Winter Photography : స్వర్గంలాంటి అందాలు.. వర్షాకాలంలో తక్కువ బడ్జెట్లో ఫోటోషూట్‌కు బెస్ట్ ప్లేసెస్ ఇవే
Winter Photography : ఈ రోజుల్లో టూరిజం అనేది ఒక అభిరుచిగా మారింది. చాలామంది పర్యటనలకు వెళ్లి, అక్కడి దృశ్యాలను తమ కెమెరాల్లో జ్ఞాపకాలుగా భద్రపరచుకుంటారు. అయితే, ఫోటోగ్రాఫర్లకు, ఫోటోగ్రఫీ ప్రియులకు అనువైన పర్యాటక ప్రదేశాలు మన దేశంలో చాలా ఉన్నాయి. ముఖ్యంగా చలికాలంలో కొన్ని ప్రదేశాలు అద్భుతమైన ఫోటోలను అందించడానికి సిద్ధంగా ఉంటాయి. అలాంటి కొన్ని ఫోటోజెనిక్ ప్రదేశాల గురించి ఈరోజు తెలుసుకుందాం, ఇవి తక్కువ బడ్జెట్లో కూడా మంచి ఫోటోలను ఇస్తాయి.
అద్భుతమైన జలపాతాలు, ప్రకృతి అందాలు
గోవాలోని అత్యంత ఆకర్షణీయమైన జలపాతాలలో ఒకటైన దూద్‌సాగర్ జలపాతం (Dudhsagar Falls) చూడదగిన ప్రదేశం. వర్షాకాలంతో పాటు చలికాలంలో కూడా ఈ ప్రదేశం మరింత ఆహ్లాదకరంగా, అందంగా మారుతుంది. ఇది ఫోటోగ్రఫీ ప్రియులకు నిజంగా స్వర్గం. ఈ సమయంలో ఇక్కడ సినీమాటిక్ స్టైల్ (Cinematic Style) ఫోటోలు తీసుకోవచ్చు.

అలాగే, పశ్చిమ కనుమలలో (Western Ghats) ఉన్న భగవాన్ మహావీర్ వైల్డ్‌లైఫ్ శాంక్చురీ (Bhagwan Mahavir Wildlife Sanctuary) ప్రకృతి ప్రేమికులను, ఫోటోగ్రాఫర్లను ఆకర్షిస్తుంది. వర్షాకాలంలోనే కాదు తరువాత కూడా ఈ అభయారణ్యం పచ్చదనంతో కళకళలాడుతుంది. ఇక్కడ అడవి పూల గుండా ప్రసరించే సూర్యకాంతి, తెలిమంచులో తడిసిన ఆకులు ఇవన్నీ మీ కెమెరాకు బాగా పని చెబుతాయి. కెమెరా చేతబట్టి సీతాకోకచిలుకలు, జింకలు, ప్రత్యేకమైన పక్షుల చిత్రాలను ఇక్కడ బంధించవచ్చు.
ఇది కూడా చదవండి : UAE: యూఏఈలో తప్పకుండా చూాడాల్సిన 10 ప్రదేశాలు
చారిత్రక కట్టడాలు, ప్రశాంతమైన కొండలు
గోవాలోని (Goa) చారిత్రక పాత చర్చిలైన బాసిలికా ఆఫ్ బామ్ జీసస్ (Basilica of Bom Jesus), సే కేథెడ్రల్ (Se Cathedral) చలికాలంలో కనువిందు చేస్తాయి. ఇక్కడి విశాలమైన భవనాలు, తేమతో కూడిన కారిడార్ మార్గాలు చాలా ఆకట్టుకుంటాయి. ఫోటోగ్రాఫర్లకు ఫోటోషూట్ కోసం ఈ చర్చిలు ఉత్తమ ఎంపిక. ఇక్కడ తీసిన చిత్రాలు అద్భుతంగా కనిపిస్తాయి.
మరోవైపు, అరంబోల్ కొండ (Arambol Hill) పచ్చటి ప్రకృతి దృశ్యంతో పాటు, సముద్ర వీక్షణను అందిస్తుంది. ఇక్కడ సందర్శకులు మేఘాలతో పాటు అందమైన సముద్ర దృశ్యాన్ని ఆస్వాదించవచ్చు. ప్రశాంతమైన అలల చిత్రాలను తమ కెమెరాలలో బంధించవచ్చు.
ఇది కూడా చదవండి : Azerbaijan అజర్ బైజాన్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ? 10 టిప్స్!
సిటీ లైఫ్‌కు దూరంగా ప్రశాంతమైన సరస్సు
నగర జీవితం నుంచి విశ్రాంతి పొందాలనుకునే వారికి అందమైన మాయెం సరస్సు (Mayem Lake) అనువైనది. ఇది అద్భుతమైన కొండలు, కొబ్బరి తోటల మధ్య ఉంది. వర్షాకాలంలో, ఈ సరస్సు పూర్తిగా నిండిపోయి ఫోటోగ్రాఫర్లను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఈ ప్రదేశం మీకు గొప్ప ఫోటోగ్రఫీ అనుభవాన్ని అందిస్తుంది. ఈ ప్రదేశాలన్నీ తక్కువ బడ్జెట్లో అద్భుతమైన ఫోటో మెమొరీలను సొంతం చేసుకోవడానికి సహాయపడతాయి.
టూర్ ప్లాన్ చేస్తున్నారా ? తక్కువ ధరలో మెరుగైన ప్యాకేజీ కావాలంటే వాట్సాప్‌లో సంప్రదించండి. హైదరాబాద్ నుంచి హిమాలయాల వరకు…కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు పలు ఆప్షన్స్ అందిస్తాము.


తెలుగు పాఠకుల కోసం గమనిక: ఈ బ్లాగ్ కేవలం కోసం మాత్రమే. ట్రావెల్ ప్యాకేజీలు , వివరాలు భాగస్వామి సంస్థల ద్వారా అందించబడతాయి.

Disclaimer: This article is for informational purposes only. Prayanikudu.com shares verified travel updates and trip ideas collected from trusted sources and travel partners. We do not operate or sell any packages directly, nor are we responsible for bookings, prices, or any changes made by travel operators. All bookings, payments, and communication happen directly between travelers and the respective tour companies or agents. Readers are advised to verify all details before confirming any trip.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
