నేటి నుంచి తెలంగాణ చిన్న కుంభ మేళా..మినీ మేడారం | Mini Medaram 2025

షేర్ చేయండి

తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే జాతరలో మేడారం జాతర కూడా ఒకటి. ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందింది. 2024 లో మేడారం జాతర వైభవంగా జరగగా తాజాగా మినీ మేడారం (Mini Medaram 2025) జాతర ప్రారంభమైంది. ఈ జాతర విశేషాలు మీకోసం.

Mini Medaram Jatara 2025
| సమ్మక్క -సారలమ్మ ఆలయం ముందు భక్తులు

ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభ మేళా ( Maha Kumbh Mela 2025 ) జరుగుతుండగా తెలంగాణలో మినీ కుంభ మేళా ప్రారంభమైంది. మేడారంను తెలంగాణ కుంభమేళా అని కూడా పిలుస్తుంటారు.

సందడి షురూ

Mini Medaram Jatara 2025
| మినీ మేడారం జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బంగారం నైవైద్యంగా సమర్పిస్తారు.

తెలంగాణలోని ములుగు జిల్లా (Mulugu) తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో మేడారం జాతర ప్రతీ రెండేళ్లకు ఒకసారి జరుగుతుంది. 2024 లో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ( Sammakka Sarakka ) జరగగా 2025 ఫిబ్రవరి 12న మినీ మేడారం జాతర సందడి షురూ అయింది.

నాలుగు రోజు సందడి

Mini Medaram Jatara 2025
| అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవార్లకు పూజలు చేస్తారు భక్తులు.

మినీ మేడారం జాతర అనేది 12వ తేదీ ప్రారంభమై 15వ వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో భక్తులు సమ్మక్కను, సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఇద్దరమ్మల త్యాగాలను స్మరించుకుంటారు.

వీడియో : సమ్మక్క -సారాలమ్మ కథ..మేడారం జాతర విశేషాలు..

పొరుగు రాష్ట్రాల నుంచి కూడా

Mini Medaram Jatara 2025
| జంపన్నవాగుకు వెళ్లేదారి..

మినీ మేడారం (Medaram) జాతరకు 20 లక్షల మంది వరకు భక్తులు రానున్నట్టు అధికారులుు అంచనా వేస్తున్నారు.కేవలం తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా పొరుగు రాష్ట్రాలు అయిన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్,ఒడిషా, మధ్య ప్రదేశ్ నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంది. 

Prayanikudu
📣| ప్రయాణికుడు వాట్సాప్ అప్డేట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రభుత్వ ఏర్పాట్లు

Mini Medaram Jatara 2025
| జంపన్న వాగు

భారీగా తరలి వచ్చే భక్తుల కోసం అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిన్న జాతర ( Mini Medaram 2025) కోసం ప్రభుత్వం (Telangana Govt) ప్రత్యేక నిధులు కేటాయించింది. భక్తులకు తాగునీరు, పరిశుభ్రమైన పరిసరాలు, టాయిలెట్స్ వంటి ఏర్పాట్లు చేశారు. భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు.

ఏ రోజు ఏంటంటే ?

Mini Medaram Jatara 2025
| అమ్మవారికి మొక్కులు చెల్లిస్తున్న భక్తులు, సిబ్బంది

12వ తేదీన బుధవారం మండమెలిగే పండగ, గురువారం మండమెలిగె పూజలు, శుక్రవారం భక్తులు తమ మొక్కలు చెల్లించడం, శనివారం చిన్న జాతర (Mini Medaram 2025) ఉంటుంది.

మొక్కుగా బంగారం -Sammakka Sarakka Jatara

Mini Medaram Jatara 2025
| నైైవేద్యంగా సమర్పించడానికి తలపై బంగారాన్ని తీసుకువచ్చిన భక్తుడు . బెల్లాన్ని ఇక్కడ బంగారంగా పిలుస్తారు.

మినీ మేడారంలో భక్తులు బెల్లాన్ని బంగారంగా భావిస్తూ అమ్మవారికి ముక్కులు చెల్లిస్తారు. కొంత మంది తమ బరువుకు సమానంగా కూడా బెల్లాన్ని అమ్మవారికి సమర్పిస్తారు.

ఎలా వెళ్లాలి ?

Mini Medaram Jatara 2025
| మేడారం గ్రామానికి వెళ్లే దారి

How to Reach Mini Medaram 2025 ? : మేడారం జాతర వెళ్లాలి అనుకునే భక్తుల కోసం తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయి.మీరు సొంత వాహనంలో వస్తే మాత్రం వరంగల్ దారిలో ములుగు జిల్లాకు చేరుకుని అక్కడి నుంచి వచ్చేయవచ్చు.

మినీ మేడారం జాతర ఎప్పుడు జరుగుతంది ? ఎలా వెళ్లాలి ? జాతర ప్రత్యేకతలేంటి ? | Mini Medaram Jatara 2025

📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ట్రెండింగ్ వార్తలు కోసం NakkaToka.com విజిట్ చేయండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!