ఫ్లెమింగో ఫెస్టివల్‌కు ఎలా వెళ్లాలి ? టైమింగ్, టికెట్ ధర వివరాలు -Nelapattu Bird Sanctuary Guide

Share This Story

రెండు రెక్కలు…వేల కిమీ ప్రయాణం…అలసిసొలసిపోయే వలస పక్షులకు ఒక అవాసంగా మారుతుంది నేలపట్టులోని పక్షుల సంరక్షణ కేంద్రం ( Nelapattu Bird Sanctuary ) . ఇలా ప్రతీ సంవత్సరం వలస వచ్చే పక్షుల కోసం ఫ్లెమింగో ఫెస్టివల్ ( Flamingo Festival ) అనే పేరుతో ఒక పక్షుల పండగను నిర్వహిస్తారు. ఈ ఫెస్టివల్‌కు ఎలా వెళ్లాలి ? ఎప్పుడు వెళ్లాలి ? మరిన్ని విశేషాలు ఈ స్టోరీలో చదవండి.

ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వలస పక్షులు తిరుపతికి సమీపంలో ఉన్న నేలపట్టు ప్రాంతానికి సంతానోత్పత్తి కోసం ప్రతీ ఏడాది వస్తుంటాయి. ప్రతీ ఏడాది అక్టోబర్ నెల నుంచి ఈ పక్షులు నేలపట్టు పరిసర ప్రాంతాలకు చేరుకోవడం మొదలు పెడతాయి. నేలపట్టులో అవి గూళ్లు కట్టుకుని నివాసం ఏర్పాటు చేసుకుంటాయి. వీటి కోసం 1976 లో నేలపట్టులో పులికాట్ వైల్డ్ లైఫ్ డిపార్ట్‌మెంట్ ( Pulicat Wildlife Department ) ఒక బర్డ్ శాంక్చువరిని ఏర్పాటు చేసింది.

వలస పక్షులు ఎప్పుడు వస్తాయి ? | Nelapattu Birds Sanctuary Details

అక్టోబర్ నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో ఇక్కడికి 50కి పైగా పక్షులు వచ్చి గుడ్లు పెట్టి, పొదిగి పిల్లల్ని పోషించి తిరిగి అక్కడి నుంచి వెళ్లిపోతాయి. నేలపట్టు పక్షుల కేంద్రం 458.92 హెక్టార్ల మేరా విస్తరించి ఉంది. ఈ పక్షుల కేంద్రానికి నైజీరియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, బర్మా వంటి దేశాల నుంచి పక్షులు వస్తుంటాయి. నేలపట్టు నుంచి పులికాట్ సరస్సు ( Pulicat Lake ) కేవలం 20 కిమీ దూరంలో ఉంటుంది.

Prayanikudu WhatsApp2
| ప్రయాణికుడు వాట్సాప్ గ్రూపులో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

తేదీలు | Dates Of 2025 Flamingo Festival

ఇలా ప్రతీ సంవత్సరం వలస వచ్చే పక్షుల కోసం ఫ్లెమింగో ఫెస్టివల్ ( Flamingo Festival ) అనే పేరుతో ఒక పక్షుల పండగను నిర్వహిస్తారు. 2025 లో ఈ పండగ జనవరి 18 నుంచి 20 వరకు మూడు రోజుల పాటు జరగనుంది.

ఫెస్టివల్ జరిగే ప్రాంతాలు | Places Of 2025 Flamingo Festival

2025 లో ఫ్లెమింగో ఫెస్టివల్‌ను మొత్తం 5 ప్రాంతాల్లో నిర్వహించనున్నారు. విదేశాల నుంచి వలస వచ్చే పక్షులు అవి గూడ్లు ఏర్పాటు చేసుకునే ప్రాంతాలు, వేటాడి ప్రాంతాలను బట్టి ఈ ప్రాంతాలను బట్టి ఈ ప్రాంతాల్లో పక్షుల పండగను వైభవంగా నిర్వహిస్తారు.

  1. సూళ్లూరుపేట ( Sullurpeta )
  2. అతకని తిప్ప ( Atakanitippa)
  3. శ్రీసిటీ ( Sri City )
  4. నేలపట్టు ( Nelapattu )
  5. బీవీ పాలెం ( BV Palem )

నేలపట్టు ఎక్కడుంది ? | Where Is Nelapattu Bird Sanctuary

Nelapattu Bird Sanctuary
సంతానోత్పక్తి కోసం వేల కిమీ ఎగిరి వచ్చే అరుదైన పక్షులు


పక్షుల ప్రపంచం నేలపట్టు అనేది తిరుపతి సమీపంలోని నాయుడుపేట సూళ్లూరుపేట మధ్యలో ఉన్న జాతీయ రహాదారికి సమీపంలో ఉంటుంది. ఇది కొన్ని 100 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది.

నేలపట్టు ఎలా చేరుకోవాలి ? How To reach Nelapattu Bird Sanctuary ?

నేలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రానికి రైలు, విమానం, రోడ్డు మార్గాన చేరుకోవచ్చు.

విమానంలో | Nearest Airport To Nelapattu

మీరు విమానంలో రావాలి అనుకుంటే దగ్గర్లో అంటే 67 కిమీ దూరంలో తిరుపతి విమానాశ్రయం ఉంది. మీరు తిరుపతి ( Tirupati ) చేరుకుని అక్కడి నుంచి బస్సు లేదా ప్రైవేట్ వాహనంలో బర్డ్ శాంక్చువరికి చేరుకోవచ్చు.

రైలు మార్గంలో | Nearest Railway Station To Nelapattu

నేలపట్టుకు దగ్గర్లో ఉన్న రైల్వే స్టేషన్లు వచ్చేసి నాయుడుపేట, సుళ్లూరుపేట స్టేషన్లు ఇవి 13 కిమీ దూరంలో ఉంటాయి. గూడూరు రైల్వే స్టేషన్ 41 కీమీ దూరంలో ఉంటుంది. సూళ్లూరుపేట, నాయుడుపేట నుంచి మీరు దొరవారి సత్రం మైలాంగం చేరుకొని అక్కడి నుంచి ప్లాన్ చేసుకోవచ్చు. దొరవారి సత్రం నుంచి బర్డ్ శాంక్చువరి కేవలం 3 కిమీ దూరంలో ఉంటుంది.

బస్సు మార్గంలో | Bus To Nelapattu

సూళ్లూరుపేటకు మీరు బస్సు మార్గంలో కూడా చేరుకోవచ్చు. దగ్గర్లో తిరుపతి బస్టాండ్, గూడూరు బస్టాండ్‌లు ఉంటాయి.

నేలపట్టు టైమింగ్ | Timings Of Nelapattu Bird Sanctuary

నేలపట్టు పక్షుల కేంద్రానికి మీరు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో సందర్శించవచ్చు. ఇక బెస్ట్ టైమ్ వచ్చేసి నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు వెళ్లవచ్చు.

టికెట్ ధరలు | Nelapattu Bird Sanctuary Entry Fee

  • పెద్దలకు రూ.2
  • పిల్లలకు రూ.1
  • విదేశీయులకు రూ.400
  • బస్, లారీ, భారీ వాహనాలు రూ.100
  • జీపు, కారు రూ.50
  • ఆటో రిక్షాలు, బైక్ రూ.10
  • కెమెరా రూ.50

గమనిక :ఈ ధరలు పాతవి. ధరల్లో స్పల్ప మార్పు జరిగే అవకాశం కూడా ఉంది.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పక్షి ప్రేమికులు ( Bird Lovers ) ఇలాంటి పక్షుల పండగ ఎప్పుడు జరుగుతుందా అని ఎదురు చూస్తుంటారు. లక్కీగా మన తెలుగు రాష్ట్రాల్లోనే ఒక చోట ఫ్లెమింగో ఫెస్టివల్ పేరుతో పక్షుల వేడుక జరుగుతోంది. సో అవకాశం ఉంటే ఈ అరుదైన ఫెస్టివల్‌కు వెళ్లండి. మీరు నేల పట్టు గురించి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ కింది స్టోరీ చదవండి.

ఈ  Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.

Share This Story

Leave a Comment

error: Content is protected !!