జూపార్క్‌లో పులిని దత్తత తీసుకుంటే ఇంటికి తీసుకెళ్లవచ్చా? ట్యాక్స్ బెనిఫిట్ వస్తుందా ? | Zoo Animal Adoption
Zoo Animal Adoption : హైదరాబాద్‌లో ఉన్న నెహ్రూ జూపార్క్ (Nehru Zoological Park)లో వైల్డ్ యానిమల్‌ను దత్తత తీసుకోవడం అంటే దానిని ఇంటికి తీసుకెళ్లడం కాదు అని జంతుప్రదర్శనశాల అధికారులు స్పష్టంగా చెబుతున్నారు.
ఇది వన్యప్రాణుల సంరక్షణ కోసం రూపొందించిన ఒక ప్రత్యేక కార్యక్రమం మాత్రమే.
ఈ స్కీమ్ ద్వారా పబ్లిక్, ప్రైవేట్ సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు జూలో ఉన్న జంతువుల ఆహారం, వైద్యం, సంరక్షణ ఖర్చులకు ఆర్థిక సహాయం అందించవచ్చు.
జూలో ఉన్న ఏనుగులు, పులులు, సింహాలు, ఎలుగుబంట్లు, పక్షులు, సరీసృపాలు సహా వివిధ జంతువులను దత్తత తీసుకునే అవకాశం ఉంది. ఈ దత్తతను రోజువారీగా, నెలవారీగా లేదా వార్షికంగా ఎంచుకోవచ్చు.
దత్తత తీసుకున్న జంతువుల ఆహారం, మెడికల్ కేర్, ఎన్‌క్లోజర్ మెయింటెనెన్స్, సీజనల్ అరేంజ్మెంట్స్ అన్నింటినీ జూపార్క్ అధికారులు, శిక్షణ పొందిన సిబ్బందే నిర్వహిస్తారు.
- ఇది కూడా చదవండి : జూపార్క్‌కు వెళ్లే ముందు ఇవి తెలియకపోతే టైమ్ వేస్ట్ అవుతుంది | Hyderabad Zoo Entry Fee ,Timings
పులిని దత్తత తీసుకుంటే ఇంటికి తీసుకెళ్లవచ్చా?
ఇది సరదాగా చాలామంది అడిగే ప్రశ్న. కానీ మీరు ఎంత డబ్బు చెల్లించి దత్తత తీసుకున్నా, పులినో, సింహాన్నో ఇంటికి తీసుకెళ్లడం అసాధ్యం. అవి జూపార్క్‌లోని నిర్దిష్ట ఎన్‌క్లోజర్‌లోనే ఉంటాయి.

మీరు చేయేది వాటి నిర్వహణ ఖర్చులకు సహాయం చేయడమే. జంతువుల భద్రత, సంరక్షణ మొత్తం నిపుణుల చేతుల్లోనే ఉంటుంది.
ఈ జంతు దత్తత పథకాన్ని CSR (Corporate Social Responsibility) కార్యకలాపాల్లో కూడా చేర్చారు. కంపెనీలు, సంస్థలు ఈ స్కీమ్‌కు కంట్రిబ్యూట్ చేస్తే Income Tax Act 80G కింద పన్ను రాయితీ కూడా లభిస్తుంది.
కొన్ని సందర్భాల్లో దత్తత తీసుకున్న వారి పేరు జంతువు ఎన్‌క్లోజర్ ముందు డిస్ప్లే చేస్తారు. అంతేకాదు, దత్తత తీసుకున్న వారికి ఉచిత జూపార్క్ ఎంట్రీ టికెట్లు, గెస్ట్ హౌజ్ వంటి ప్రత్యేక సదుపాయాలు కూడా అందుబాటులో ఉంటాయి.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ దత్తత కార్యక్రమం నగర ప్రజల్లో వన్యప్రాణులపై మమకారం పెంచడమే కాకుండా, సంరక్షణకు ఆర్థిక భరోసాను కూడా కల్పిస్తుంది.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
▶️ వీడియో చూడండి : 3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు – ప్రత్యేక వీడియో
