Jyoti Malhotra : దేశ రహస్యాలను పాక్‌కు చేరవేసిన యూట్యూబర్…

షేర్ చేయండి

Jyoti Malhotra : హరియాణాకు చెందిన ప్రముఖ యూబ్యూబర్ జ్యోతి మల్హోత్రను గూఢచర్యం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రావెల్ విత్ జో అనే పేరుతో య్యూట్యూబ్ ఛానెల్ నడుపుతోన్న జ్యోతికి 3,77,000 మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. పాకిస్తాన్‌కు భారత దేశానికి సంబంధించిన కీలక విషయాలను షేర్ చేస్తుందని తెలియడంతో ఆమె సబ్‌స్క్రైబర్లు షాక్‌కు గురయ్యారు.

జ్యోతి అనే ఆ యూట్యూబర్‌ను హరియాణాకు చెందిన హిసార్ పోలీసులు గూఢచర్యం, సున్నితమైన సమాచారాన్ని పాక్ ఇంటలిజెన్స్ ఏజేన్సీలకు షేర్ చేసిన కేసులో అరెస్ట్ చేశారు. అఫిషియల్ సీక్రెట్ యాక్ట్ 1923, భారతీయ న్యాయ సంహిత ప్రకారం అమెపై కేసు నమోదు చేసి రిమాండ్‌లోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసును ఆర్థిక నేర విభాగం పరిధిలో ఉంది.

పాక్‌తో లింకు | Links to Pakistani Operatives

ఎఫ్‌ఐఆర్ ప్రకారం న్యూ ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్‌లో పని చేసే వ్యక్తితో జ్యోతికి పరిచయం ఏర్పడింది. అతను ఆమె హ్యాండ్లర్‌గా పని చేశాడట. తరువాత కేవలం 2023 లోనే రెండు సార్లు పాకిస్తాన్ వెళ్లింది జ్యోతి. ఈ సమయంలో కొత మంది పాక్ ఇంటెలిజెన్స్ అధికారులు పరిచయం అయ్యారట. అందులో కొంత మందితో కలిసి బాలీ (Bali) కూడా వెళ్లింది.

జ్యోతితో పాటు మొత్తం ఆరుగురిని దేశద్రోహం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు.  పాకిస్తాన్‌లోని తమ హ్యాండ్లర్లకు కీలక సమాచారాన్ని వీళ్లు అందించారన పోలీసులు తెలిపారు. 

అయితే జ్యోతితో పాటు యాత్రి డాక్టర్ (yatri doctor) అనే య్యూట్యూర్‌, పంజాబ్‌కు చెందిన ఒక ట్రావెల్ వ్లాగర్ 2025 మార్చిలో పాకిస్తాన్ హై కమిషన్ ఇచ్చిన ఒక విందులో  పాల్గొన్నారు. దీంతో పాకిస్తాన్ వెళ్లిన మిగితా యూట్యూబర్లను విచారించాలని నెటిజెన్లు కోరుతున్నారు.

📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!