway
వరంగల్ జిల్లా మేడారం జాతరకు అతిపెద్ద ఎంట్రీ పాయింట్‌గా పని చేస్తుంది. వరంగల్ నుంచి ములుగుకు బస్సులు, ప్రైవేట్ వాహనాలు, ఆర్టీసీ స్పెషల్ సర్వీసులు విస్తృతంగా నడుస్తాయి. ఈ రూట్లలో ట్రాఫిక్ మేనేజ్మెంట్ చాలా కీలకమైన అంశం.
జయశంకర్ భూపాలపల్లి – ఏటూర్‌నాగారం బెల్ట్
Jayashankar Bhupalpally and Eturnagaram Belt
మేడారం నుంచి ఏటూర్‌నాగారం అటవీ ప్రాంతం, భూపాలపల్లి వైపు రూట్లు భక్తుల రాకపోకలకు తెరవబడతాయి. ఈ బెల్ట్‌లో ఫారెస్ట్ రోడ్లు, గిరిజన తండాలు, నదీ జలధారలు కనిపిస్తాయి. భక్తుల రద్దీ కారణంగా వాహనాల గమన వేగం నెమ్మదిగా ఉంటుంది.
భద్రాద్రి కొత్తగూడెం – భద్రాచలం కారిడార్
Bhadradri Kothagudem: Bhadrachalam Corridor
చాలా మంది భక్తులు మేడారం దర్శనం అనంతరం భద్రాచలం వైపు ప్రయాణిస్తారు. ఈ జిల్లా గోదావరి నదీ పరిసరాల్లో ఉన్న తీర్థయాత్రలతో ప్రసిద్ధి. అలాగే పాపికొండలు వెళ్లేందుకు కూడా ఇక్కడి నుంచే చాలామంది ప్లాన్ చేస్తారు. అందువల్ల మేడారం జాతర సమయంలో ఈ ప్రాంతంలో కూడా పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.
మొత్తంగా ఈ నాలుగు జిల్లాలకు మేడారం జాతర కారణంగా పర్యాటకుల తాకిడి భారీగా ఉంటుంది. అయితే స్థానిక అధికారులు ముందుగానే ఏర్పాట్లు చేయడం వల్ల దర్శనాలు, ప్రయాణాలు స్మూత్‌గా జరిగే అవకాశం ఉంటుంది. భక్తులు కూడా అధికారుల సూచనలు పాటిస్తే, ఈ అతిపెద్ద గిరిజన జాతర ప్రశాంతంగా, విజయవంతంగా సాగుతుంది.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
▶️ వీడియో చూడండి : 3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు – ప్రత్యేక వీడియో
